Arjun Sarja: సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు 'ఒకే ఒక్కడు' గుర్తొచ్చింది.. దళపతి విజయ్ మనసులోని మాట.. అర్జున్ సంచలన కామెంట్
Arjun Sarja: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్‌ను యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా 'ఒకే ఒక్కడు' సినిమా రీల్స్, రాజకీయాలపై విజయ్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను అర్జున్ హైదరాబాద్‌లో పంచుకున్నాడు. దీనిపై సంచలన కామెంట్లు చేశాడు.
Arjun Sarja: హీరో దళపతి విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి. సినీ రంగం నుంచి వచ్చి సీఎం కుర్చీపై కూర్చున్నారు. తాజాగా దళపతి విజయ్ పై, సీఎం కుర్చీ చూడగానే అతనికి వచ్చిన ఆలోచనల గురించి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా సంచలన కామెంట్లు చేశాడు. తన ‘ఒకే ఒక్కడు’ మూవీ పేరును ప్రస్తావించాడు.

ఒకే ఒక్కడు మూవీ
"నేను ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ ను కలిసినప్పుడు ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో 'ఒకే ఒక్కడు' సినిమాకు సంబంధించి వస్తున్న మీమ్స్, రీల్స్ అన్నింటినీ చూశానని చెప్పారు. అంతేకాదు, తాను మొదటిసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు, ఆ సీటును చూసి తనకు 'ఒకే ఒక్కడు' సినిమానే గుర్తొచ్చిందని విజయ్ నాతో పంచుకున్నారు" అని అర్జున్ సర్జా తెలిపాడు.
ఎంతో గర్వంగా
సినిమా రంగానికి చెందిన ఒక వ్యక్తి అత్యున్నత రాజకీయ శిఖరానికి చేరుకోవడం ఎంతో గర్వంగా ఉందని అర్జున్ అన్నాడు. "విజయ్ ముఖ్యమంత్రి కావడం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించింది. ఎందుకంటే ఆయన మన చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి’’ అని అర్జున్ తెలిపాడు.
లియోలో కలిసి
‘‘ఫస్ట్ ఎన్నికల్లోనే పోటీ చేసి, ఇంతటి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం సాధారణ విషయం కాదు. అది ఒక అద్భుతమైన విజయం. మన సినిమా పరిశ్రమ నుంచి ఒకరు అంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు మనందరికీ ఆనందంగా ఉంటుంది" అని అర్జున్ తన సంతోషాన్ని పంచుకున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'లియో' సినిమాలో అర్జున్, విజయ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.
అప్పట్లో సంచలనం
దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ 'ఒకే ఒక్కడు' (తమిళంలో ముదల్వన్) భారతీయ సినీ చరిత్రలోనే ఒక సంచలనం. ఒక సాధారణ టీవీ రిపోర్టర్ ఒక రోజు ముఖ్యమంత్రిగా మారి ఎలాంటి మార్పులు తెచ్చాడనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికీ రాజకీయాల్లో ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచింది.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఘనవిజయం సాధించింది. దీంతో ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఈ నేపథ్యంలో, విజయ్ నిజజీవిత రాజకీయ ప్రస్థానానికి, 'ఒకే ఒక్కడు' చిత్రానికి మధ్య ఉన్న పోలికలపై సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్, రీల్స్ వైరల్ అయ్యాయి.
బ్లాస్ట్ జోన్ తో
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో తనదైన ముద్ర వేసి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. 'మా పల్లెలో గోపాలుడు' చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అతను.. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సుపరిచితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్' (తమిళంలో 'బ్లాస్ట్') మే 28న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన అర్జున్.. మీడియాతో ముచ్చటించాడు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: అర్జున్ సర్జా నటించిన 'బ్లాస్ట్ జోన్' సినిమా ఎప్పుడు విడుదలవుతోంది?
జవాబు: అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్' మే 28, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ప్రశ్న: ముఖ్యమంత్రి విజయ్ గురించి అర్జున్ సర్జా ఏమన్నారు?
జవాబు: సినీ పరిశ్రమకు చెందిన విజయ్ మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి తమిళనాడు ముఖ్యమంత్రి కావడం పట్ల అర్జున్ గర్వంగా ఉందన్నారు. విజయ్ మొదటిసారి సీఎం కుర్చీ చూసినప్పుడు అర్జున్ నటించిన 'ఒకే ఒక్కడు' సినిమానే గుర్తొచ్చిందని తనకు చెప్పినట్లు వెల్లడించారు.
ప్రశ్న: 'బ్లాస్ట్ జోన్' సినిమా ప్రత్యేకత ఏమిటి?
జవాబు: ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక పూర్తిస్థాయి కరాటే ఎక్స్‌పర్ట్ (కరాటే మాస్టర్) పాత్రలో కనిపిస్తున్నారు. అలాగే, దాదాపు 26 ఏళ్ల తర్వాత నటి అభిరామితో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


