OTT Horror: వారమంతా బిజీ లైఫ్, ఆఫీస్ ఒత్తిడితో గడిపే డిజిటల్ ప్రేక్షకులకు వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో సరికొత్త సినిమాల కోసం వెతుకులాట మొదలవుతుంది. రొటీన్ లవ్ స్టోరీలు, కమర్షియల్ డ్రామాలతో బోర్ కొట్టిన వారికి హారర్ థ్రిల్లర్ జానర్ ఇచ్చే కిక్కే వేరు. ఈ వారం ఓటీటీలోకి ఈ 4 హారర్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.
1. త్రికాల (Trikala)

సౌత్ ఇండియన్ సినీ ప్రియులు మెచ్చే పక్కా మిస్టరీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా సాగుతుంది. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, తాంత్రిక శక్తులు, హారర్ అంశాల నేపథ్యంతో తెరకెక్కిన ఒక మైథలాజికల్ డార్క్ థ్రిల్లర్ త్రికాల. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా దాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఎందుకు చూడాలి?
రొటీన్ దెయ్యం సినిమాల్లా జంప్-స్కేర్స్‌పైనే కాకుండా.. కర్మ సిద్ధాంతం అండ్ మిస్టరీ ఎలిమెంట్స్‌తో థ్రిల్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాల ట్విస్ట్ సినిమాకే మైండ్ బ్లోయింగ్ హైలైట్ అని చెప్పాలి.
ఓటీటీ: సన్ నెక్స్ట్ (SunNXT), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), జియోహాట్ స్టార్ (Jiohotstar)
2. శిఖండి (Shikhandi)
కన్నడ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన ఈ మైండ్ బెండింగ్ హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంది. పురాణ ఇతిహాసాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను, నేటి కాలపు క్రైమ్ సస్పెన్స్‌కు ముడిపెడుతూ ఈ కథను తెరకెక్కించారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపే స్క్రీన్‌ప్లే ఈ సినిమా సొంతం.
ఎందుకు చూడాలి?
మహాభారతంలోని శిఖండి పాత్ర స్ఫూర్తితో పారానార్మల్ హారర్, రివెంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం శిఖండి. ఒక పురాతన ఆలయంలో వచ్చే ట్విస్ట్ లు మైండ్ బ్లాక్ చేస్తాయి.
{{/usCountry}}మహాభారతంలోని శిఖండి పాత్ర స్ఫూర్తితో పారానార్మల్ హారర్, రివెంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం శిఖండి. ఒక పురాతన ఆలయంలో వచ్చే ట్విస్ట్ లు మైండ్ బ్లాక్ చేస్తాయి.
{{/usCountry}}ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
3. డుగ్‌డుగ్ (DugDug)
ఇదొక విభిన్నమైన సైకలాజికల్ హారర్ డ్రామా. సాధారణ హారర్ జానర్‌కు భిన్నంగా సమాజంలో మనుషుల నమ్మకాలు, మూఢనమ్మకాల వెనుక ఉండే అసలు రహస్యాలు ఏంటి అనే అంశాన్ని కాస్త వ్యంగ్యంగా, అంతే భయపెట్టే విజువల్స్‌తో ఇందులో చూపించారు. బాలీవుడ్ హారర్ సినిమాలను ఇష్టపడే వారు అస్సలు మిస్ కాకూడని ట్రేడ్ మార్క్ చిత్రమిది.
ఎందుకు చూడాలి?
రాజస్థాన్‌లోని ప్రసిద్ధ "బుల్లెట్ బాబా" (ఓం బన్నా) నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఒక బాలీవుడ్ సెటైరికల్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ఇది. యాక్సిడెంట్ జరిగిన చోటుకు ఓ బైక్ తిరిగి ఎలా వెళ్తుందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో
4. బ్యాక్‌రూమ్స్ (Backrooms)
హాలీవుడ్ స్థాయి ఇంటెన్స్ హారర్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకునే వారికి 'బ్యాక్‌రూమ్స్' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. ఒక అంతం లేని భయంకరమైన పసుపు రంగు గదుల భవనంలో చిక్కుకుపోయిన వ్యక్తులు అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు, ఆ క్రమంలో వారు ఫేస్ చేసిన శక్తులు ఏంటి అనేది ఒళ్లు గగుర్పొడిచేలా చూపిస్తుంది.
ఎందుకు చూడాలి?
బేస్ మెంట్ లో ఉండే ఓ డోర్ ద్వారా వెళ్తే అంతులేని మిస్టరీతో కూడిన బిల్డింగ్ ఉండటమే ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్. అందులోని భయంకర శక్తులు ఇంకా వణుకు పుట్టిస్తాయి.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో (రెంట్)