ఏఆర్ రెహమాన్ షాకింగ్ కామెంట్స్‌పై అతని కూతుళ్ల రియాక్షన్ ఇలా.. వాళ్లు కోరుకున్నవన్నీ జరగాలంటూ..
ఏఆర్ రెహమాన్ షాకింగ్ కామెంట్స్ పై దేశమంతటా ఉన్న అభిమానులు నివ్వెరపోగా.. ఇప్పుడతని కూతుళ్లు కూడా దీనిపై స్పందించారు. మలయాళ మ్యూజిక్ కంపోజర్ కైలాశ్ మేనన్ చేసిన పోస్టుపై వాళ్లు రియాక్ట్ అయ్యారు.
ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఇటీవల చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమా సమాజంలో విభజనను వాడుకుందని, బాలీవుడ్‌లో తనకు మతపరమైన కారణాలతో అవకాశాలు తగ్గాయని అతడు పరోక్షంగా కామెంట్ చేశాడు. దీనిపై కొందరు నెటిజన్లు రెహమాన్‌ను టార్గెట్ చేస్తూ.. అతడు తమిళనాడుకు, ఇండియాకు తలవంపులు తెచ్చారంటూ తీవ్ర విమర్శలు చేశారు.

విభేదించండి.. కానీ అవమానించకండి
ఈ ట్రోలింగ్‌పై మలయాళ సంగీత దర్శకుడు కైలాస్ మీనన్ ఘాటుగా స్పందించాడు. "ఏఆర్ రెహమాన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. అది ఆయన హక్కు. ఆయన అభిప్రాయంతో మీరు విభేదించవచ్చు. కానీ ఆయన అనుభవాన్ని తప్పుబట్టలేరు. విభేదించడం వేరు.. వ్యక్తిగతంగా దూషించడం వేరు. ప్రపంచం గర్వించదగ్గ కళాకారుడిని ‘డిస్‌గ్రేస్’ అని పిలవడం, ఆయన విశ్వాసాన్ని ప్రశ్నించడం విమర్శ కాదు.. అది విద్వేషం" అని కైలాస్ మీనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. దశాబ్దాలుగా భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తిని ఇలా అవమానించడం సరికాదని హితవు పలికాడు.
ఏఆర్ రెహమాన్ కూతుళ్ల రియాక్షన్ ఇదే..
కైలాస్ మీనన్ చేసిన ఈ పోస్ట్‌కు రెహమాన్ కూతుళ్లు మద్దతు తెలిపారు. అతని కూతురు ఖతీజా రెహమాన్ స్పందిస్తూ.. కైలాస్ పోస్ట్‌కు చప్పట్లు, ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేసింది. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అంతేకాకుండా "నా కష్టకాలంలో నా క్షేమ సమాచారాలు అడిగిన స్నేహితులకు దేవుడి ఆశీస్సులు ఉండాలి. వాళ్లు కోరుకున్నవన్నీ జరగాలి" అని ఒక ఎమోషనల్ నోట్ రాసింది.
మరో కూతురు రహీమా రెహమాన్ స్పందిస్తూ.. కైలాస్ మీనన్ పోస్ట్‌ను తన స్టోరీలో షేర్ చేసి, తండ్రిపై జరుగుతున్న దాడిని ఖండించింది.
ఏఆర్ రెహమాన్ వివరణ..
బీబీసీ ఏషియన్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. ముస్లిం మతానికి సంబంధించిన పదాలను సినిమాల్లో వాడే తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు మతపరమైన కారణాల వల్లే తనకు కొన్నాళ్లుగా బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయి ఉండొచ్చని అన్నాడు.
ఈ కామెంట్స్ పై దుమారం రేగడంతో రెహమాన్ కూడా క్లారిటీ ఇచ్చాడు. "సంగీతం ఎప్పుడూ సంస్కృతిని గౌరవించే, కలిపే మార్గంగానే నేను భావిస్తాను. భారతదేశమే నా ఇల్లు, నా గురువు. నా ఉద్దేశాలను తప్పుగా అర్థం చేసుకున్నారు. సంగీతం ద్వారా సేవ చేయడమే నా లక్ష్యం" అని అతడు అన్నాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


