Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రైడే పండుగ.. ఒకే రోజు ఐదు క్రేజీ మూవీస్, వెబ్ సిరీస్.. రష్మిక మందన్న బోల్డ్ ఫిల్మ్ కూడా..
Netflix: నెట్‌ఫ్లిక్స్ లోకి ప్రతి శుక్రవారంలాగే ఈ వారం కూడా ఐదు క్రేజీ ప్రాజెక్టులు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. వీటిలో రష్మిక నటించిన కాక్‌టెయిల్ 2తోపాటు నాలుగు ఇంటర్నేషనల్ మూవీస్, సిరీస్ కూడా ఉండటం విశేషం.
Netflix: ఈ శుక్రవారం అంటే ఆగస్ట్ 14 వీకెండ్ బింజ్ వాచ్ ప్లాన్ చేసుకుంటున్న ఓటీటీ లవర్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే లైనప్‌తో సిద్ధమైంది. ఒక్క రోజే ఏకంగా 5 క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లను స్ట్రీమింగ్ చేయడానికి గ్రాండ్ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో షాహిద్ కపూర్, రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ 'కాక్‌టెయిల్ 2'తో పాటు విదేశీ యాక్షన్, కామెడీ, స్పోర్ట్స్ డ్రామాలు ఉన్నాయి.

కాక్‌టెయిల్ 2 (Cocktail 2)
హోమి అదజానియా దర్శకత్వంలో తెరకెక్కిన 'కాక్‌టెయిల్ 2' ఈ వారం నెట్‌ఫ్లిక్స్ లో మెయిన్ అట్రాక్షన్. షాహిద్ కపూర్, కృతి సనన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాంబినేషన్‌లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ మూవీ థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇండియాలో రూ. 95.44 కోట్లు, వరల్డ్ వైడ్‌గా రూ. 147.67 కోట్లు వసూలు చేసి మంచి హిట్‌గా నిలిచింది.
కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్నా) లవ్ లైఫ్‌లోకి పాత ఫ్రెండ్ ఎల్లీ (కృతి సనన్) ఎంట్రీ ఇవ్వడంతో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు జరిగాయనేది ఈ సినిమా కథ. ఐఎండీబీ (IMDb)లో 7.6 రేటింగ్ సాధించిన ఈ చిత్రం వీకెండ్ వినోదానికి పర్‌ఫెక్ట్ ఛాయిస్.
ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా..
బాలీవుడ్ మూవీతో పాటు విభిన్న జానర్లకు చెందిన 4 ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌లు కూడా ఈ శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో ల్యాండ్ అవుతున్నాయి.
2. డోంట్ సే గుడ్‌లక్ (Don't Say Goodluck)
ఇది ఒక హృదయానికి హత్తుకునే అమెరికన్ మ్యూజికల్ ఎమోషనల్ డ్రామా. హైస్కూల్ మ్యూజికల్ ఈవెంట్‌లో లీడ్ రోల్ ప్లే చేసే సోఫీ బిరెన్‌బామ్ అనే అమ్మాయి, స్టేజ్ పైన మాత్రమే కాకుండా తన రియల్ లైఫ్‌లోనూ ఎలాంటి ఫ్యామిలీ డ్రామా ఎదుర్కొందో ఇందులో చూపించారు.
3. మై బెస్ట్ ఫ్రెండ్, హిజ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ మీ
జర్మన్ భాషలో రూపొందిన ప్యూర్ ఫ్రెండ్‌షిప్ కామెడీ మూవీ ఇది. ప్రాణస్నేహితులైన ఆలీ, మ్యాట్జే జీవితంలోకి ఒక అమ్మాయి రొమాంటిక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వారి వెకేషన్ ప్లాన్స్, ఫ్రెండ్‌షిప్ ఏ విధంగా మారిపోయాయో అవుట్ అండ్ అవుట్ ఫన్నీగా తెరకెక్కించారు.
4. ఉమ్టేటో (Umtehtoh)
ఆఫ్రికన్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఇంటెన్స్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ఇది. 'ఉమ్టెటో' అంటే వారి భాషలో చట్టం అని అర్థం. జైల్లో ఉన్న తన తమ్ముడిని రక్షించుకోవడానికి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్యాంగ్‌స్టర్ టీమ్‌లో డబుల్ ఏజెంట్‌గా మారే కథాంశంతో ఇది ఊపిరి బిగబట్టేలా సాగుతుంది.
5. టు ది మ్యాక్స్ (To The Max)
నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన స్పానిష్ స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్, వింగ్‌సూట్ బేస్ జంపింగ్ ఇష్టపడే కొందరు ఫ్రెండ్స్ జీవితంలో ఎదురైన ఊహించని ప్రమాదాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


