...
...
Next Story

ఓటీటీలోకి మొన్న రిలీజైన ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్.. భైరవం ఒరిజినల్ మూవీ మరో ఓటీటీలో.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి మొన్న థియేటర్లలో విడుదలైన ముగ్గురు హీరోల భైరవం స్ట్రీమింగ్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తొలిసారిగా నటించిన భైరవం మూవీ ఒరిజినల్‌గా గరుడన్ చిత్రానికి రీమేక్. భైరవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తోపాటు గరుడన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 1, 2025, 12:46:33 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

టాలీవుడ్ ముగ్గురు యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తొలిసారిగా కలిసి నటించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ భైరవం. నాంది, ఉగ్రం వంటి సినిమాలతో అందించిన డైరెక్టర్ విజయ్ కనకమేడల భైరవం సినిమాకు దర్శకత్వం వహించారు.

ముగ్గురు హీరోయిన్స్

ఓటీటీలోకి మొన్న రిలీజైన ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్.. భైరవం ఒరిజినల్ మూవీ మరో ఓటీటీలో.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి మొన్న రిలీజైన ముగ్గురు హీరోల యాక్షన్ థ్రిల్లర్.. భైరవం ఒరిజినల్ మూవీ మరో ఓటీటీలో.. ఇక్కడ చూసేయండి!

శ్రీ సత్య సాయి పతాకంపై కెకె రాధా మోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భైరవం సినిమాను పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ సమర్పించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన భైరవం సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్వా పిళ్లై హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు.

యాక్షన్ ఎపిసోడ్ హైలెట్

ఎన్నో అంచనాల నడుమ రీసెంట్‌గా మొన్న (మే 30) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది భైరవం సినిమా. అయితే, ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. స్టోరీ రొటీన్‌గా ఉన్నప్పుటికీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు హీరోలు కలిసి చేసే యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉందన్నారు.

భైరవం ఓటీటీ జీ5

అయితే, ఈ మిక్స్‌డ్ టాక్ నేపథ్యంలో భైరవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఆసక్తి నెలకొంది. భైరవం ఓటీటీ హక్కులను జీ5 ప్లాట్‌ఫామ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో, జీ5లో భైరవం ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల తర్వాత భైరవం ఓటీటీ రిలీజ్ అవనుంది.

7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్

లేదా టాక్‌, రెస్పాన్స్, బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను బట్టి భైరవం ఓటీటీ రిలీజ్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇకపోతే భైరవం మూవీ తమిళ యాక్షన్ థ్రిల్లర్ గరుడన్‌కు రీమేక్. 2024 మే 31న కోలీవుడ్‌లో రిలీజ్ అయిన గరుడన్ సూపర్ హిట్ అయింది. ఐఎమ్‌డీబీ నుంచి 7.1 రేటింగ్ సైతం సాధించుకుంది.

హీరోగా కమెడియన్

సూపర్ హిట్ అయిన గరుడన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, భైరవం ఓటీటీ ప్లాట్ఫామ్ జీ5లో కాకుండా మరో ఓటీటీలో గరుడన్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్లో గరుడన్ ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం తమిళ భాషలో, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో గరుడన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks