Bhooth Bangla BO: ముగిసిన అక్షయ్ కుమార్ వనవాసం- భూత్ బంగ్లాకు ఒక్కరోజే ఏకంగా 21 కోట్ల కలెక్షన్స్- 3 రోజుల రిపోర్ట్ ఇదే!

Bhooth Bangla Box Office Collection Day 3: దాదాపు 14 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో వచ్చిన భూత్ బంగ్లా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి వీకెండ్‌లోనే ఈ హారర్ కామెడీ భారీ వసూళ్లను సాధించింది. నిన్న ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ. 21.11 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.

Apr 20, 2026, 06:09:40 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhooth Bangla 3 Days Box Office Report: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హిట్ ఫార్ములా అయిన 'హారర్ కామెడీ' జోనర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మూడో రోజు (ఆదివారం) ఈ చిత్రం ఏకంగా రూ. 21.11 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టింది. అంటే నిన్న (ఏప్రిల్ 19) ఒక్కరోజే భూత్ బంగ్లా సినిమా రూ. 21.11 కోట్ల వసూళ్లు సాధించిందన్నమాట.

ముగిసిన అక్షయ్ కుమార్ వనవాసం- భూత్ బంగ్లాకు ఒక్కరోజే ఏకంగా 21 కోట్ల కలెక్షన్స్- 3 రోజుల రిపోర్ట్ ఇదే!
ముగిసిన అక్షయ్ కుమార్ వనవాసం- భూత్ బంగ్లాకు ఒక్కరోజే ఏకంగా 21 కోట్ల కలెక్షన్స్- 3 రోజుల రిపోర్ట్ ఇదే!

భూత్ బంగ్లా నెట్ కలెక్షన్స్

మొదటి రెండు రోజులతో పోలిస్తే వసూళ్లలో స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమాపై సానుకూల స్పందన రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, భారతదేశం అంతటా భూత్ బంగ్లా చిత్రానికి 3 రోజుల్లో రూ. 56.11 కోట్ల నెట్ కలెక్షన్స్ (India Net), రూ. 66.91 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

అక్షయ్ - ప్రియదర్శన్ ద్వయం

తొలి రోజు రూ. 12.25 కోట్లతో మొదలైన ఈ ప్రయాణం, రెండో రోజు రూ. 19 కోట్లకు చేరింది. గురువారం నిర్వహించిన పెయిడ్ ప్రివ్యూల ద్వారా మరో రూ. 3.50 కోట్లు ఖాతాలో పడ్డాయి. అక్షయ్ - ప్రియదర్శన్ ద్వయం అంటేనే వినోదానికి గ్యారెంటీ అని భావించే ప్రేక్షకులు 'భూత్ బంగ్లా' మ్యాజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

అక్షయ్ కుమార్ 'వనవాసం' ముగిసింది

అయితే, భూత్ బంగ్లా సినిమా ప్రమోషన్ల సమయంలో అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్రియదర్శన్ సార్‌తో కలిసి పనిచేసి 14 ఏళ్లవుతోంది. నా వనవాసం ముగిసి మళ్లీ ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతోంది. ఆయన సినిమాల్లో అసభ్యత ఉండదు, కుటుంబంతో కలిసి చూసేలా ఉంటాయి" అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'హేరా ఫేరి', 'భూల్ భులయా', 'గరం మసాలా' వంటి చిత్రాలు కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. ఇప్పుడు అదే స్థాయిలో 'భూత్ బంగ్లా' కూడా అలరిస్తోంది.

ఆసక్తికరంగా సాగే కథాంశం

లండన్‌లో ఉండే అర్జున్ (అక్షయ్ కుమార్) తన సోదరి (మిథిలా పాల్కర్) కి వారసత్వంగా లభించిన ఒక పురాతన ప్యాలెస్ కోసం ఇండియాలోని మంగళపూర్‌కు వస్తాడు. అక్కడ పెళ్లిళ్లు జరగవని, 'వధుసూరుడు' వచ్చి పెళ్లికూతుళ్లను తీసుకెళ్తాడని ఒక వింత కథ ప్రచారంలో ఉంటుంది. ఆ ప్యాలెస్ చుట్టూ ఉన్న రహస్యమేంటి? అర్జున్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడనేది కడుపుబ్బ నవ్వించేలా దర్శకుడు తెరకెక్కించారు. టబు, వామికా గబ్బి, రాజ్‌పాల్ యాదవ్ వంటి నటుల నటన ఈ సినిమాకు అదనపు బలంగా మారింది.

హిట్ ట్రాక్ ఎక్కేందుకు

బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తా కపూర్ నిర్మించిన భూత్ బంగ్లా చిత్రం అక్షయ్ కుమార్‌కు హిట్ ట్రాక్ ఎక్కేందుకు దోహదపడింది. వారం మధ్యలో కూడా ఇదే జోరు కొనసాగితే, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో 'భూత్ బంగ్లా' నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More