Bellamkonda Srinivas: 100 కోట్ల వ్యూస్.. ఏ తెలుగు హీరోకీ సాధ్యం కాని రికార్డు.. బెల్లంకొండ శ్రీనివాస్ ఫ్లాప్ మూవీ సునామీ
Bellamkonda Srinivas: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు తెలుగు హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. అతడు నటించిన జయ జానకి నాయక మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో ఏకంగా 100 కోట్ల వ్యూస్ సాధించింది.
Bellamkonda Srinivas: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నార్త్ ఇండియాలో ఉన్న తన అన్‌స్టాపబుల్ క్రేజ్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ ‘ఖూన్‌ఖార్’ ఇప్పుడు యూట్యూబ్‌లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

పెన్ మూవీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ఈ పూర్తి సినిమా ఏకంగా 1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ మైల్‌స్టోన్‌ను దాటేసి టాలీవుడ్ హిస్టరీలోనే సరికొత్త సంచలనంగా నిలిచింది.
ప్రభాస్, అల్లు అర్జున్‌లకే సాధ్యం కాని రేంజ్ లో బెల్లంకొండ రికార్డ్
టాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది టాప్ స్టార్ల సినిమాలు హిందీలోకి డబ్ అయి యూట్యూబ్‌లో వందల మిలియన్ల వ్యూస్ సాధించాయి. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క తెలుగు హీరో పూర్తి నిడివి సినిమాకు కూడా యూట్యూబ్‌లో 100 కోట్ల వ్యూస్ రాలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి లీడింగ్ హీరోల రికార్డులను వెనక్కి నెట్టి, ఈ ఘనత సాధించిన ఏకైక తెలుగు హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.1 బిలియన్ (100 కోట్లు) వ్యూస్ దాటిన తొలి తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఎమోషనల్ డైలాగ్స్!
నిజానికి 2017లో థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ఈ కమర్షియల్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ డిజిటల్ స్పేస్‌లో మాత్రం ఈ సినిమాకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతూ వచ్చింది.
ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ సినిమాలోని కొన్ని ఇంటెన్స్ ఎమోషనల్ డైలాగ్స్, సెంటిమెంట్ సీన్లు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో విపరీతంగా వైరల్ అయ్యాయి. దాంతో ఈ సినిమా మళ్లీ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
బోయపాటి మార్క్ యాక్షన్.. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బీజీఎం
మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను ఈ సినిమాలో పర్ఫెక్ట్‌గా మిక్స్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ తన బాడీ లాంగ్వేజ్, ఫైట్స్‌తో నార్త్ మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు.
రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. విజువల్స్, ఫైట్స్ అన్నీ చాలా రిచ్‌గా ఉండటం కూడా హిందీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది.
ఏడేళ్లయినా తగ్గని క్రేజ్.. అన్‌మ్యాచ్‌డ్ డిజిటల్ రికార్డ్
యూట్యూబ్‌లో రిలీజ్ అయి దాదాపు ఏడేళ్లు అవుతున్నా కూడా ‘ఖూన్‌ఖార్’ సినిమాకు ఇప్పటికీ ప్రతిరోజూ లక్షల్లో వ్యూస్ వస్తుండటం విశేషం. హిందీ బెల్ట్‌లో బెల్లంకొండ యాక్షన్ సినిమాలకు ఉన్న విపరీతమైన డిమాండ్‌కు ఈ 1 బిలియన్ వ్యూస్ రికార్డే ఒక పెద్ద నిదర్శనం.
నార్త్ మార్కెట్‌లో తనకున్న ఈ క్రేజ్ వల్లే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ డైరెక్ట్ హిందీ ప్రాజెక్టులపై కూడా ఫోకస్ పెడుతున్నాడు. ప్రస్తుతానికి ఈ అరుదైన డిజిటల్ రికార్డ్ టాలీవుడ్‌లో మరే హీరోకూ అందనంత ఎత్తులో నిలిచింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


