Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు కెప్టెన్సీ వార్.. జనాలు ఎంచుకున్న కంటెస్టెంట్లు వీళ్లే.. ఫైట్ మామూలుగా లేదు
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లో ఫస్ట్ కెప్టెన్సీ పోరు షురూ అయింది. ఈ మైల్ స్టోన్ సీజన్ ను డిఫరెంట్ గా ప్లాన్ చేసిన మేకర్స్.. కెప్టెన్సీ కంటెండర్లను ఎంపిక చేసే ఛాన్స్ ఆడియన్స్ కు ఇచ్చారు. అలా ఎంపికైన కంటెండర్ల మధ్య టఫ్ ఫైట్ సాగుతోంది.
Bigg Boss Telugu 10: పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో ఉన్న గొడవలు చాలవన్నట్లు ఇప్పుడు కొత్తగా కెప్టెన్సీ రేసుతో హీట్ మరింత పెరిగింది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో సెకండ్ వీక్ కెప్టెన్సీ ఫైట్ చాలా టఫ్ గా మారింది.

పవర్ ఆఫ్ పీపుల్
బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ను మేకర్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ వీక్ ఏమో ‘మహా పరీక్ష’ పేరుతో హౌస్ మేట్స్ కావడానికి కంటెస్టెంట్లకు టాస్క్ లు పెట్టారు. మిడ్ వీక్ లోనే ఇద్దరిని ఇంటికి పంపించేశారు. ఇక ఇప్పుడు సెకండ్ వీక్ లో ‘పవర్ ఆఫ్ పీపుల్’ అనే కాన్సెప్ట్ తో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
ఆడియన్స్ ఓటింగ్
సెకండ్ వీక్ లో కెప్టెన్ కావడం కోసం బిగ్ బాస్ డిఫరెంట్ సెటప్ ప్లాన్ చేశాడు. హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్లలో ఎవరిని కెప్టెన్సీ కంటెండర్ గా చూడాలనుకుంటున్నారో, వాళ్లకు ఓట్లు వేసే ఛాన్స్ ఆడియన్స్ కు కల్పించారు. అలా ఆడియన్స్ నుంచి వచ్చిన ఓట్ల ప్రకారం 8 మందికి కెప్టెన్సీ రేసులో పోటీపడే అవకాశం కల్పించారు.
8 మంది వీళ్లే
ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కెప్టెన్సీ రేసులో పోటీపడుతున్న కంటెస్టెంట్లు.. త్రిగుణ్, దేబ్జానీ, అమన్, శాలిని, ముఖేష్, రోహిత్, ఝాన్సీ, ఆటో రాంప్రసాద్. ఈ వారం కెప్టెన్ కావడం కోసం ఈ 8 మంది పోటీపడుతున్నారు. అయితే వీళ్లకు బిగ్ బాస్ గట్టి టాస్క్ లనే ప్లాన్ చేశాడు.
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ సెకండ్ వీక్ లో కెప్టెన్సీ రేసులో ఉన్న 8 మందికి టాస్క్ లు పెడుతున్నారు. ఇందులో భాగంగా ఫస్ట్ టాస్క్ ఏమో.. మిస్ మ్యాచ్ గా ఉన్న స్పెల్లింగ్ ను గెస్ చేసి ఆ వర్డ్ ను కరెక్ట్ గా రాయాలి. అలా రాసేవాళ్లు మిగతా కంటెండర్స్ ను రేసు నుంచి తప్పించేందుకు బెలూన్ పగలగొట్టే ఛాన్స్ పొందుతారు.
మళ్లీ ఫైర్
కెప్టెన్సీ టాస్క్ తో మరోసారి బిగ్ బాస్ హౌస్ లో ఫైర్ మొదలైంది. త్రిగుణ్, రోహిత్, ముఖేష్, అమన్, శాలిని, ఝాన్సీ, రాంప్రసాద్.. ఇలా ఎవరికి వాళ్లు తమ పాయింట్ ను గట్టిగా వినిపిస్తున్నారు. అయితే ఓవరాల్ గా చూసుకుంటే త్రిగుణ్, రోహిత్ ను మెజారిటీ కంటెండర్లు టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఫస్ట్ కెప్టెన్ ఎవరవుతారన్నది వేచి చూడాల్సిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


