Shalini Pandey: షాలినీ పాండే టాప్‌లెస్ వీడియో వైరల్.. అదంతా ఏఐ జెనరేటెడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ

Shalini Pandey Topless Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తన నకిలీ ఏఐ (AI) జెనరేటెడ్ వీడియోపై నటి షాలిని పాండే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మహిళలను లక్ష్యంగా చేసుకుని సాంకేతికతను దుర్వినియోగం చేయడం ఆందోళనకరమని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Published on: Aug 31, 2026, 17:41:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Shalini Pandey Topless Video: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తర్వాత చిత్రపరిశ్రమలో సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు 'డీప్‌ఫేక్' (Deepfake) వీడియోలు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు ఈ టెక్నాలజీ దుర్వినియోగానికి బాధితులుగా మారగా, తాజాగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షాలిని పాండే కూడా దీని బారిన పడ్డారు.

Shalini Pandey: షాలినీ పాండే టాప్‌లెస్ వీడియో వైరల్.. అదంతా ఏఐ జెనరేటెడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ
Shalini Pandey: షాలినీ పాండే టాప్‌లెస్ వీడియో వైరల్.. అదంతా ఏఐ జెనరేటెడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన అర్జున్ రెడ్డి బ్యూటీ

తన రూపాన్ని మార్ఫ్ చేస్తూ నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక నకిలీ ఏఐ వీడియోపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సదరు నకిలీ వీడియోను ఎవరూ షేర్, డౌన్‌లోడ్ చేయకుండా, వెంటనే రిపోర్ట్ చేయాలని అభిమానులకు, నెటిజన్లకు పిలుపునిచ్చారు.

'అది నన్ను తీవ్రంగా కలచివేసింది'.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆవేదన

సదరు వైరల్ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన షాలిని పాండే ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. "ఇటీవల నా పేరుతో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న నకిలీ ఏఐ వీడియో గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆ వీడియో పూర్తిగా కల్పితమైనది. అందులో ఉన్నది ఎంతమాత్రం నేను కాదు. వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారి ప్రతిష్టకు భంగం కలిగించేలా సాంకేతికతను ఇలా దుర్వినియోగం చేయడం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది" అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

షేర్ చేయకండి.. వెంటనే రిపోర్ట్ చేయండి

ఇలాంటి టెక్నాలజీ దుర్వినియోగాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, దీనిని సాధారణ విషయంగా చూడకూడదని షాలిని పిలుపునిచ్చారు. "మీకు కనుక ఆ వీడియో కనిపిస్తే దయచేసి ఎవరికీ షేర్ చేయవద్దు. డౌన్‌లోడ్ లేదా ఫార్వర్డ్ చేయవద్దు. వెంటనే ఆ వీడియోపై రిపోర్ట్ చేయండి. ఆ వీడియో వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాను" అని ఆమె వీక్షకులకు విజ్ఞప్తి చేశారు.

పెరిగిపోతున్న 'డీప్‌ఫేక్' ముప్పు.. హెచ్చరించిన ప్రముఖులు

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో డీప్‌ఫేక్ వీడియోలకు బలైన వారిలో షాలిని పాండే మొదటివారేమీ కాదు. గతంలో రష్మిక మందన్న, ఆలియా భట్, దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, ఆమిర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డారు.

ఇటీవలే నటి మృణాల్ ఠాకూర్ కూడా తన ఏఐ వీడియోలపై తీవ్రంగా మండిపడుతూ, తన అనుమతి లేకుండా రూపాన్ని దుర్వినియోగం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం గమనార్హం.

షాలిని పాండే కెరీర్ ఇలా..

2017లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ 'అర్జున్ రెడ్డి' చిత్రంతో షాలిని పాండే సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రీతి పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఆ తర్వాత 'మహానటి', హిందీలో రణ్‌వీర్ సింగ్ సరసన 'జయేశ్‌భాయ్ జోర్దార్', నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్ట్ ‘మహారాజ్’లలో మెరిశారు. గతేడాది తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’, 'డబ్బా కార్టెల్' షోల ద్వారా అలరించిన షాలిని.. ప్రస్తుతం పలు కీలక ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More