Bigg Boss 10: ఏం ప్లాన్ చేస్తున్నారయ్యా బాబు.. బిగ్ బాస్ 10 తెలుగు ఫ‌స్ట్ వీక్‌లోనే ముగ్గురు అవుట్.. కొత్తవాళ్ల ఎంట్రీ?

Bigg Boss 10: ఇవేం ట్విస్ట్ లు బాబాయ్.. అసలు ఏం ప్లాన్ చేశారయ్యా.. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ చూస్తున్న ఆడియన్స్ కు కలుగుతున్న ప్రశ్నలివే. అవును.. మరి మైల్ స్టోన్ సీజన్ గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ 10 తెలుగులో ట్విస్ట్ లు మామూలుగా లేవు. ఫస్ట్ వీక్ లోనే ముగ్గురు ఎలిమినేట్ అనేదే హాట్ టాపిక్.

Published on: Sep 12, 2026, 18:41:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10: దశాతవారం కాన్సెప్ట్ తో బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ను స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ సారి ఆటలో సవాలు కాదే ఆటే సవాలు అంటూ ట్యాగ్ లైన్ ను స్ట్రాంగ్ గానే డిజైన్ చేశారు. కానీ మరీ ఇంత సవాలా? అని నెటిజన్లు ఇప్పుడు అవాక్కవుతున్నారు. అందుకు కారణం బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ ఫస్ట్ వీక్ లోనే ముగ్గురి కంటెస్టెంట్ల ఎలిమినేషనే అని చెప్పొచ్చు.

ఏం ప్లాన్ చేస్తున్నారయ్యా బాబు.. బిగ్ బాస్ 10 తెలుగు ఫ‌స్ట్ వీక్‌లోనే ముగ్గురు అవుట్.. కొత్తవాళ్ల ఎంట్రీ? (youtube/starmaa)
ఏం ప్లాన్ చేస్తున్నారయ్యా బాబు.. బిగ్ బాస్ 10 తెలుగు ఫ‌స్ట్ వీక్‌లోనే ముగ్గురు అవుట్.. కొత్తవాళ్ల ఎంట్రీ? (youtube/starmaa)

బిగ్ బాస్ 10 తెలుగు ఎలిమినేషన్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్లో ఫస్ట్ వీక్ లో ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఇందులో కామనర్ చరణ్, సెలబ్రిటీ చైత్ర రాయ్ ఉన్నారు. వరుసగా ఒక రోజు తర్వాత ఒకరు హౌస్ నుంచి వెళ్లిపోయారు. ఫస్ట్ వీక్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండటమే ట్విస్ట్ అనుకుంటే.. వీకెండ్ రాకముందే ఇద్దరు అవుట్ అవడం ఇంకా పెద్ద ట్విస్ట్.

ఇద్దరు కాదు ముగ్గురు

ఇక ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగులో మరో బిగ్ ట్విస్ట్ ఉండబోతుందని తెలిసింది. అదే మరో ఎలిమినేషన్. బిగ్ బాస్ రియాలిటీ షోలో వీకెండ్ లో ఎలిమినేషన్ ఉండటం కామనే. అయితే ఈ సీజన్ లో మిడ్ వీక్ లోనే రెండు ఎలిమినేషన్లు జరిగాయి కదా మరి వీకెండ్ ఎలిమినేషన్ ఉంటుందో లేదో అనే డౌట్ వద్దు. ఎందుకంటే ఎలిమినేషన్ కచ్చితంగా ఉందని తెలిసింది.

ఆ కంటెస్టెంట్ అవుట్

బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో వీకెండ్ ఎపిసోడ్లో సెలబ్రిటీ కృష్ణుడు ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. నామినేషన్లో ఉన్న ఆయనకు ఓటింగ్ పరంగా తక్కువ ఓట్లు రావడమే ఇందుకు కారణమని టాక్. ఓటింగ్ లో కృష్ణుడు లాస్ట్ ప్లేస్ లో ఉన్నారని సమాచారం.

కొత్తవాళ్ల ఎంట్రీ?

బిగ్ బాస్ 10 తెలుగు గ్రాండ్ లాంఛ్ రోజు 16 మంది హౌస్ లో అడుగుపెట్టారు. ఇందులో ఆరుగురు కామనర్లు, పది మంది సెలబ్రిటీలున్నారు. వీళ్లలో ఫస్ట్ వీక్ కే ముగ్గురు ఖాళీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డు ఎంట్రీలపై చర్చ జోరందుకుంది. వీలైనంత త్వరగా వైల్డ్ కార్డుల ద్వారా కొత్తవాళ్లను హౌస్ లోకి పంపిస్తారనేది హాట్ టాపిక్ గా మారింది.

అయితే బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డు ద్వారా వెళ్లే కంటెస్టెంట్లు వీళ్లే అని కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లలో నందూస్ వరల్డ్ నందు, సీరియల్ హీరో శివ కుమార్, సీరియల్ హీరోయిన్ కావ్య శ్రీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరి వైల్డ్ కార్డు ద్వారా ఎవరు వస్తారో వేచిచూడాలి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More