తులా రాశిలో సూర్య సంచారం, 5 రాశిచక్రాల బ్యాంకు బ్యాలెన్స్ 31 రోజులపాటు పెరుగుతుంది!
సూర్య భగవానుడు అక్టోబర్ 17న తులా రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో ఐదు రాశుల వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు రాశుల వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి.
జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడి సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల రాశుల మార్పు మానవ జీవితంపై, దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం తన సొంత రాశి అయిన సింహంలో సంచరిస్తున్న సూర్య భగవానుడు త్వరలోనే రాశి మారబోతున్నారు. సెప్టెంబర్ 17 వరకు సింహ రాశిలోనే ఉండనున్న సూర్యుడు, ఆ తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు.

అక్కడ కొంతకాలం సంచరించిన అనంతరం అక్టోబర్ 17న రాత్రి 7:58 గంటలకు శుక్రుడి ఆధిపత్యం ఉన్న తులా రాశిలోకి అడుగుపెడతారు. ప్రముఖ జ్యోతిష్య పండితులు నరేంద్ర ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం, సూర్యుడి ఈ రాశి మార్పు వల్ల ఏకంగా ఐదు రాశుల వారికి అదృష్టం తలపు తట్టనుంది. అక్టోబర్ మధ్య నుంచి రాబోయే నెల రోజుల పాటు ఈ రాశుల వారి జీవితంలో సువర్ణావకాశాలు రానున్నాయి.
తులా రాశిలో సూర్య సంచారం
1.మేష రాశి వారికి ఆర్థిక ఊరట
సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించడం మేష రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఆఫీస్‌లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు నూతన లాభాలు ఆర్జించే మార్గాలు సుగమమవుతాయి. నిలిచిపోయిన డబ్బు చేతికి అందడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. దీని వల్ల ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ముఖ్యమైన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి.
2.సింహ రాశి వారికి ధనలాభం
సింహ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుంది. ఆదాయాన్ని పెంచే కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు లేదా ఉన్నత అవకాశాలు లభించే సూచనలున్నాయి. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు లేదా పేమెంట్స్ ఈ సమయంలో క్లియర్ అవుతాయి. సంపాదనకు, ఖర్చులకు మధ్య సరైన సమతుల్యత ఏర్పడుతుంది.
3.కన్యా రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి
సూర్య గోచర ప్రభావం కన్యా రాశి వారికి కూడా లాభదాయకంగా మారనుంది. ఆర్థిక పరంగా ఈ కాలం మీకు అద్భుతమైన సంకేతాలను ఇస్తోంది. ఊహించని విధంగా ఎక్కడి నుంచో ధనలాభం కలగడం వల్ల మనస్సు సంతోషంతో నిండిపోతుంది. ఉద్యోగం చేసేవారికి వేతనం పెరిగే బలమైన అవకాశాలున్నాయి. వ్యాపారంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి లాభాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల చేసే ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు.
4.తులా రాశిలో ప్రత్యేక సంచారం
సూర్యుడు నేరుగా తులా రాశిలోనే ప్రవేశిస్తుండడంతో ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలు దక్కుతాయి. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. కొత్తగా సంపాదించే మార్గాలు అన్వేషిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. సహచరులు, సీనియర్ల సహకారంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో కీలకమైన ఒప్పందాలు కుదిరి మంచి లాభాలను ఆర్జిస్తారు.
5.ధనుస్సు రాశి వారికి అదృష్టం
ధనుస్సు రాశి వారికి సూర్యుడి ఈ సంచారం అనేక ధనలాభ అవకాశాలను తీసుకురానుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి రాబడులు వస్తాయి. మొత్తానికి అక్టోబర్ 17 నుంచి వచ్చే 31 రోజుల పాటు ఈ రాశుల వారి ఆర్థిక స్థితి చాలా బలంగా మారుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


