స్క్రీన్‌పై మెరిసిన బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని.. అచ్చూ ఆ హీరోయిన్‌లా ఉన్నావంటూ కామెంట్స్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా

బాలకృష్ణ చిన్న కూతురు స్క్రీన్ పై మెరిసింది. ఆమెను చూసిన ఫ్యాన్స్ చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమె నటించింది సినిమాలో కాదు.. ఓ యాడ్ లో కావడం విశేషం. ఇంతకీ అదేంటో చూడండి.

Published on: Oct 31, 2025, 12:22:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ డెబ్యూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతలోనే బాలయ్య కూతురు స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. అతని చిన్న కూతురు తేజస్విని ఈ మధ్యే సిద్ధార్థ జువెలర్స్ యాడ్ లో కనిపించింది. ఈ యాడ్ ను ఆమెనే తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీనిని చూసిన ఓ అభిమాని అచ్చూ రకుల్‌ప్రీత్ సింగ్ లా ఉన్నావని కామెంట్ చేయడం విశేషం.

స్క్రీన్‌పై మెరిసిన బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని.. అచ్చూ ఆ హీరోయిన్‌లా ఉన్నావంటూ కామెంట్స్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా
స్క్రీన్‌పై మెరిసిన బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని.. అచ్చూ ఆ హీరోయిన్‌లా ఉన్నావంటూ కామెంట్స్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా

నందమూరి తేజస్విని యాడ్

నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని నటించిన ఓ కమర్షియల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ ను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. “నా తొలి ఆన్ స్క్రీన్ క్షణాన్ని మీ అందరితో పంచుకోవడం చాలా అద్భుతంగా ఉంది. సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్, కౌస్తుబా హై జ్యువెలరీ డిజైన్ స్టూడియోతో ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది.

దీన్ని సాధ్యం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ ఆప్యాయత, ఆశీర్వాదాలకు ఎప్పటికీ కృతజ్ఞురాలిని” అనే క్యాప్షన్ తో తేజస్విని ఈ యాడ్ షేర్ చేసింది. ఈ యాడ్ మొదట్లో ఆమె ఓ మోడర్న్ డ్రెస్ లో చేతికి ఓ డైమండ్ రింగ్ తో కనిపించింది. ఆ తర్వాత సాంప్రదాయ దుస్తుల్లో ఒంటి నిండా నగలతోనూ మెరిసింది.

ఫ్యాన్స్ రియాక్షన్ ఇలా..

నందమూరి వంశం నుంచి వచ్చిన తేజస్విని కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తొలి యాడ్ లోనే ఆమె తన అందం, నటనతో ఆకట్టుకుంది. చాలా సహజంగా కనిపించింది. ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ నటన మీ రక్తంలోనే ఉంది కదా అని కామెంట్ చేయడం విశేషం. మిమ్మల్ని సడెన్ గా చూసి రకుల్ ప్రీత్ అనుకున్నా.. అలాగే ఉన్నారు అని మరో అభిమాని అన్నారు.

వీడియో చాలా బాగుంది.. ఇలాగే సినిమాలు, వెబ్ సిరీస్ లలోనూ నటించండి అని మరికొందరు సూచించారు. చాలా మంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాడ్ ను యమన కిశోర్ డైరెక్ట్ చేశారు. ఇక బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చూసుకుంది. తమన్ మ్యూజిక్ అందించాడు. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ డాబూ రత్నానీ ఆమె ఫొటోలను తీశాడు. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More