OTT Horror: 20 ఏళ్ల కుర్ర డైరెక్టర్ సంచలనం.. రూ.95 కోట్లతో తీస్తే రూ.3500 కోట్లు.. ఓటీటీలోకి వస్తున్న హారర్ థ్రిల్లర్

OTT Horror: ఓటీటీలోకి ఓ బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. బ్యాక్‌రూమ్స్ అనే ఈ సినిమాను కేవలం రూ.95 కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా రూ.3500 కోట్లు వసూలు చేసింది.

Published on: Aug 4, 2026, 17:30:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Horror: హాలీవుడ్ ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ బాట పట్టింది. కేవలం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 95 కోట్లు) తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 330 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3500 కోట్లు) వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ 'బ్యాక్‌రూమ్స్' (Backrooms) డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) ఈ మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

OTT Horror: 20 ఏళ్ల కుర్ర డైరెక్టర్ సంచలనం.. రూ.95 కోట్లతో తీస్తే రూ.3500 కోట్లు.. ఓటీటీలోకి వస్తున్న హారర్ థ్రిల్లర్
OTT Horror: 20 ఏళ్ల కుర్ర డైరెక్టర్ సంచలనం.. రూ.95 కోట్లతో తీస్తే రూ.3500 కోట్లు.. ఓటీటీలోకి వస్తున్న హారర్ థ్రిల్లర్

"ప్రతి ప్రదేశం దానిని మనం కనుగొనాలని కోరుకోదు.. కానీ ఈ ప్రదేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది" అంటూ సోనీ లివ్ వదిలిన క్రేజీ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం.. A24 బ్యానర్ మ్యాజిక్

ఈ సినిమా వెనుక ఉన్న దర్శకుడి స్టోరీ వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కేవలం 20 ఏళ్ల వయసున్న కేన్ పార్సన్స్ (Kane Parsons) అనే యంగ్ క్రియేటర్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన 'ది బ్యాక్‌రూమ్స్' అనే షార్ట్ ఫౌండ్-ఫుటేజ్ వీడియో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది.

ఈ కాన్సెప్ట్ సత్తాను గుర్తించిన హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ24 (A24) ఆ కుర్రాడికి ఏకంగా బిగ్ స్క్రీన్ డైరెక్షన్ ఆఫర్ ఇచ్చింది. 'హెరిడిటరీ', 'మిడ్‌సమ్మర్', 'టాక్ టు మీ' వంటి హారర్ కల్ట్ హిట్స్ అందించిన A24 బ్యానర్ మేకింగ్ తోడవడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయి లాభాలు రాబట్టింది.

బేస్‌మెంట్‌లో మైండ్ బెండింగ్ వరల్డ్

ఈ సినిమా కథాంశం చాలా వినూత్నంగా, భయంకరంగా సాగుతుంది. ఒక ఫర్నిచర్ స్టోర్ నిర్వాహకుడు తన షాప్ బేస్‌మెంట్‌లో ఊహించని విధంగా అసలు ముగింపు లేని ఒక అనంతమైన వింత ప్రదేశాన్ని (Liminal Spaces) కనుగొంటాడు. ఆ పసుపు రంగు గోడలు, లైట్ల శబ్దాల మధ్య అతనికి ఎదురైన భీతావహ పరిస్థితులు ఏంటి? ఆ భయంకర చిక్కుముడుల నుంచి అతను బయటపడ్డాడా లేదా అనేది ఊపిరి బిగబట్టుకుని చూసేలా దర్శకుడు స్క్రీన్‌పై ఆవిష్కరించాడు.

ఈ చిత్రంలో '12 ఇయర్స్ ఎ స్లేవ్' ఫేమ్ ఆస్కార్ నామినీ చివెటెల్ ఎజియోఫర్ (Chiwetel Ejiofor), 'ది వర్స్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్' ఫేమ్ రెనేట్ రీన్స్వే తో పాటు మార్క్ డ్యూప్లాస్, ఫిన్ బెన్నెట్, లుకిటా మెక్స్‌వెల్ తమ నటనతో భయపెట్టారు.

ఇండియాలో థియేటర్లలో మిస్..

ఇండియాలో థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఈ సినిమాకు తగినంత ప్రమోషన్ లభించలేదు. గతంలో వచ్చిన హాలీవుడ్ హిట్ 'అబ్సెషన్' (Obsession) సాధించిన స్థాయి వసూళ్లను ఇండియా బాక్సాఫీస్ వద్ద బ్యాక్‌రూమ్స్ సాధించలేకపోయింది. దీంతో ఈ విజువల్ వండర్‌ను బిగ్ స్క్రీన్‌పై మిస్సయిన ఇండియన్ మూవీ లవర్స్ డిజిటల్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ఇంగ్లీష్‌తో పాటు ప్రధాన ప్రాంతీయ భాషల డబ్బింగ్ వెర్షన్లలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సైకలాజికల్ హారర్ డార్క్ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు ఈ హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఒక పర్ఫెక్ట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీని కచ్చితమైన స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ వెల్లడించనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More