Bigg Boss Winner: బిగ్ బాస్ గెలిచినా ఇప్పటి వరకూ ఆ రూ.50 లక్షలు ఇవ్వలేదు.. రోజూ 50 మంది నా ఇంటికి వస్తుంటారు: గౌరవ్
Bigg Boss Winner: బిగ్ బాస్ సీజన్ 19 విన్నర్ గౌరవ్ ఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ రియాల్టీ షో గెలిచి మూడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకూ ఇవ్వాల్సిన రూ.50 లక్షల ప్రైజ్ మనీ మాత్రం రాలేదని వెల్లడించాడు.
ప్రముఖ నటుడు గౌరవ్ ఖన్నా 'బిగ్ బాస్ సీజన్ 19' విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు నెలల పాటు సాగిన డ్రామా, గొడవలు, ఎమోషన్ల మధ్య తన హుందాతనాన్ని కాపాడుకుంటూ అతడు టైటిల్ నెగ్గాడు. డిసెంబర్ 2025లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ సల్మాన్ ఖాన్ అతన్ని విజేతగా ప్రకటించాడు. అయితే షో ముగిసి నెలలు గడుస్తున్నా, తనకు రావాల్సిన బహుమతి మొత్తం ఇంకా అందలేదని గౌరవ్ తాజాగా వెల్లడించడం చర్చనీయాంశమైంది.

'డబ్బులు ఇంకా రాలేదు.. కానీ నమ్మకం ఉంది'
బిగ్ బాస్ 19 విజేత అయిన గౌరవ్ ఖన్నా తన తాజా యూట్యూబ్ వ్లాగ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ ఈ విషయాన్ని పంచుకున్నాడు. షోలో ప్రకటించిన ₹50 లక్షల నగదు బహుమతి, కారు, ఇతర కూపన్లు మీకు అందాయా అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అతడు సమాధానమిచ్చాడు.
"నిజం చెప్పాలంటే, ఇవన్నీ చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి అయితే నాకు ఇంకా ప్రైజ్ మనీ అందలేదు. కానీ కచ్చితంగా వస్తుందని నమ్ముతున్నాను. దీనికంటూ ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది" అని గౌరవ్ పేర్కొన్నాడు.
ఆలస్యానికి కారణం అదేనా?
టీవీ ఇండస్ట్రీలో ఇలాంటి ఆలస్యాలు సహజమేనని గౌరవ్ అభిప్రాయపడ్డాడు. "కంపెనీకి సంబంధించిన ఇంటర్నల్ ఆడిట్స్ వంటి పనులు ఉంటాయి కాబట్టి, 1-2 నెలల సమయం పట్టడం మామూలే. రాకుండా పోయే ప్రసక్తే లేదు, కాకపోతే కొంచెం ఆలస్యం అవుతోంది. నేను టీవీ రంగానికి చెందినవాడిని కాబట్టి, ఇక్కడ పేమెంట్స్ విషయంలో ఉండే జాప్యం గురించి నాకు తెలుసు" అని అతడు చాలా కూల్‌గా సమాధానమిచ్చాడు.
జీవితం ఎలా మారింది?
బిగ్ బాస్ గెలిచిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి చెబుతూ.. కాన్పూర్‌లోని తన ఇంటికి రోజూ 50-60 మంది అభిమానులు వస్తున్నారని గౌరవ్ తెలిపాడు. ఎటువంటి అనవసరపు గొడవలు, శృతిమించిన వాదనలు లేకుండా ఎంతో క్లాస్‌గా గేమ్ ఆడి గెలవడం పట్ల జనం తనను ఎంతో గౌరవిస్తున్నారని అతడు ఆనందం వ్యక్తం చేశాడు. గతంలో తాను చేసిన ఇతర సీరియల్స్ కంటే, బిగ్ బాస్ వల్లే తనకు విపరీతమైన గుర్తింపు వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు.
గౌరవ్ ఖన్నా గతంలో 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్' టైటిల్ కూడా గెలుచుకున్నాడు. బిగ్ బాస్ 19 ఫినాలేలో ఫర్హానా భట్, తాన్యా మిట్టల్, ప్రణీత్ మోరే, అమాల్ మాలిక్ వంటి గట్టి పోటీదారులను ఓడించి అతడు విజేతగా నిలిచాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


