హైంద‌వ అంటూ థ్రిల్ల‌ర్‌తో వ‌స్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌..ప‌వ‌ర్‌ఫుల్ పోస్ట‌ర్‌తో హైప్‌..ద‌శావ‌తారాల అండ‌

కిష్కింధపురి హిట్ తో జోరుమీదున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మొదట్లో కమర్షియల్ సినిమాలను నమ్ముకొని దెబ్బతిన్న ఈ హీరో.. ఇప్పుడు కంటెంట్ ఉన్న చిత్రాలను చేస్తున్నాడు. ఇవాళ తన రాబోయే మూవీ హైందవ నుంచి కొత్త పోస్టర్ ను పంచుకున్నాడు. హైందవ పేరుతో థియేటర్లను బద్దలుకొట్టడానికి వస్తున్నాడు. 

Published on: Jan 3, 2026, 15:03:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెల్లంకొండ శ్రీనివాస్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో రాబోతున్నాడు. ఇవాళ (జనవరి 3) అతని బర్త్ డే సందర్భంగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హైందవ టైటిల్ తో రాబోతున్న ఈ థ్రిల్లర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను గతేడాది జనవరిలో రిలీజ్ చేశారు.

హైందర పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ (x/BSaiSreenivas)
హైందర పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ (x/BSaiSreenivas)

హైందవ పోస్టర్

కిష్కింధపురి సినిమాతో గతేడాది ఎండింగ్ లో హిట్ కొట్టాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ హీరో కెరీర్ కు కిష్కింధపురి మంచి బూస్టప్ ఇచ్చింది. ఇప్పుడు కంటెంట్ ఉన్న కథలనే నమ్ముతూ కొత్త సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ క్రమంలోనే హైందవ అంటూ థియేటర్లో రచ్చ చేయడానికి రెడీ అయిపోయాడు. శనివారం అతని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన హైందవ పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తోంది.

చేతిలో గొడ్డలి

హైందవ పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ మోడ్ లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కాగడాతో పోరాటానికి సిద్ధమన్నట్లు అరుస్తున్నాడు శ్రీనివాస్. వెనుకాల నిప్పుల్లాంటి కళ్లతో వారాహం ఉంది. దాని కొమ్ములు హీరోకే మొలిచినట్లు పోస్టర్ అదిరిపోయింది. హైందవ మూవీలో సంయుక్త హీరోయిన్. ఈ చిత్రానికి లుధీర్ బైరెడ్డి డైరెక్టర్.

దశావతారాల అండ

‘‘ఎప్పుడైతే ఓ పవర్ ఫుల్ శక్తి ఏర్పుడుతుందో, అప్పుడు దశావతారాల అండ ఉంటుంది. త్వరలో థియేటర్లలో హైందవ’’ అని హైందవ మూవీ పోస్టర్ కు ఇచ్చిన క్యాప్షన్ అదిరిపోయింది. దీన్ని బట్టి చూస్తే ఇదో మైథాలజీ బేస్డ్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. ఈ సినిమాతో బెల్లం అన్న మరో హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మూన్ షైన్ పిక్చర్స్ పై మహేష్ చందు హైందవ సినిమాను నిర్మిస్తున్నాడు.

కిష్కింధపురితో

2014లో పక్కా మాస్ కమర్షియల్ మూవీ అల్లుడు శీనుతో డెబ్యూ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, సాక్ష్యం, కవచం, సీత.. ఇలా వరుసగా సినిమాలు చేసినా అనుకున్నంత హిట్ కాలేదు. అప్పుడే రాక్షసుడు అంటూ రూట్ మార్చి హిట్ అందుకున్నాడు.

మళ్లీ అల్లుడు అదుర్స్, ఛత్రపతి (హిందీ రీమేక్), భైరవం అంటూ రొటీన్ సినిమాలతో దెబ్బతిన్నాడు బెల్లకొండ. ఆ తర్వాత కిష్కింధపురితో సాలిడ్ హిట్ దక్కించుకున్నాడు. ఇప్పుడు హైందవతో మరోసారి అదరగొట్టేందుకు వస్తున్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More