సినిమా అంటే ఇలా తీయాలి.. టెక్నికల్ మార్వెల్.. ఇదో అద్భుతమైన మూవీ: అవతార్ ఫైర్ అండ్ యాష్ ఫస్ట్ రివ్యూలు వచ్చేశాయ్
అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ ఫస్ట్ రివ్యూలు వచ్చేశాయి. ఇదో అద్భుతమైన మూవీ అని, ఊహకందని ఫిల్మ్ మేకింగ్ అని పలువురు రివ్యూలు ఇచ్చారు. డిసెంబర్ 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన అద్భుత ప్రపంచం 'పండోర'లోకి మరోసారి వెళ్లడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. 'అవతార్' సిరీస్‌లో మూడవ భాగం 'అవతార్: ఫైర్ అండ్ యాష్' వరల్డ్ ప్రీమియర్ సోమవారం (డిసెంబర్ 1) రాత్రి హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్‌లో కన్నుల పండుగగా జరిగింది. ఈ షోలో సినిమా చూసిన ప్రముఖ జర్నలిస్టులు, సినీ విమర్శకులు సోషల్ మీడియాలో తమ ఫస్ట్ రివ్యూలను పోస్ట్ చేశారు. ఇప్పటివరకు వచ్చిన రివ్యూలన్నీ పాజిటివ్‌గా ఉండటం విశేషం.

క్రిటిక్స్ ఏమన్నారంటే?
అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ థియేటర్లలో రిలీజ్ కు సుమారు 18 రోజుల ముందే ప్రీమియర్ షోలు వేయడం విశేషం. ఈ సినిమా చూసిన క్రిటిక్స్ జేమ్స్ కామెరాన్ టేకింగ్‌కు, విజువల్స్‌కు ఫిదా అయిపోయారు. మొదటి రెండు సినిమాలను ఇష్టపడ్డవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుందని చెబుతున్నారు.
వెరైటీ (Variety) మ్యాగజైన్ క్రిటిక్ అయిన జాజ్ టాంగ్‌కే మూవీ చూసిన తర్వాత ట్వీట్ చేశారు. "ఇదొక ఆశ్చర్యకరమైన సినిమా మేకింగ్ విజయం. జేమ్స్ కామెరాన్ అంచనాలను మరింత పెంచారు. ఇది మునుపటి కంటే పెద్దది, గొప్పది, మరింత ఎమోషనల్. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. కొత్త పాత్రలు థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. ఇదొక టెక్నికల్ మార్వెల్" అని అనడం విశేషం.
ఇలాంటి సినిమాల కోసమే థియేటర్లు
ఇక మరొక క్రిటిక్ కోర్ట్నీ హోవార్డ్ కూడా మూవీపై రివ్యూ ఇచ్చారు. "థియేటర్లు కట్టిందే ఇలాంటి సినిమాల కోసం అనిపిస్తుంది. మూడు సినిమాలు దాటినా, జేమ్స్ కామెరాన్ చేతిలో ఇంకా ఆ మ్యాజిక్ ఉంది. ఈ ఎపిక్ విజువల్ స్పెక్టకల్ మనసుకు హత్తుకునేలా ఉంది" అని అన్నారు.
మరో క్రిటిక్ సీన్ తాజిపూర్ స్పందిస్తూ.. "నేను అవతార్ ఫ్యాన్‌ని కాదు. కానీ జేమ్స్ కామెరాన్ ఒక అల్టిమేట్ సినిమాటిక్ అనుభవాన్ని అందించారు. విజువల్స్, ఎమోషన్స్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు. నిజమైన బ్లాక్‌బస్టర్ అంటే ఎలా ఉండాలో చూపించారు" అని అన్నారు.
కొలైడర్ ప్రతినిధి పెరి నెమిరోఫ్ స్పందిస్తూ.. "సినిమా మొదలవ్వగానే మనం పండోర ప్రపంచంలోకి ఎంత త్వరగా వెళ్లిపోతామో చూసి ఆశ్చర్యపోయాను. అవతార్ సినిమాలు ఎంత మ్యాజికల్ గా ఉంటాయో తలచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు.
కొంతమంది విమర్శకులు కథలో చిన్నపాటి లోపాలు ఉన్నాయని చెప్పినా, టెక్నికల్ అంశాల్లో ఈ సినిమా ఊహకందని స్థాయిలో ఉందని మైఖేల్ లీ వంటి వారు అభిప్రాయపడ్డారు.
అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా గురించి..
2009లో వచ్చిన అవతార్, 2022లో వచ్చిన అవతార్ 2 మూవీస్ తర్వాత ఐదు భాగాల ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మూడో సినిమా ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్. ఈ మూడు సినిమాలను జేమ్స్ కామెరానే డైరెక్ట్ చేశాడు.
ఇందులోనూ సామ్ వర్తింగ్టన్, జో సల్దా, కేట్ విన్స్‌లెట్ వంటి నటీనటులు తమ పాత పాత్రల్లోనే అలరించనున్నారు. ఈ సినిమా ఇండియాలో ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 19న థియేటర్లలోకి రానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


