బరాబర్ ప్రేమిస్తా.. టాలీవుడ్ లో ఆటిట్యూడ్ స్టార్ గా పిలుచుకుంటున్న చంద్రహాస్ నటిస్తున్న మూవీ. ఈ సినిమా శుక్రవారం అంటే ఫిబ్రవరి 6న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మధ్య జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో అతడు స్టేజ్ పైనా గుంజి గుంజి అంటూ ఓ బూతు పాట పాడి షాకిచ్చాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ స్పందించారు.
అక్కడున్న ఎవరికీ తెలియదు..

బరాబర్ ప్రేమిస్తా మూవీ ప్రొడ్యూసర్లలో ఒకరైన చిన్న ఈ వివాదంపై స్పందించాడు. అక్కడున్న వాళ్లెవరికీ తమ హీరో అలా చేస్తాడని తెలియదని, తామూ చింతిస్తున్నామని అన్నాడు. “ప్రీరిలీజ్ ఈవెంట్లో మా హీరో చంద్రహాస్ సినిమాలో తన క్యారెక్టరైజేషన్ చెప్పాలన్న ఉద్దేశంతో ఓ పాట పాడాడు. అందులో కొన్ని తప్పులు దొర్లాయి. ఆ పొరపాటు ఆ ఈవెంట్లో ఉన్న వ్యక్తులెవరికీ తెలియదు. దీనిపై మేం చింతిస్తున్నాం. అతడు కూడా ఇదే విషయం చెప్పాడు” అని అన్నాడు.
అటు మూవీ డైరెక్టర్ సంపత్ రుద్ర కూడా అదే వీడియోలో స్పందించాడు. “ఆ ఈవెంట్లో చంద్రహాస్ ఓ పాట పాడాడు. అందులో తప్పులు దొర్లాయి. కానీ అలాంటి పాట సినిమాలో లేదు. ఇది క్లీన్ యు మూవీ. మీకూ అదే ఫీలింగ్ కలుగుతుంది” అని స్పష్టం చేశాడు.
దీనిపై అదే ఈవెంట్లో ఉన్న జేడీ చక్రవర్తి కూడా స్పందించిన విషయం తెలిసిందే. సినిమా పబ్లిసిటీ కోసం దిగజారాల్సిన అవసరం లేదని, ఈ వివాదం విషయంలో తాను కూడా చాలా ఫీలవుతున్నట్లు అతడు చెప్పాడు.
చంద్రహాస్‌పై కేసు
ఇప్పటికే ఈ వివాదంలో చంద్రహాస్ పై కేసు కూడా నమోదైంది. ఈ పాటపై మండిపడిన జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి ఆ పాట ఏంటని ప్రశ్నించాడు. అయితే దీనిపైనా చంద్రహాస్ అతన్ని బెదిరించినట్లుగా మాట్లాడటంతో అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
చంద్రహాస్ విషయానికి వస్తే.. టీవీలో మంచి నటుడిగా పేరుగాంచిన ప్రభాకర్ వారుసుడిగా అతడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రామ్ నగర్ బన్నీ మూవీతో హీరోగా మారాడు. సినిమా కంటే ముందు తన ప్రవర్తనతో యాటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్‌ను నెటిజన్ల నుంచి అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి గుంజి గుంజి అనే పాటతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
{{/usCountry}}చంద్రహాస్ విషయానికి వస్తే.. టీవీలో మంచి నటుడిగా పేరుగాంచిన ప్రభాకర్ వారుసుడిగా అతడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. రామ్ నగర్ బన్నీ మూవీతో హీరోగా మారాడు. సినిమా కంటే ముందు తన ప్రవర్తనతో యాటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్‌ను నెటిజన్ల నుంచి అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి గుంజి గుంజి అనే పాటతో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
{{/usCountry}}