Bigg Boss Telugu 10: టార్గెట్ త్రిగుణ్.. ఫస్ట్ నామినేషన్స్ తో దద్దరిల్లిన బిగ్ బాస్ హౌస్.. ఇదే కదా కావాల్సింది!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ లో మళ్లీ రచ్చ మొదలైంది. వీకెండ్ ఎపిసోడ్ తర్వాత నామినేషన్స్ తో హీట్ పెరిగింది. ఈ సీజన్ లో ఫస్ట్ నామినేషన్స్ లో హౌస్ మేట్స్ లో ఎక్కువ మంది త్రిగుణ్ ను టార్గెట్ చేసినట్లు కనిపించింది. లేటెస్ట్ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

Published on: Sep 14, 2026, 12:31:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో ఇంట్రెస్టింగ్ ఘట్టం వచ్చేసింది. ఈ సీజన్ లోనే ఫస్ట్ నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. ఫస్ట్ వీక్ హౌస్ మేట్స్ కానందుకు కంటెస్టెంట్లందరినీ బిగ్ బాస్ డైరెక్ట్ గా నామినేట్ చేశాడు. ఇప్పుడు సెకండ్ వీక్ లో నామినేషన్ ఫైర్ అంటుకుంది.

టార్గెట్ త్రిగుణ్.. ఫస్ట్ నామినేషన్స్ తో దద్దరిల్లిన బిగ్ బాస్ హౌస్.. ఇదే కదా కావాల్సింది! (youtube/starmaa)
టార్గెట్ త్రిగుణ్.. ఫస్ట్ నామినేషన్స్ తో దద్దరిల్లిన బిగ్ బాస్ హౌస్.. ఇదే కదా కావాల్సింది! (youtube/starmaa)

బిగ్ బాస్ నామినేషన్స్

బిగ్ బాస్ రియాలిటీ షోలో నామినేషన్స్ కు వేరే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లోనూ ఈ నామినేషన్స్ పోరు షురూ అయింది. ఈ సీజన్ సెకండ్ వీక్ లో హౌస్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న కంటెస్టెంట్లను నామినేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. ఆ ఛాన్స్ దక్కాలంటే ఓ టాస్క్ కూడా ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.

టార్గెట్ త్రిగుణ్

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ లేటెస్ట్ ప్రోమో చూస్తే హౌస్ లో నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హీరో త్రిగుణ్ ను ఇతర టీమ్ మేట్స్ టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఎందుకంటే లేటెస్ట్ ప్రోమోలో ఎక్కువ మంది త్రిగుణ్ ను నామినేట్ చేయడం కనిపించింది.

సుధీర్ తో మొదలెట్టి

లేటెస్ట్ బిగ్ బాస్ 10 తెలుగు నామినేషన్స్ ప్రక్రియ యాంకర్ సుధీర్ తో మొదలైంది. అతను త్రిగుణ్ ను నామినేట్ చేశాడు. చైత్ర విషయంలో డిస్టర్బ్ అయిన కారణంతో త్రిగుణ్ ను సుధీర్ నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా త్రిగుణ్, సుధీర్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఆ తర్వాత శాలినిని కూడా సుధీర్ నామినేట్ చేశాడు.

ఇదే షాకింగ్

నామినేషన్ ప్రక్రియలో దేబ్జానీ కూడా త్రిగుణ్ ను నామినేట్ చేసింది. అయితే ఇందులో త్రిగుణ్ పేరును రోహిత్ చెప్పడం షాకింగ్ అనే చెప్పొచ్చు. హౌస్ లోకి వచ్చినప్పటి నుంచే రోహిత్ వర్సెస్ త్రిగుణ్ అన్నట్లు ఫైట్ సాగుతోంది.

అయితే వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ముందు రోహిత్ కు త్రిగుణ్ సారీ చెప్పాడు. రోహిత్ కూడా త్రిగుణ్ ను హార్ట్ కు దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో గొడవ అంతా సర్దుమణిగిందనే అనిపించింది. కానీ రోహిత్ ఏమో త్రిగుణ్ ను నామినేట్ చేశాడు.

ఇక నామినేషన్ మధ్యలో సృష్టి పేరు వచ్చింది. త్రిగుణ్ డబుల్ గేమ్ ఆడుతున్నాడని సుధీర్, రోహిత్ ఫైర్ అయ్యారు. దీనికి త్రిగుణ్ కూడా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More