Bhooth Bangla BO: తొలి రోజే భూత్ బంగ్లాకు 18 కోట్ల కలెక్షన్స్- ఆ మూవీకి మించిన అక్షయ్ కుమార్ హారర్ కామెడీ మూవీ వసూళ్లు!

Bhooth Bangla Box Office Collection Day 1: దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్, అక్షయ్ కుమార్ కాంబోలో వచ్చిన హారర్ కామెడీ మూవీ భూత్ బంగ్లా థియేటర్లలో నిన్నటి నుంచి సందడి చేస్తోంది. తొలిరోజే భారీ వసూళ్లతో భూత్ బంగ్లా సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. సూపర్ హిట్ అయిన ఓ మూవీని ఇది దాటేసింది.

Published on: Apr 18, 2026, 06:25:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhooth Bangla 1st Day Collection: టాలీవుడ్ ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కలయికలో సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'హీరా ఫేరీ', 'భూల్ భూలయ్య' వంటి చిత్రాలు కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచాయి. సరిగ్గా అదే మేజిక్‌ను రిపీట్ చేస్తూ, తాజాగా ఏప్రిల్ 17న విడుదలైన 'భూత్ బంగ్లా' బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది.

తొలి రోజే భూత్ బంగ్లాకు 18 కోట్ల కలెక్షన్స్- ఆ మూవీకి మించిన అక్షయ్ కుమార్ హారర్ కామెడీ మూవీ వసూళ్లు!
తొలి రోజే భూత్ బంగ్లాకు 18 కోట్ల కలెక్షన్స్- ఆ మూవీకి మించిన అక్షయ్ కుమార్ హారర్ కామెడీ మూవీ వసూళ్లు!

తొలిరోజే రికార్డు స్థాయి వసూల్లు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'భూత్ బంగ్లా' సినిమా మొదటిరోజే దేశవ్యాప్తంగా అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 3.32 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ చిత్రం పెయిడ్ ప్రివ్యూల ద్వారా మరో రూ. 3.50 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తంగా మొదటి రోజు భూత్ బంగ్లా సినిమా భారత్‌లో రూ. 15.75 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. అలాగే, గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే ఈ మొత్తం 18.90 కోట్ల రూపాయలకు చేరుకుంది.

ఈ వసూళ్లతో కార్తీక్ ఆర్యన్ నటించిన సూపర్ హిట్ మూవీ 'భూల్ భులయా 2' మొదటి రోజు ఇండియన్ నెట్ కలెక్షన్స్ (రూ. 14.50 కోట్లు) రికార్డును అక్షయ్ కుమార్ అధిగమించారు. అయితే, ఇటీవలి కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'స్త్రీ 2' (రూ. 55 కోట్లు) రికార్డుకు మాత్రం ఈ చిత్రం దూరంగానే ఉంది.

పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ప్రియదర్శన్ మార్క్

దర్శకుడు ప్రియదర్శన్ తనదైన శైలిలో వినోదాన్ని పండించడంలో దిట్ట. ఈ సినిమాలోనూ ఆయన మార్క్ కామెడీ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా 'భూల్ భూలయ్య' చిత్రీకరించిన 'చోము ప్యాలెస్'లోనే ఈ సినిమాను కూడా షూట్ చేయడం ప్రేక్షకులకు పాత రోజులను గుర్తు చేస్తోంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ, అత్యాధునిక వీఎఫ్ఎక్స్ (VFX) ఈ హారర్ కామెడీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

రాజ్‌పాల్ యాదవ్ కామెడీ టైమింగ్, టబు నటన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చాయి. వామికా గబ్బి, జిషూ సేన్ గుప్తా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అక్షయ్ కుమార్ ఎనర్జీ భూత్ బంగ్లా సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

వివాదాలు దాటుకుని విజయతీరానికి

అయితే, భూత్ బంగ్లా సినిమాలో ఉపయోగించిన ఒక పాట లిరిక్స్ ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే సినిమా నుంచి తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రియదర్శన్ స్పందిస్తూ.. "మేము ఎవరినీ కాపీ కొట్టలేదు, సత్యజిత్ రే అంటే మాకు ఎంతో గౌరవం. ఆ పాట సందర్భోచితంగా రాసింది మాత్రమే" అని క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనా, ఈ చిన్నపాటి వివాదాలు సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More