Poonam Pandey: పబ్లిక్ లో పూనమ్ పాండేను కిస్ చేసుకోబోయిన ఫ్యాన్..తోసేసిన బోల్డ్ బ్యూటీ..వీడియో వైరల్..అంతా స్క్రిప్టేనా?
Poonam Pandey: బోల్డ్ బ్యూటీ పూనమ్ పాండే ఏది చేసినా సంచలనమే. తాజాగా ఈ భామను ఓ ఫ్యాన్ పబ్లిక్ గా కిస్ చేసేందుకు ట్రై చేయడం కలకలం రేపుతోంది. వెంటనే ఆ వ్యక్తిని పూనమ్ తోసేసింది. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ గా మారింది. అయితే ఇదంగా స్ట్రిప్ట్ అని, పబ్లిసిటీ స్టంట్ అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
Poonam Pandey: సెలబ్రిటీల పబ్లిక్ లైఫ్, పాపారాజీ కల్చర్, ఫ్యాన్ బౌండరీస్ చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం పూనమ్ పాండే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ఫ్యాన్ సెల్ఫీ పేరుతో ఆమెను ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించినట్లు ఆ వీడియోలో ఉంది.

పూనమ్ పాండేకు ముద్దు
ముంబైలో పూనమ్ పాండే ఎప్పటిలాగే మీడియా కెమెరాలకు ఫోజులిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక గుర్తుతెలియని వ్యక్తి సెల్ఫీ తీసుకోవాలనే సాకుతో ఆమెకు చాలా దగ్గరగా వచ్చాడు. పూనమ్ అతడికి ఫోజ్ ఇస్తుండగా, ఒక్కసారిగా ఆ వ్యక్తి ఆమెను పబ్లిక్‌గా కిస్ చేయడానికి ప్రయత్నించాడు. దీంతో పూనమ్ పాండే షాక్ అయింది.
వీడియో వైరల్
సెల్ఫీ పేరుతో వచ్చిన ఫ్యాన్ కిస్ పెట్టాలని ట్రై చేయడంతో పూనమ్ తీవ్ర అసౌకర్యానికి, ఆందోళనకు గురైంది. వెంటనే అతడిని గట్టిగా పక్కకు తోసేసింది. ఆమె ముఖంలో కనిపించిన ఆ టెన్షన్, కోపం మీడియా కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే విపరీతమైన వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వెళ్లింది.

స్క్రిప్ట్ అంటూ సెటైర్లు
సాధారణంగా ఇలాంటి పబ్లిక్ హాస్పాట్ ఘటనలు జరిగినప్పుడు సదరు మహిళా సెలబ్రిటీకి నెటిజన్ల నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. కానీ పూనమ్ పాండే విషయంలో ఇండస్ట్రీలో ఒక భిన్నమైన చర్చ నడుస్తోంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను ఒక ‘స్క్రిప్టెడ్ డ్రామా’ లేదా పబ్లిసిటీ స్టంట్‌గా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఆ డ్రామాలతో
పూనమ్ పాండేకు జరిగిన ఈ చేదు అనుభవం నిజమైనదే కావొచ్చు. అయినప్పటికీ, నెటిజన్లు దీనిని నమ్మకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో ఆమె సర్వికల్ క్యాన్సర్ అవేర్‌నెస్ పేరుతో తను చనిపోయినట్లు ఒక పెద్ద ఫేక్ డ్రామా ఆడి తన ఓన్ క్రెడిబిలిటీని పూర్తిగా పోగొట్టుకుంది. అంతే కాకుండా తాను ప్రెగ్నెంట్ అని చెప్పి, ఆ తర్వాత ఏప్రిల్ ఫూల్ అనేసింది.
ఆ పాత చేదు జ్ఞాపకాల వల్లే ఇప్పుడు పూనమ్ పాండే నిజంగానే ఒక పబ్లిక్ వేధింపునకు గురైనా కూడా జనాలు దానిని కేవలం ‘పాపారాజీ ప్రాంక్’ లేదా అటెన్షన్ కోసం చేసిన ప్లాన్డ్ స్టంట్‌గా చూస్తున్నారు. సెలబ్రిటీలు పదే పదే ఫేక్ పబ్లిసిటీ స్టంట్స్ చేయడం వల్ల, భవిష్యత్తులో నిజమైన ముప్పు వచ్చినప్పుడు కూడా సమాజం ఎంత నిర్లిప్తంగా స్పందిస్తుందో చెప్పడానికి ఈ ప్రస్తుత ట్రోలింగ్ ఒక క్లాసిక్ ఉదాహరణ.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


