Bellamkonda Sai Sreenivas: నా పెళ్లాం నిప్పురా- భార్యపై హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్- 12 ఫొటోలతో- మాస్ మొగుడు అంటూ!

Bellamkonda Sai Sreenivas Post On Wife Kavya Reddy: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఓ ఇంటివాడయ్యారు. తిరుమల కొండపై అత్యంత సన్నిహితుల మధ్య కావ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసిన ఈ అల్లుడు శీను, తాజాగా తన భార్య గురించి నా పెళ్లాం నిప్పురా అంటూ చేసిన సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Updated on: May 2, 2026, 13:02:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bellamkonda Sai Sreenivas Post On Wife Kavya Reddy: టాలీవుడ్ హీరో, నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ వివాహం ఏప్రిల్ 29, 2026న తిరుమలలో ఘనంగా జరిగింది. కర్ణాటక సత్రంలోని కల్యాణ మండపంలో కావ్య రెడ్డితో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఏడడుగులు వేశారు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.

నా పెళ్లాం నిప్పురా- భార్యపై హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్- 12 ఫొటోలతో- మాస్ మొగుడు అంటూ!
నా పెళ్లాం నిప్పురా- భార్యపై హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పోస్ట్- 12 ఫొటోలతో- మాస్ మొగుడు అంటూ!

12 ఫొటోలతో పెట్టిన పోస్ట్

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన భార్య గురించి మొత్తం 12 ఫొటోలతో పెట్టిన పోస్ట్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

"నా పెళ్లాం నిప్పురా"

పెళ్లైన కొత్తలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన భార్యపై ఉన్న ప్రేమను ఇలా వెరైటీగా చాటుకున్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో భార్య కావ్య రెడ్డితో దిగిన 12 ఫోటోలను షేర్ చేస్తూ.. "నా పెళ్ళాం నిప్పురా" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సాధారణంగా సినిమాల్లో మాస్ డైలాగులు చెప్పే శ్రీనివాస్, రియల్ లైఫ్‌లో కూడా అదే రేంజ్ మాస్ టచ్‌తో తన భార్యను పరిచయం చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

అయితే, ఈ డైలాగ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జయ జానకి నాయక సినిమాలోనిది. హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ చేసింది. హీరోయిన్ రకుల్‌ను తండ్రి పాత్ర బజారుది అని తిట్టే సీన్‌లో "నీ కూతురు నిప్పురా" అని బెల్లంకొండ శ్రీనివాస్ ఆవేశంతో చెబుతాడు. అదే డైలాగ్‌ను రియల్ లైఫ్‌లో తన భార్య గురించి చెబుతూ క్యాప్షన్ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.

నెట్టింట హల్చల్ చేస్తున్న పోస్ట్

దీంతో ఈ డైలాగ్, ఆ సినిమాలోని సీన్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్యాప్షన్‌తోపాటు కావ్య రెడ్డి తన జీవితంలోకి రావడం గురించి కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాసుకొచ్చారు.

"నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు.. నా ప్రతి రోజును పాజిటివిటీతో, నవ్వులతో నింపేస్తున్నావు. నీ ముఖంపై ఆ చిరునవ్వు ఎప్పటికీ చెదిరిపోకుండా చూసుకుంటాను" అని ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ పోస్ట్‌కు నెటిజన్లు 'మాస్ మొగుడు.. క్లాస్ పెళ్లాం' అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

గృహప్రవేశం వేడుకలో సందడి

ఇదిలా ఉంటే, వివాహం అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంటకు అత్తగారి ఇంట్లో ఘన స్వాగతం లభించింది. గృహప్రవేశం సమయంలో జరిగిన సరదా ముచ్చట్లు కూడా టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. సంప్రదాయం ప్రకారం భర్త పేరు చెప్పమని బంధువులు అడగగా, కావ్యా రెడ్డి చాలా ముచ్చటగా "మా వారు సాయి శ్రీనివాస్ బెల్లంకొండ" అని చెప్పి అందరినీ మురిపించారు.

ఇక హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు 'టైసన్ నాయుడు', మరోవైపు 'హైందవ' సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. పెళ్లి బ్రేక్ తర్వాత త్వరలోనే ఆయన మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More