Anshu: మన్మథుడు హీరోయిన్ సుమో ఫైట్ చూశారా? ఈ బ్యూటీని ఎత్తి పడేసిన మల్ల యోధుడు.. వీడియో వైరల్

Anshu: 'మన్మథుడు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అన్షు వీడియో ఒకటి వైరల్ గా మారింది. జపాన్ వెకేషన్‌లో సుమో రెజ్లర్‌తో అన్షు తలపడిన క్రేజీ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడున్నాయి చూసేయండి. 

Published on: Jul 19, 2026, 20:42:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Anshu: కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ క్లాసిక్ సినిమా ‘మన్మథుడు’. ఇది ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటుంది. అందులో మహేశ్వరి పాత్రలో ఎంతో అమాయకంగా, అందంగా నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి అన్షు. ఆమె సోషల్ మీడియాలో మళ్లీ వార్తల్లో నిలిచింది.

మన్మథుడు హీరోయిన్ సుమో ఫైట్ చూశారా? ఈ బ్యూటీని ఎత్తి పడేసిన మల్ల యోధుడు.. వీడియో వైరల్ (instagram)
మన్మథుడు హీరోయిన్ సుమో ఫైట్ చూశారా? ఈ బ్యూటీని ఎత్తి పడేసిన మల్ల యోధుడు.. వీడియో వైరల్ (instagram)

అన్షు సుమో ఫైట్

చాలా కాలంగా వెండితెరకు దూరమై, రీసెంట్ గా మజాకా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన అన్షు వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ సీనియర్ బ్యూటీ, తాజాగా తన జపాన్ పర్యటనకు సంబంధించిన ఒక క్రేజీ వీడియోను పంచుకుంది. అక్కడ ఆమె ఒక భారీకాయుడైన అసలైన సుమో రెజ్లర్‌తో రింగ్‌లో ఆమె తలపడటం ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. బీస్ట్ తో బ్యూటీ ఫైటింగ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సుమో రింగ్‌లో 'మన్మథుడు' మహేశ్వరి

జపాన్ సాంప్రదాయ క్రీడ, అక్కడి సంస్కృతికి ప్రతీకగా నిలిచే సుమో రింగ్‌లోకి అన్షు సరదాగా అడుగుపెట్టింది. ప్రొఫెషనల్ సుమో రెజ్లర్‌తో పోటీ పడింది. అయితే, ఆ భారీ రెజ్లర్ కేవలం ఒక్కసారిగా అన్షును ఎత్తి పడేశాడు. ఆ తర్వాత అన్షును రింగ్ బయటకు తోసేశాడు. ఈ ఫన్నీ అండ్ థ్రిల్లింగ్ వీడియోను ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోగా, అది చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

నిలిచిపోయే అనుభవం

ఈ వినూత్న అనుభూతిని అభిమానులతో పంచుకుంటూ అన్షు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టింది. "జపాన్ వెళ్లాక సుమో రింగ్‌లోకి అడుగు పెట్టకుండా ఎలా తిరిగి వస్తాం? ఇది కచ్చితంగా నా జీవితకాల జ్ఞాపకాల్లో నిలిచిపోయే అద్భుతమైన అనుభవం" అని ఆమె రాసుకొచ్చింది. ఇంతటి మరపురాని అనుభవాన్ని అందించినందుకు తన స్నేహితులు ఏంజెలా రాయ్, సందీప్‌లకు ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

టాలీవుడ్ జ్ఞాపకాలు

మన్మథుడు సినిమాతో తెలుగులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న అన్షు, ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'రాఘవేంద్ర' చిత్రంలోనూ హీరోయిన్ గా నటించింది. ఆ రెండు సినిమాల తర్వాత ఆమె పెళ్లి చేసుకుని లండన్‌లో సెటిల్ అయింది. కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఫ్యామిలీకి ప్రాధాన్యతనిచ్చింది.

చాలా కాలం తర్వాత రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘మజాకా’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది అన్షు. మరోవైపు సోషల్ మీడియాలో హాట్ పోజులతో అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More