Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు.. బిగ్ ట్విస్ట్‌.. ఎలిమినేష‌న్‌కు ద‌గ్గ‌ర‌గా ఆటో రాంప్ర‌సాద్‌.. హై రిస్క్ జోన్!

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రెడ్ అండ్ బ్లూ టీమ్స్ కు బిగ్ బాస్ పెద్ద శిక్షే వేశాడు. ఈ రెండు టీమ్స్ లో నుంచి ఒక్కో కంటెస్టెంట్ హై రిస్క్ జోన్ లోకి వెళ్లారు. అయితే ఇందులో పాపులర్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. 

Published on: Sep 9, 2026, 11:27:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగులో మైల్ స్టోన్ సీజన్ 10లో ట్విస్ట్ ల మోత మొదలైంది. బిగ్ బాస్ 10 తెలుగులో స్టార్టింగ్ లోనే బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరు కంటెస్టెంట్లను డైరెక్ట్ గా ఎలిమినేషన్ కు దగ్గర చేసేలా హై రిస్క్ జోన్ లో పడేశాడు.

బిగ్ బాస్ 10 తెలుగు.. బిగ్ ట్విస్ట్‌.. ఎలిమినేష‌న్‌కు ద‌గ్గ‌ర‌గా ఆటో రాంప్ర‌సాద్‌.. హై రిస్క్ జోన్! (youtube/starmaa)
బిగ్ బాస్ 10 తెలుగు.. బిగ్ ట్విస్ట్‌.. ఎలిమినేష‌న్‌కు ద‌గ్గ‌ర‌గా ఆటో రాంప్ర‌సాద్‌.. హై రిస్క్ జోన్! (youtube/starmaa)

బిగ్ బాస్ 10 తెలుగు

పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 10లో డ్రామా షురూ అయింది. సెప్టెంబర్ 6న గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ సీజన్లో ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య గొడవలతో హీట్ పెరిగింది. తాజాగా బిగ్ బాస్ ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. గేమ్స్ రూల్స్ బ్రేక్ చేసినందుకు గాను రెడ్ టీమ్, బ్లూ టీమ్ కు పెద్ద శిక్షనే వేశాడు.

హై రిస్క్ లో రాంప్రసాద్

రెడ్ టీమ్, బ్లూ టీమ్ నుంచి ఒక్కొక్కరిని హై రిస్క్ లోకి వెళ్లేలా సెలెక్ట్ చేయమని రెండు టీమ్స్ ను బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే బ్లూ టీమ్ కెప్టెన్ అయిన రాంప్రసాద్ తనే ఓన్ గా హై రిస్క్ లోకి వెళ్తాననే నిర్ణయం తీసుకున్నాడు. మరోవైపు రెడ్ టీమ్ లో మాత్రం అందరూ కలిసి చరణ్ ను సెలెక్ట్ చేశారు.

ఎలిమినేషన్ కు దగ్గరగా

హై రిస్క్ లోకి వెళ్లిన కంటెస్టెంట్లకు బిగ్ బాస్ పెద్ద షాకే ఇచ్చాడు. ఆలో రాంప్రసాద్, చరణ్ ఎలిమినేషన్ కు దగ్గరగా ఉన్నాడని చెప్పాడు. దీంతో టీమ్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. రాంప్రసాద్ ఏమో హై రిస్క్ నుంచి బయటకు వస్తాననే కాన్ఫిడెన్స్ తో కనిపించాడు.

రోహిత్ డబుల్ గేమ్

అయితే హౌస్ లో రోహిత్ నాయుడు డబుల్ గేమ్ ఆడుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. హై రిస్క్ లోకి ఎవరిని పంపించాలనే విషయంలో ఫస్ట్ చరణ్ పేరునే రోహిత్ చెప్పాడు. కానీ ఆ తర్వాత నాకు ఛాయిస్ ఉంటే సేవ్ చేసేవాడినని చరణ్ ను పట్టుకుని రోహిత్ ఏడ్చాడు. దీంతో రోహిత్ డబుల్ గేమ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఝాన్సీ కట్టప్ప

మరోవైపు కామనర్ గా బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లోకి వెళ్లిన సింగర్ ఝాన్సీపై కూడా నెట్టింట విమర్శలు వస్తున్నాయి. రెడ్ టీమ్ లో ఉన్న ఆమె తమ టీమ్ విషయాలన్నింటినీ బ్లూ టీమ్ లో ఉన్న త్రిగుణ్ కు చేరవేస్తుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఝాన్సీని కట్టప్ప అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More