Avengers Doomsday: ఇండియాలో అవెంజర్స్ డూమ్స్‌డే బుకింగ్స్ సంచలనం.. 24 గంటల షోలు, అర్ధరాత్రి కూడా.. ఒక్క టికెట్ రూ.1500

Avengers Doomsday: ఇండియాలోని మార్వెల్ (Marvel) అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక సూపర్ హీరో చిత్రం ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ అడ్వాన్స్ బుకింగ్స్ మంగళవారం (నవంబర్ 17, 2026) భారత్‌లో అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Published on: Nov 17, 2026, 19:45:30 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Avengers Doomsday: హాలీవుడ్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవెంజర్స్: డూమ్స్‌డే అడ్వాన్స్ బుకింగ్ ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి. అయితే ఇవి అప్పుడే సంచలనాలు సృష్టిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో `#OpenDoomsdayBookings` హ్యాష్‌ట్యాగ్‌తో ఫ్యాన్స్ చేసిన డిమాండ్‌కు స్పందిస్తూ, విడుదల తేదీకి సరిగ్గా నెల రోజుల ముందే ఎగ్జిబిటర్లు టికెట్ విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Avengers Doomsday: ఇండియాలో అవెంజర్స్ డూమ్స్‌డే బుకింగ్స్ సంచలనం.. 24 గంటల షోలు, అర్ధరాత్రి కూడా.. రూ.1500 టికెట్ ధర
Avengers Doomsday: ఇండియాలో అవెంజర్స్ డూమ్స్‌డే బుకింగ్స్ సంచలనం.. 24 గంటల షోలు, అర్ధరాత్రి కూడా.. రూ.1500 టికెట్ ధర

డిసెంబర్ 17న అమెరికా కంటే ఒక రోజు ముందే ఈ చిత్రం భారతీయ థియేటర్లలోకి రానుండగా, బుక్ మై షో (BookMyShow), డిస్ట్రిక్ట్ (District) యాప్‌లలో టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అర్ధరాత్రి ప్రత్యేక షోలు, టికెట్ ధరలు, కథాంశం వివరాలను ఇక్కడ చూద్దాం.

గంటకు 7 వేల టికెట్లు

మంగళవారం (నవంబర్ 17) మధ్యాహ్నం 12 గంటల నుంచి పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) సహా దేశంలోని ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన్‌లలో 'అవెంజర్స్: డూమ్స్‌డే' అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బుకింగ్స్ తెరిచిన వెంటనే బుక్ మై షోలో గంటకు దాదాపు 7,000 టికెట్లు అమ్ముడవ్వడం మార్వెల్ క్రేజ్‌కు నిదర్శనం.

ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో తొలి రోజు టికెట్ల కోసం ఫ్యాన్స్ పోటీ పడుతున్నారు. భారీ డిమాండ్ దృష్ట్యా థియేటర్ యాజమాన్యాలు ప్రత్యేక అర్ధరాత్రి షోలతో పాటు 24 గంటల పాటు నిరంతర స్క్రీనింగ్‌లకు ప్రణాళికలు రచిస్తున్నాయి.

తిరువనంతపురంలోని ఏరీస్ ప్లెక్స్ ఉదయం 10 గంటలకే బుకింగ్స్ ప్రారంభించి, డిసెంబర్ 17 అర్ధరాత్రి 12:01 గంటలకు ప్రత్యేక ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) వేయనుంది.

టికెట్ ధరలు రూ. 420 నుంచి రూ. 1,500 వరకు.. 5 భాషల్లో విడుదల

బుక్ మై షో, డిస్ట్రిక్ట్ పోర్టల్స్‌లోని ప్రారంభ లిస్టింగ్స్ ప్రకారం, ఈ సినిమా సాధారణ స్క్రీనింగ్ టికెట్ ధరలు సుమారు రూ. 420 నుంచి మొదలవుతున్నాయి. ఇక లగ్జరీ రెక్లైనర్ సీట్లు, ప్రీమియం లార్జ్-ఫార్మాట్ స్క్రీన్‌లలో సినిమా చూడాలనుకునే వారు రూ. 1,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ముంబై వంటి నగరాల్లోని కొన్ని స్పెషల్ ఇన్ఫినిటీ విజన్ 4DX 3D రెక్లైనర్ టికెట్లు అంతకంటే ఎక్కువ ధర పలికి, క్షణాల్లో సోల్డ్ అవుట్ అయ్యాయి.

2D, 3D, IMAX, 4DX, ScreenX, ప్రీమియం Infinity Vision ఫార్మాట్లలో ఈ చిత్రం ప్రదర్శితం కానుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రీ-సేల్స్ 150 మిలియన్ డాలర్ల మార్కును దాటడం విశేషం. థియేటర్లలో ఈ చిత్రం హాలీవుడ్ మరో భారీ చిత్రం 'డ్యూన్: పార్ట్ 3' (Dune Part 3) తో బాక్సాఫీస్ పోటీకి దిగనుంది.

డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్ రీ-ఎంట్రీ.. కథా విశేషాలు ఇవే

ప్రఖ్యాత దర్శక ద్వయం రూసో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే', అవెంజర్స్ సిరీస్‌లో ఐదవ చిత్రం కాగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) లో 39వ చిత్రం. గతంలో ఐరన్ మ్యాన్‌గా కోట్లాది మందిని అలరించిన రాబర్ట్ డౌనీ జూనియర్ (Robert Downey Jr.).. ఈ సినిమాలో అత్యంత శక్తివంతమైన విలన్ విక్టర్ వాన్ డూమ్ (డాక్టర్ డూమ్) పాత్రలో తిరిగి ఎంసీయూలోకి అడుగుపెట్టడం అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది.

ఈ మహాయుద్ధంలో కెప్టెన్ అమెరికా (ఆంథోనీ మాకీ), థోర్ (క్రిస్ హెమ్స్‌వర్త్), స్టీవ్ రోజర్స్ (క్రిస్ ఎవాన్స్)లతో పాటు ఫెంటాస్టిక్ ఫోర్ (Fantastic Four), ఎక్స్-మెన్ (X-Men) సూపర్ హీరోలు కూడా ఏకమై డాక్టర్ డూమ్‌ను ఎదుర్కోనున్నారు. ఈ చిత్రం నిడివి 2 గంటల 32 నిమిషాల నుండి 2 గంటల 45 నిమిషాల మధ్య ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం.

మార్వెల్ చరిత్రలోనే అతిపెద్ద మల్టీవర్స్ పోరాటాన్ని మొదటి రోజే థియేటర్లలో వీక్షించాలనుకునే అభిమానులు వెంటనే మీ టికెట్లను బుక్ చేసుకోండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More