Krishnashtami 2026: సూర్యుడు, బుధుడు, కేతువు కలయిక.. జన్మాష్టమి వేళ ఈ రాశులకు మహా అదృష్టం!

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అరుదైన గ్రహాల కలయిక ఏర్పడిందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. శని వక్రీ స్థితిలో ఉండగా, సింహరాశిలో సూర్యుడు, బుధుడు, కేతువు కలయికతో త్రిగ్రాహి యోగం, సూర్య–బుధుల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడినట్లు పేర్కొంటున్నారు.  

Published on: Sep 4, 2026, 11:00:39 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినానికి అత్యంత విశిష్టత ఉంది. ఈ పవిత్ర దినాన కేవలం ఉత్సవాలే కాకుండా, ఆకాశంలో అరుదైన గ్రహాల గమనం చోటుచేసుకుంది. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, అనేక సంవత్సరాల తర్వాత జన్మాష్టమి నాడు ఇలాంటి ఖగోళ అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ ప్రత్యేక సమయంలో ఏర్పడిన గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి జాక్‌పాట్ లాంటి ఫలితాలను అందించనుంది.

Krishnashtami 2026: సూర్యుడు, బుధుడు, కేతువు కలయిక.. జన్మాష్టమి వేళ ఈ రాశులకు మహా అదృష్టం! (AI)
Krishnashtami 2026: సూర్యుడు, బుధుడు, కేతువు కలయిక.. జన్మాష్టమి వేళ ఈ రాశులకు మహా అదృష్టం! (AI)

అరుదైన గ్రహాల సంయోగం

నేడు కృష్ణాష్టమి వేళ న్యాయదేవుడైన శనిభగవానుడు వక్రీ స్థితిలో ఉండగా, సింహ రాశిలో సూర్యుడు, బుధుడు, కేతువు కలయికతో 'త్రిగ్రాహి యోగం' ఏర్పడింది. అంతేకాకుండా, సూర్య, బుధుల కలయిక వల్ల శక్తివంతమైన 'బుధాదిత్య రాజయోగం' కూడా సిద్ధించింది. ఈ శక్తివంతమైన గ్రహాల ప్రభావం ద్వాదశ రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా మూడు రాశుల వారికి మాత్రం ఇది గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు.

తులా రాశి:

తులా రాశి వారికి ఈ ప్రత్యేక గ్రహ యోగాల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు తలపెట్టిన పనుల్లో పరాక్రమం స్పష్టంగా కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉన్నత పదవులు, వేతన పెరిగే అవకాశాలను అందుకుంటారు. ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీకు లభించే స్పష్టత అద్భుత ఫలితాలను ఇస్తుంది. కుటుంబ సహకారంతో వ్యాపారంలో నూతన శిఖరాలను అధిరోహిస్తారు. ఆర్థిక ప్రణాళికలు సజావుగా సాగి మనశ్శాంతిని ఇస్తాయి.

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ కాలం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సమాజంలో మీ వ్యక్తిగత ప్రతిష్ట ఇనుమడిస్తుంది. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా బలపడటమే కాకుండా, ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక శుభవార్త మీ ఇంటి తపుడు తడుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారికి జన్మాష్టమి వేళ ఈ రాశి వారికి ఊహించని లాభాలను తెచ్చిపెట్టబోతున్నాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మీకు సరికొత్త బాధ్యతలు లేదా పెద్ద ప్రాజెక్టుల నిర్వహణ దక్కుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహించి పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ఇది మంచి తరుణం. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More