Anupama Parameshwaran: పెళ్లికి ముందే నాకు బేబీ కావాలి.. పెళ్లవుతుందో లేదో తెలియదు: అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

Anupama Parameshwaran: అనుపమ పరమేశ్వరన్ పిల్లల విషయంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. క్రేజీ కళ్యాణం సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె.. పెళ్లి కాకుండా తల్లి కావాలనుకుంటున్నట్లు చెప్పడం విశేషం.

Published on: Oct 16, 2026, 22:01:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Anupama Parameshwaran: టాలీవుడ్ క్యూట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా చేసిన బోల్డ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం 'క్రేజీ కల్యాణం' (Crazy Kalyanam) మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఈ బ్యూటీ.. తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ప్రగ్నెన్సీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సంప్రదాయ ఆలోచనలకు భిన్నంగా ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Anupama Parameshwaran: పెళ్లికి ముందే నాకు బేబీ కావాలి.. పెళ్లవుతుందో లేదో తెలియదు: అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Anupama Parameshwaran: పెళ్లికి ముందే నాకు బేబీ కావాలి.. పెళ్లవుతుందో లేదో తెలియదు: అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

పెళ్లి, పిల్లల విషయంలో తన తల్లిదండ్రుల నుంచి ఎలాంటి తొందరపాటు లేదని, ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే నిర్ణయం తీసుకోవడానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారని అనుపమ స్పష్టం చేశారు. అయితే వివాహ వ్యవస్థపై మాట్లాడుతూనే తాను మనసులో అనుకుంటున్న ఒక వింత కోరికను బయటపెట్టారు.

పెళ్లి అనేది ఇద్దరి మధ్య గౌరవం కోసం మాత్రమే

పెళ్లి గురించి అనుపమ మాట్లాడుతూ.. వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు పరస్పర గౌరవంతో, సంతోషంగా కలిసి అడుగులు వేయడానికి ఉద్దేశించినదే తప్ప, అమ్మాయిని కేవలం ఇంటికే పరిమితం చేసే బంధం కాదని కుండబద్దలు కొట్టారు. సమాజంలో మహిళల పట్ల ఉండే సంప్రదాయ భావాలను ప్రశ్నిస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి.

అయితే అన్నింటికంటే ముఖ్యంగా పెళ్లి కాకముందే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చి, ఆ అమ్మతనాన్ని ఆస్వాదించాలని తన మనసులోని కోరికను ఆమె బయటపెట్టడం అందరినీ విస్తుపోయేలా చేసింది.

గతంలో తన వ్యక్తిగత అనుభవాల గురించి, గతం తాలూకు చేదు జ్ఞాపకాల గురించి ఓపెన్‌గా మాట్లాడిన అనుపమ.. ఇప్పుడు తన భవిష్యత్తు ప్రణాళికలపై చాలా స్పష్టంగా ఉన్నానని తెలిపారు. వివాహం అనే బంధంతో సంబంధం లేకుండా మాతృత్వాన్ని అనుభవించాలనే ఆమె ఆలోచన ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

అది ఎలా సాధ్యం అని ప్రశ్నించగా.. ఎలాగైనా కావచ్చు.. నేచురల్ గా లేదంటే ఐవీఎఫ్ ద్వారా కావచ్చు కదా అని అనడం గమనార్హం. పైగా పెళ్లి అవుతుందో లేదో తెలియదని కూడా చెప్పారు.

'క్రేజీ కల్యాణం' సినిమా విశేషాలు

ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన 'క్రేజీ కల్యాణం' సినిమా భారీ అంచనాల మధ్య రిలీజైంది. భద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ రాజ్ హీరోగా నటించగా.. నరేష్, తరుణ్ భాస్కర్ కీలక పాత్రల్లో కనిపించారు.

ఈ చిత్రంలో ఆమె పల్లెటూరి అమ్మాయి 'కీర్తి' పాత్రలో నటించారు. సమానత్వ భావాలున్న ఈ పాత్రలో వచ్చే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే మూవీ కంటే కూడా తల్లి కావడంపై అనుపమ చేసిన కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More