Bigg Boss 10 Telugu Trigun: అగ్రెసివ్ గేమ్-ఇదేనా హీరో ప్లాన్? బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లో ఫస్ట్ రోజు నుంచే త్రిగుణ్ రచ్చ
Bigg Boss 10 Telugu Trigun: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ ఇలా స్టార్ట్ అయిందో లేదో.. గొడవలు అలా మొదలయ్యాయి. ముఖ్యంగా హీరో త్రిగుణ్ బిహేవియర్ హాట్ టాపిక్ గా మారింది. అగ్రెసివ్ గేమ్ ప్లాన్ తోనే అతను హౌస్ లోకి వచ్చాడేమోననే డౌట్లు కూడా వస్తున్నాయి. డామినేటింగ్ ప్రవర్తనతో అతను హౌస్‌లో రచ్చ రేపుతున్నాడు.
Bigg Boss 10 Telugu Trigun: టీవీ రేటింగ్స్ లో టాప్ లేపేందుకు పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' వచ్చేసింది. మొత్తం 16 మంది కంటెస్టెంట్లతో సీజన్ గ్రాండ్ గా లాంఛ్ అయింది. అయితే ఫస్ట్ రోజు నుంచే హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలై వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా హీరో త్రిగుణ్ హౌస్‌లో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.

బిగ్ బాస్ 10 త్రిగుణ్
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో హౌస్‌లోకి రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన త్రిగుణ్.. డే 1 నుంచి అగ్రెసివ్ మైండ్ సెట్ తో సాగిపోతున్నాడు. మనసులోని మాటలను ఏమాత్రం మొహమాటం లేకుండా, అవతలి వాళ్లు ఏమనుకుంటారో అని కూడా చూడకుండా చెప్పేస్తున్నాడు. ప్రతి చర్చలోనూ తన మాటే చెల్లాలనేలా డామినెన్స్ చూపిస్తున్నాడు.
గొడవలే గొడవలు
హౌస్ లోకి వచ్చి ఒక్క రోజు కూడా కాకముందే త్రిగుణ్ కారణంగా గొడవలు స్టార్ట్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. అనవసరంగా సీరియల్ హీరో ముఖేష్ గౌడను త్రిగుణ్ హర్ట్ చేశారని అంటున్నారు. ముఖేష్ క్యాజువల్ గా మాట్లాడినా కూడా ఇంటరాప్ట్ చేస్తున్నావని త్రిగుణ్ ఫైర్ అయ్యాడు.
ఇక హౌస్ లో రెండు టీమ్స్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే టీమ్ లీడర్ ను ఎన్నుకునే క్రమంలోనూ రోహిత్ తో త్రిగుణ్ గొడవ పెట్టుకున్నాడు. అగ్రెసివ్ గా దూసుకెళ్లాడు. దీంతో అతని తీవ్రమైన వైఖరి, డామినేటింగ్ బిహేవియర్ హౌస్‌లోని మిగిలిన సభ్యులకు ఎంతమాత్రం రుచించడం లేదు.
సోషల్ మీడియాలో
మొదటి రోజే హౌస్‌మేట్స్ మధ్య తీవ్రమైన వాగ్వాదాలు, అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ 10వ సీజన్ ఎంత డ్రామాటిక్‌గా ఉండబోతోందో స్పష్టమవుతోంది. త్రిగుణ్ ప్రవర్తనపై సోషల్ మీడియాలోనే రచ్చ కొనసాగుతోంది. "త్రిగుణ్ చాలా తొందరపడుతున్నాడు. హౌస్ లో డామినెన్స్ కోసం ప్రయత్నిస్తున్నాడు’’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అగ్రెసివ్ గేమ్ సక్సెస్ ఇస్తుందా?
ఈ బిగ్ బాస్ రియాలిటీ షోలో త్రిగుణ్ అగ్రెసివ్ మైండ్ గేమ్ తొలి రోజే సంచలనం సృష్టిస్తోంది. ఈ విధమైన ముక్కుసూటి వైఖరి త్రిగుణ్‌ను బిగ్ బాస్ హౌస్‌లో ఒక బలమైన టైటిల్ పోటీదారుగా నిలబెడుతుందా లేక మిగిలిన కంటెస్టెంట్లందరినీ అతనికి వ్యతిరేకంగా మారుస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. రాబోయే వారాల్లో నామినేషన్లు, టాస్కులు ఊపందుకునే కొద్దీ త్రిగుణ్ ప్లాన్స్ హౌస్ వాతావరణాన్ని మరిన్ని ఉత్కంఠభరిత మలుపులు తిప్పే అవకాశం ఉంది.
హీరో టు బిగ్ బాస్
త్రిగుణ్ అసలు పేరు అదిత్ అరుణ్. అతను 2009లో జెనీలియాతో కలసి చేసిన 'కథ' మూవీతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత గరుడవేగా, 24 కిసెస్, డియర్ మేఘ, చీకటి గదిలో చితక్కొట్టుడు వంటి దాదాపు 30కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించారు. 2022లో తన పేరును త్రిగుణ్‌గా మార్చుకున్న ఈ హీరో, ఇటీవలే 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


