Babu Mohan The Paradise: వాళ్ల దరిద్రం.. నన్ను తీసుకోలేదు.. సినిమా అట్టర్ ఫ్లాపయింది: పారడైజ్ మూవీపై బాబు మోహన్
Babu Mohan The Paradise: టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. నాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం తనను పిలిచి లుక్ టెస్ట్ చేసి, ఆ తర్వాత కనీస సమాచారం ఇవ్వకుండా పక్కన పెట్టేశారని ఆయన ఆరోపించారు.
Babu Mohan The Paradise: తెలుగు చిత్రసీమలో తనదైన కామెడీ టైమింగ్‌తో దశాబ్దాల పాటు కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన వర్సటైల్ నటుడు బాబు మోహన్. ఇటీవల కాలంలో సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ, నచ్చిన పాత్రలు వచ్చినప్పుడు అలరిస్తున్న ఈ సీనియర్ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ నిర్మాణ వర్గాల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా మేకర్స్ తనను అవమానించిన తీరును బయటపెడుతూ ఆయన ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్తం చేశారు.
లుక్ టెస్ట్ చేశారు.. కానీ పిలుపు రాలేదు
ఇంటర్వ్యూలో 'ది ప్యారడైజ్' సినిమా అనుభవాన్ని వివరిస్తూ బాబు మోహన్ అసలు ఏం జరిగిందో వెల్లడించారు. “ఈ సినిమా కోసం మేకర్స్ నన్ను సంప్రదించారు. ప్రత్యేకంగా పిలిచి గెటప్ వేశారు, లుక్ టెస్ట్ చేశారు. లుక్ చూసి 'బ్రహ్మాండంగా ఉందండి' అని పొగిడారు. పిలుస్తాం అని చెప్పి పంపించారు” అని వెల్లడించారు.
“షూటింగ్ ఉన్నప్పుడు కబురు పెడతామన్నారు. నేను కూడా ఎంతో ఆశగా పిలుపు వస్తుందేమోనని ఎదురుచూశాను. కానీ తీరా చూస్తే షూటింగ్ పూర్తయిపోయి, సినిమా థియేటర్లలోకి వచ్చేసింది” అని అన్నారు.
"నాకంటే బెటర్ యాక్టర్ దొరుకుతాడని నన్ను వద్దనుకున్నారో, లేక నేను చేయలేనని పక్కన పెట్టారో తెలియదు. కానీ కనీసం 'మిమ్మల్ని తీసుకోవడం లేదు' అని చెప్పే కనీస మర్యాద కూడా పాటించలేదు" అని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
శని వెంటపడితే అంతే.. ఈవీవీ సత్యనారాయణ సినిమా ఉదాహరణ
సినిమా ఫలితంపై స్పందిస్తూ బాబు మోహన్ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను పక్కన పెట్టడం వల్లే ఆ సినిమాకు శని, దరిద్రం పట్టుకుని ఫ్లాప్ అయిందని అన్నారు.
"నన్ను తీసుకోకపోవడానికి కారణం ఏమైనా కావచ్చు, కానీ వాళ్లకు ఆ సినిమా ఫ్లాప్ కావాలని రాసి పెట్టి ఉంది. అందుకే గోల్డెన్ లెగ్ అయిన నన్ను పక్కన పెట్టారు. గతంలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 'చెవిలో పువ్వు' అనే సినిమా తీస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నన్ను పెట్టి 'ప్రేమఖైదీ' తీస్తే వంద రోజులు ఆడింది. బాబు మోహన్ ది లక్కీ లెగ్. ఈ ప్యారడైజ్ వాళ్లకు సంస్కారం అనేది ఉంటే కనీసం సమాచారం ఇచ్చేవారు" అని అన్నారు.
టాలీవుడ్‌లో కనీస ప్రొఫెషనలిజం కరువైందా?
ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న బాబు మోహన్ లాంటి దిగ్గజ నటుడిని లుక్ టెస్ట్ పేరుతో పిలిచి, ఆ తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వదిలేయడంపై ఫిల్మ్ నగర్ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ సాగుతోంది. నటీనటుల సమయానికి, వారి సీనియారిటీకి గౌరవం ఇవ్వడం ప్రొడక్షన్ హౌస్‌ల కనీస బాధ్యత అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాబు మోహన్ వ్యాఖ్యలపై 'ది ప్యారడైజ్' చిత్ర బృందం లేదా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


