Sourav Ganguly: దుమారం రేపుతున్న సౌరవ్ గంగూలీ కామెంట్స్- ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నటి స్వస్తిక-మీ సౌకర్యాలు అందరికి ఉండవంటూ!

Actress Swastika Mukherjee Slams Sourav Ganguly: బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మృతిపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. షూటింగ్ కోసం నీటిలోకి వెళ్లాల్సిన అవసరం ఏముందన్న సౌరవ్ గంగూలీ ప్రశ్నకు నటి స్వస్తిక ముఖర్జీ గట్టి కౌంటర్ ఇచ్చారు.

Updated on: Apr 8, 2026, 12:57:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Actress Swastika Mukherjee Slams Sourav Ganguly: బెంగాలీ బుల్లితెర నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మరణం ఆ చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఒడిశాలో 'భోలేబాబా పార్ కరేగా' సీరియల్ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. "అసలు షూటింగ్ కోసమని నీటిలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.

దుమారం రేపుతున్న సౌరవ్ గంగూలీ కామెంట్స్- ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నటి స్వస్తిక-మీ సౌకర్యాలు అందరికి ఉండవంటూ!
దుమారం రేపుతున్న సౌరవ్ గంగూలీ కామెంట్స్- ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నటి స్వస్తిక-మీ సౌకర్యాలు అందరికి ఉండవంటూ!

ప్రజా ప్రతినిధిగా బాధ్యత ఉండాలి: స్వస్తిక ముఖర్జీ

సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలపై ప్రముఖ నటి స్వస్తిక ముఖర్జీ తీవ్రంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో స్వస్తిక ముఖర్జీ మాట్లాడుతూ.. "గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి తన నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో గమనించుకోవాలి. ఆయన మాటలు ఎదుటివారి వృత్తిని కించపరిచేలా ఉన్నాయి. మీరు చేస్తున్న పనిని నేను తక్కువ చేసి మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుందో, ఆయన మాటలు కూడా అలాగే ఉన్నాయి" అని మండిపడ్డారు.

ఏసీ గదుల్లో ఉంటే గ్రౌండ్ రియాలిటీ తెలియదు

సినిమా లేదా సీరియల్ షూటింగ్ ఎలా జరుగుతుందో గంగూలీకి తెలియకపోవచ్చని స్వస్తిక ఎద్దేవా చేశారు. "సౌరవ్ గంగూలీ ఒక సెలబ్రిటీ. ఆయన ఏసీ గదుల్లో నాన్-ఫిక్షన్ షోలు చేస్తారు. ఆయనకు కావాల్సినవన్నీ అక్కడికక్కడే అందుతాయి. కానీ, షూటింగ్ గ్రౌండ్‌లో ఉండే పరిస్థితులు వేరు. ఒక ప్రాజెక్టులో రాహుల్ నీటిలోకి వెళ్లకపోతే, అతని స్థానంలో మరొకరిని పెట్టి అయినా ఆ సీన్ తీస్తారు. గంగూలీకి ఉన్న సౌకర్యాలు అందరు 'రాహుల్'లకు ఉండవు కదా!" అని స్వస్తికా ముఖర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అసలేం జరిగింది?

మార్చి 29న ఒడిశాలోని దిఘా తీరంలో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మోకాళ్ల లోతు నీటిలో రాహుల్, మరో నటి శ్వేతా మిశ్రా డ్యాన్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా నీటి అడుగున ఉన్న గొయ్యిలో జారి పడిపోయారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ రాహుల్ ప్రాణాలు కాపాడలేకపోయారు.

ఈ ఘటనతో బెంగాలీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. షూటింగ్ లొకేషన్లలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రక్షణ కోసం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఏప్రిల్ 7 (మంగళవారం) నుంచి పరిశ్రమ అంతా నిరవధిక సమ్మెకు దిగింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More