...
...
Next Story

ఇక సినిమాల్లో పాటలు పాడను.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ సింగర్ అరిజీత్ సింగ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా

సింగర్ అరిజీత్ సింగ్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. తాను ఇకపై సినిమాల్లో ప్లేబ్యాక్ సింగర్ గా పాటలు పాడనని అనౌన్స్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా అతడు ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించాడు. అయితే తాను సంగీతాన్ని పూర్తిగా వదిలేయడం లేదని, ఇండెపెండెంట్ ఆర్టిస్టుగా కొనసాగుతానని స్పష్టం చేశాడు.

Published on: Jan 27, 2026 09:20 PM IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అరిజీత్ సింగ్ తెలుసు కదా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని గొప్ప సింగర్స్ లో ఒకడిగా పేరుగాంచాడు. తన అద్భుతమైన గొంతుతో ఎన్నో ప్రేమ పాటలకు ప్రాణం పోశాడు. అయితే అతడు ప్లేబ్యాక్ సింగింగ్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అతడు ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు.

అరిజీత్ సింగ్ ఏమన్నాడంటే..

ఇక పాటలు పాడను.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ సింగర్ అరిజీత్ సింగ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా
ఇక పాటలు పాడను.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న స్టార్ సింగర్ అరిజీత్ సింగ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా

అభిమానులు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ సింగర్ అరిజీత్ సింగ్ ఒక నోట్ రాసుకొచ్చాడు. "హలో.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇన్నాళ్లు నన్ను ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఇకపై ప్లేబ్యాక్ వోకలిస్ట్‌గా (నేపథ్య గాయకుడిగా) ఎలాంటి కొత్త అసైన్‌మెంట్‌లు తీసుకోవడం లేదని సంతోషంగా ప్రకటిస్తున్నాను. నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం" అని అతడు అన్నాడు.

అంతకుముందు తన ప్రైవేట్ ఎక్స్ అకౌంట్ 'Atmojoarjalojo' ద్వారా కూడా అతడు ఈ అనౌన్స్‌మెంట్ చేశాడు. "దేవుడు నాపై చాలా దయ చూపించాడు. నేను మంచి సంగీతాన్ని ఇష్టపడతాను. భవిష్యత్తులో ఒక చిన్న కళాకారుడిగా సొంతంగా మ్యూజిక్ చేస్తూ, మరింత నేర్చుకోవాలనుకుంటున్నాను. మీ మద్దతుకు ధన్యవాదాలు" అని రాసుకొచ్చాడు.

సంగీతం ఆపను.. కానీ..

ప్లేబ్యాక్ సింగింగ్ ఆపేసినా, సంగీతం చేయడం మాత్రం ఆపనని అరిజీత్ స్పష్టం చేశాడు. "నేను మ్యూజిక్ చేయడం ఆపనని క్లారిటీ ఇస్తున్నాను" అని చెప్పాడు. ఒక అభిమాని ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటారని అడిగినప్పుడు.. "నా నిర్ణయాన్ని సమర్థించుకోవాలా?" అంటూ నవ్వుతున్న ఎమోజీతో బదులిచ్చాడు.

అభిమానుల స్పందన..

అరిజీత్ నిర్ణయం విని అభిమానులు షాక్‌కు గురయ్యారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పుడు ఎంత బాధపడ్డామో, ఇప్పుడు అంతే బాధగా ఉందని ఒక అభిమాని పోల్చారు. "ఆయన చెప్పినట్లు మ్యూజిక్ చేస్తారు కానీ, సినిమాల్లో ఆయన గొంతు వినిపించదు. ఇది చాలా బాధాకరం" అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. "తుమ్ హి హో, బింతే దిల్ వంటి ఆణిముత్యాలను అందించారు. ఆయన గొంతు ప్రతి చోటా వినిపించేది, ఇప్పుడు అది మిస్ అవుతాం" అని ఇంకొకరు కామెంట్ చేశారు.

2005లో 'ఫేమ్ గురుకుల్' రియాలిటీ షోతో కెరీర్ మొదలుపెట్టిన అరిజీత్.. 2011లో 'మర్డర్ 2' సినిమాలోని 'ఫిర్ మొహబ్బత్' పాటతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. 'తుమ్ హి హో', 'కేసరియా' వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడాడు. రెండు జాతీయ అవార్డులతో పాటు 2025లో పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe