OTT Crime Thrillers: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటనకు, సస్పెన్స్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నటుడు మనోజ్ బాజ్‌పాయ్ (Manoj Bajpayee). ఈ వర్సటైల్ నటుడు లీడ్ రీల్లో, దర్శకుడు రితేష్ షా తెరకెక్కించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'గజబ్ రాత్' (Gajab Raat). అక్టోబర్ 23న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ సినిమా వీక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.

సస్పెన్స్, డార్క్ కామెడీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్ మేళవింపుగా సాగే 'గజబ్ రాత్' చూసేసిన తర్వాత.. అదే తరహాలో మైండ్ బ్లోయింగ్ థ్రిల్, సీట్-ఎడ్జ్ అనుభూతిని కలిగించే మనోజ్ బాజ్‌పాయ్ బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్లను చూడాలనుకుంటే, ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ 6 సినిమాలు, వెబ్ సిరీస్ మీ వాచ్‌లిస్ట్‌లో ఖచ్చితంగా చేర్చుకోవాల్సిందే. 'ది ఫ్యామిలీ మ్యాన్', 'సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై' నుంచి 'కిల్లర్ సూప్' వరకు ప్రముఖ ఓటీటీ వేదికలలో అందుబాటులో ఉన్న వాటి వివరాలు మీకోసం.
1. ది ఫ్యామిలీ మ్యాన్ (The Family Man) — అమెజాన్ ప్రైమ్ వీడియో
ఓటీటీ ప్రపంచంలో మనోజ్ బాజ్‌పాయ్ ఇమేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన ఐకానిక వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. ఒకవైపు మధ్యతరగతి కుటుంబ బాధ్యతలు, భార్యాపిల్లల సమస్యలను చుట్టుముట్టిన సాధారణ వ్యక్తిగా.. మరోవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (T.A.S.C.) లో అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా ఆయన చేసిన నటన అద్భుతం. స్పై థ్రిల్, యాక్షన్, హ్యూమర్ కలగలిపిన ఈ సిరీస్ మూడు సీజన్లు ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.
2. సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (Sirf Ek Bandaa Kaafi Hai) — జీ5 (ZEE5)
కోర్టురూమ్ డ్రామాలు, సస్పెన్స్ కథాంశాలను ఇష్టపడే వారికి ఇదొక మాస్టర్ పీస్. ఒక అత్యంత ప్రభావవంతమైన, పవర్‌ఫుల్ దొంగ బాబాపై మైనర్ బాలిక చేసిన లైంగిక వేధింపుల కేసును వాదించే లాయర్ పి.సి. సోలంకి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ ప్రాణం పోశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, న్యాయం కోసం ఒక సాధారణ న్యాయవాది చేసిన సుదీర్ఘ పోరాటాన్ని అత్యంత సహజంగా ఆవిష్కరిస్తుంది.
3. కిల్లర్ సూప్ (Killer Soup) — నెట్‌ఫ్లిక్స్ (Netflix)
{{/usCountry}}కోర్టురూమ్ డ్రామాలు, సస్పెన్స్ కథాంశాలను ఇష్టపడే వారికి ఇదొక మాస్టర్ పీస్. ఒక అత్యంత ప్రభావవంతమైన, పవర్‌ఫుల్ దొంగ బాబాపై మైనర్ బాలిక చేసిన లైంగిక వేధింపుల కేసును వాదించే లాయర్ పి.సి. సోలంకి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ ప్రాణం పోశారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, న్యాయం కోసం ఒక సాధారణ న్యాయవాది చేసిన సుదీర్ఘ పోరాటాన్ని అత్యంత సహజంగా ఆవిష్కరిస్తుంది.
3. కిల్లర్ సూప్ (Killer Soup) — నెట్‌ఫ్లిక్స్ (Netflix)
{{/usCountry}}మనోజ్ బాజ్‌పాయ్, కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. తన భర్త స్థానంలో ప్రియుడిని ప్రవేశపెట్టాలని ప్లాన్ చేసిన ఒక మహిళ జీవితం.. అనుకోని వరుస హత్యలు, విచిత్రమైన ఘటనలతో ఎలా మలుపు తిరిగింది అనేది ఈ సిరీస్ కథాంశం. ఇందులో మనోజ్ డ్యుయల్ రోల్ చేసి తన వైవిధ్యమైన నటనతో అలరించారు.
4. సైలెంట్స్ 2: ది నైట్ ఔల్ బార్ షూటౌట్ (Silence 2) — జీ5 (ZEE5)
ఏసీపీ అవినాష్ వర్మ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'సైలెంట్స్ 2'. ఒక నైట్ బార్‌లో జరిగే దారుణమైన షూటౌట్ కేస్‌ను ఛేదించడానికి రంగంలోకి దిగిన ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్, దాని వెనుక ఉన్న అంతర్జాతీయ కుట్రను ఎలా వెలికితీసిందనేది ఈ సినిమా కథ. పక్కా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజరల్ చిత్రాలను ఇష్టపడే వారికి ఇది పర్ఫెక్ట్ చాయిస్.
5. డిస్పాచ్ (Despatch) — జీ5 (ZEE5)
క్రైమ్ జర్నలిజం నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ 'డిస్పాచ్'. కార్పొరేట్ క్రైమ్, హత్యల వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడానికి ప్రయత్నించే ఒక సీనియర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ నటించారు. పోలీస్ యాంగిల్ నుంచి కాకుండా, ఒక జర్నలిస్ట్ కోణం నుంచి నేర ప్రపంచాన్ని ఆవిష్కరించే కథాంశం ఇందులో ప్రత్యేక ఆకర్షణ.
6. డయల్ 100 (Dial 100) — జీ5 (ZEE5)
ఒకే రాత్రి నేపథ్యంలో సాగే గ్రిప్పింగ్ థ్రిల్లర్ 'డయల్ 100'. పోలీస్ ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌లో పనిచేసే నిఖిల్ సూద్ (మనోజ్ బాజ్‌పాయ్) కు ఒక రాత్రి వేళ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే మహిళ నుంచి కాల్ వస్తుంది. ఆ ఒక్క ఫోన్ కాల్ ఆయన వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని ఎలా ప్రమాదంలో పడేసిందో చూపే ఈ చిత్రం 'గజబ్ రాత్' తరహాలోనే ఉత్కంఠభరితంగా సాగుతుంది.