Rahul Banerjee: హీరోయిన్‌ను కాపాడేందుకు ప్రయత్నించి రాహుల్ తన ప్రాణాలు కోల్పోయాడా.. మరణానికి కొన్ని నిమిషాల ముందు వీడియో
Rahul Banerjee: బెంగాలీ నటుడు రాహుల్ బెనర్జీ మరణానికి కొన్ని నిమిషాల ముందు ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే తన కోస్టార్ శ్వేతను కాపాడటానికి ప్రయత్నించే అతడు మరణించినట్లు వస్తున్న వార్తలు అభిమానులను మరింత కలచివేస్తున్నాయి.
పాపులర్ బెంగాలీ యాక్టర్ రాహుల్ అరుణోదయ్ బెనర్జీ ఇక లేరు అనే వార్త ఇండస్ట్రీలో అందరినీ కలిచివేస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం తలసరి బీచ్‌లో జరిగిన ఈ ఘోర ప్రమాదం తర్వాత తమ్లూక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో అతని పోస్ట్‌మార్టం పూర్తయింది. భోలే బాబా పార్ కరేగా అనే టీవీ సీరియల్ షూటింగ్ చేస్తూ రాహుల్ తన కో స్టార్ శ్వేతా మిశ్రాతో కలిసి సముద్రం నీళ్లలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

సెట్స్‌లో బయటపడ్డ ఆఖరి వీడియో..
ఈ షూటింగ్‌కు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు తీసిన ఆ వీడియోలో రాహుల్ బెనర్జీ, శ్వేతా మిశ్రా రోడ్డు మీద నిలబడి కనిపిస్తున్నారు. ఒక సీన్ మధ్యలో వాళ్ల చుట్టూ క్రూ మెంబర్స్ అంతా ఉన్నారు. ఆ టైమ్‌లో రాహుల్ గ్రీన్ షర్ట్ వేసుకోగా, శ్వేతా మిశ్రా పింక్ చీరలో ఉంది.
శ్వేతా మిశ్రాను కాపాడబోయి సముద్రంలోకి..
ఏబీపీ ఆనంద రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే.. భోలేబాబా పార్ కరేగా సీరియల్ షూటింగ్ జరుగుతున్న టైమ్‌లోనే రాహుల్ ప్రాణాలు కోల్పోయాడు. బ్రేక్ టైమ్‌లో లీడ్ యాక్టర్స్ ఇద్దరూ సముద్రం నీళ్లకు చాలా దగ్గరగా వెళ్లారని తెలుస్తోంది. సడెన్‌గా శ్వేతా బ్యాలెన్స్ తప్పి నీళ్లలో పడిపోగానే, ఆమెను కాపాడటానికి రాహుల్ వెంటనే నీళ్లలోకి దూకేశాడు. రాహుల్ కూడా మునిగిపోతుండటం చూసి షూటింగ్ యూనిట్ మెంబర్స్ వెంటనే సముద్రంలోకి దూకేశారు.
అందరూ కలిసి శ్వేతా మిశ్రాను ముందుగా కాపాడారు కానీ, రాహుల్‌ను బయటకు తీయడానికి చాలా టైమ్ పట్టింది. ఇద్దరినీ వెంటనే దిఘా హాస్పిటల్‌కు తీసుకెళ్లగా, రాహుల్ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రతి మూమెంట్ అక్కడున్న కెమెరాలో రికార్డ్ అయిందని ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా పోలీసు వర్గాలు తెలిపాయి. బీచ్‌లో షూటింగ్ జరుగుతుండటంతో నీళ్ల వైపు చాలా కెమెరాలు సెట్ చేశారు. ఆ ఫుటేజ్‌లో రాహుల్, శ్వేత ఇద్దరూ ఒక సీన్‌లో భాగంగా చేతులు పట్టుకుని నీళ్లలోకి నడుచుకుంటూ వెళ్లడం రికార్డ్ అయింది.
కొద్దిసేపటికే శ్వేత సడెన్‌గా పడిపోవడం, ఆమెకు హెల్ప్ చేయబోయి రాహుల్ కూడా నీళ్లలో పడిపోవడం ఆ వీడియోలో కనిపించిందట. ఆ తర్వాత వాళ్లను కాపాడటానికి చాలామంది నీళ్లలోకి దూకారు. ఫస్ట్ శ్వేతను కాపాడి ఒక బోట్‌లోకి ఎక్కించారు. కానీ రాహుల్ వెంటనే దొరకలేదని, కొద్దిసేపటి తర్వాతే బయటకు తీశారని సమాచారం. అప్పటికే అతను పెద్ద మొత్తంలో సముద్రపు నీళ్లు మింగేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే పోలీసుల దగ్గర ఉన్న ఆ ఫుటేజ్‌లో శ్వేతా మిశ్రాను కాపాడే వరకు మాత్రమే రికార్డ్ అయిందని, రాహుల్‌ను బయటకు తీసే టైమ్‌కి కెమెరా ఆఫ్ అయిపోయిందని ఆ న్యూస్ ఛానెల్ రిపోర్ట్ చేసింది.
ఇద్దరికీ స్విమ్మింగ్ రాదు.. లైఫ్‌గార్డ్ వార్నింగ్ ఇచ్చినా..
రిపోర్ట్స్ ప్రకారం రాహుల్, శ్వేత ఇద్దరికీ స్విమ్మింగ్ రాదు. సేఫ్టీ కోసం అక్కడ ఒక ట్రైన్డ్ లైఫ్‌గార్డ్ కూడా ఉన్నాడు. వాళ్లను కాపాడటానికి నీళ్లలోకి దూకిన వాళ్లలో అతను కూడా ఉన్నాడు. ఆ లైఫ్‌గార్డ్ చెప్పిన దాని ప్రకారం.. లోతైన నీళ్లలోకి వెళ్లొద్దని యాక్టర్స్ ఇద్దరికీ అతను పదే పదే వార్నింగ్ ఇచ్చాడట. కానీ అక్కడ సముద్రపు గాలి చాలా గట్టిగా వీస్తుండటంతో ఆ మాటలు వాళ్లకు అస్సలు వినిపించలేదు.
పోస్ట్‌మార్టం ప్రాథమిక విచారణ ప్రకారం.. రాహుల్ బాడీలో ఉన్న ఆర్గాన్స్‌లోకి పెద్ద మొత్తంలో ఉప్పు నీరు, ఇసుక వెళ్లడం వల్లే అతను చనిపోయాడని ఏబీపీ ఆనంద రిపోర్ట్ చేసింది. అయితే అఫీషియల్ రిపోర్ట్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, అంత్యక్రియల కోసం రాహుల్ బెనర్జీ పార్థివ దేహాన్ని కోల్‌కతాలోని అతని ఇంటికి చేర్చారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


