లక్షలాది మంది యూపీఎస్సీ (UPSC) ఆస్పిరెంట్లను అలరించిన టీవీఎఫ్ (TVF) మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ 'ఆస్పిరెంట్స్' (Aspirants) మూడో సీజన్‌తో తిరిగి వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈసారి కథ కేవలం ఐఏఎస్ అధికారుల బాధ్యతల చుట్టూనే కాకుండా, పాత స్నేహితుల మధ్య తలెత్తిన తీవ్రమైన విభేదాలు, ఈగో క్లాషెస్ చుట్టూ తిరుగుతోంది.
కోర్టు మెట్లెక్కిన అభిలాష్ - సందీప్ భయ్యా స్నేహం

ఆస్పిరెంట్స్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ ట్రైలర్ ప్రకారం.. నవీన్ కస్తూరియా పోషిస్తున్న అభిలాష్, సన్నీ హిందూజా పాత్ర సందీప్ భయ్యా మధ్య వైరం పరాకాష్టకు చేరుకుంది. ఏకంగా వీరిద్దరూ కోర్టు కేసుల వరకు వెళ్లడం అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది.
"హిందీ మీడియం"లో చదివిన వారితో పోల్చుకుంటూ అభిలాష్ చేసిన "ఇంగ్లీష్ మీడియం" వ్యాఖ్యలు కొత్త శత్రువులను తయారు చేశాయి. ఒకప్పుడు గురువులా భావించిన సందీప్ భయ్యాయే ఇప్పుడు అభిలాష్‌కు ఎదురు నిలబడటం ఈ సీజన్ లో ప్రధాన ఆకర్షణ.
అభిలాష్ ప్రయాణంపై నవీన్ కస్తూరియా మాటల్లో..
తమ పాత్ర గురించి నవీన్ మాట్లాడుతూ.. మూడో సీజన్ లో అభిలాష్ ప్రయాణం మరింత సంక్లిష్టంగా ఉంటుందని చెప్పాడు. "కాగితం మీద అతని కల నిజమైనట్లు కనిపిస్తుంది కానీ గ్రౌండ్ లో వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ప్రజల అంచనాలు, వ్యక్తిగత గిల్ట్, తనను నమ్మిన వారిని నిరాశపరుస్తాననే భయం మధ్య అతను కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సీజన్‌లో అభిలాష్ మరింత సున్నితంగా, తన లోపాలను నిజాయితీగా అంగీకరించే వ్యక్తిగా కనిపిస్తాడు" అని వివరించాడు.
సందీప్ భయ్యా ఏమంటున్నారంటే?
తన పాత్ర పరిణామం గురించి సన్నీ హిందూజా స్పందిస్తూ.. "అధికారం, దూరం, పరిస్థితులు మారినప్పుడు స్నేహాలు, ఆశయాలు ఎలా పరీక్షించబడతాయో సీజన్ 3 చూపిస్తుంది. తన శిష్యులు తీసుకునే కొన్ని నిర్ణయాలను సందీప్ భయ్యా అంగీకరించలేకపోతాడు. ఒత్తిడిలో సంబంధాలు ఎలా రూపాంతరం చెందుతాయనేది ఆసక్తికరంగా ఉంటుంది" అని తెలిపాడు.
ఆస్పిరెంట్స్ సీజన్ 3 విశేషాలు
ఆస్పిరెంట్స్ తొలి సీజన్ ఐఏఎస్ కలలు కనే ముగ్గురు స్నేహితులు, వాళ్లను గైడ్ చేసే మరో సీనియర్ చుట్టూ తిరిగింది. రెండో సీజన్ లో ఆ ముగ్గురిలో ఒకరు ఐఆర్ఎస్ సాధించడం, తనను గైడ్ చేసిన సీనియర్ మాత్రం రాష్ట్ర స్థాయి ఉద్యోగం సెటిలైపోవడం చూడొచ్చు. ఈ క్రమంలోనే అభిలాష్, సందీప్ భయ్యా మధ్య విభేదాలు తలెత్తుతాయి.
{{/usCountry}}ఆస్పిరెంట్స్ తొలి సీజన్ ఐఏఎస్ కలలు కనే ముగ్గురు స్నేహితులు, వాళ్లను గైడ్ చేసే మరో సీనియర్ చుట్టూ తిరిగింది. రెండో సీజన్ లో ఆ ముగ్గురిలో ఒకరు ఐఆర్ఎస్ సాధించడం, తనను గైడ్ చేసిన సీనియర్ మాత్రం రాష్ట్ర స్థాయి ఉద్యోగం సెటిలైపోవడం చూడొచ్చు. ఈ క్రమంలోనే అభిలాష్, సందీప్ భయ్యా మధ్య విభేదాలు తలెత్తుతాయి.
{{/usCountry}}మూడో సీజన్లో వీళ్ల మధ్య ఫైట్ మరో లెవెల్ కు చేరినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూడో సీజన్ లోనూ నవీన్ కస్తూరియా, సన్నీ హిందూజా, శివంఖిత్ సింగ్ పరిహార్, అభిలాష్ థాప్లియాల్ లాంటి వాళ్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆస్పిరెంట్స్ మూడో సీజన్ స్ట్రీమింగ్ కానుంది.