బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ లో ఫైట్ మరింత టఫ్ గా మారుతోంది. ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ హోరాహోరీగా సాగింది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు వచ్చి బిగ్ బాస్ లో ఉన్న వాళ్లను నామినేట్ చేశారు. ఈ వారం నామినేషన్లలో 8 మంది కంటెస్టెంట్లున్నారు. ఓటింగ్ చూస్తే సీరియల్ హీరోయిన్ మళ్లీ టాప్ లోనే కొనసాగుతోంది.
బిగ్ బాస్ 9 తెలుగు నామినేషన్స్

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎనిమిది వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం నామినేషన్లలో 8 మంది కంటెస్టెంట్లున్నారు. ఇందులో తనుజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సంజన గల్రానీ, రాము రాథోడ్, మాధురి దువ్వాడ, రీతు చౌదరి, గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్ హౌస్ నుంచి వెళ్లిపోయేందుకు నామినేట్ అయ్యారు.
ఎలిమినేట్ అయినవాళ్లు
ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ ప్రక్రియ ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఈ ఏడు వారాల్లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్లు వచ్చి, ఇప్పుడున్న వాళ్లను నామినేట్ చేశారు. ఇందులో సంజనపై భరణి, డీమాన్ పవన్ పై శ్రష్టి వర్మ మాటలతో విరుచుకుపడ్డారు. తనూజ, గౌరవ్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది.
బిగ్ బాస్ ఓటింగ్
బిగ్ బాస్ 9 నుంచి ఈ వారం నామినేషన్లలో 8 మంది ఉన్నారు. వీళ్ల ప్రస్తుత ఓటింగ్ చూసుకుంటే సీరియల్ హీరోయిన్ తనుజ పుట్టస్వామి మరోసారి టాప్ లో కొనసాగుతోంది. ఇప్పుడు ఆమెకు 35.4 శాతం ఓట్లున్నాయి. కల్యాణ్ పడాల సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అతనికి 19.43 శాతం ఓట్లున్నాయి.
డేంజర్ జోన్
బిగ్ బాస్ 9 తెలుగు ఎనిమిదో వారం ఓటింగ్ చూసుకుంటే రాము రాథోడ్ (8.64 శాతం), మాధురి దువ్వాడ (6.44 శాతం), రీతు చౌదరి (6.4 శాతం) వరుసగా మూడు, నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతానికి గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నారు.
గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్ ఓట్ల శాతంలోనూ పెద్దగా డిఫరెన్స్ లేదు. వీళ్లిద్దరూ 6.25 శాతం ఓట్లతో ఇప్పుడు లాస్ట్ రెండు ప్లేస్ ల్లో ఉన్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే వీళ్లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. హౌస్ నుంచి వెళ్లే ప్రమాదం డీమాన్ పవన్ కే ఎక్కువగా పొంచి ఉందని తెలుస్తోంది.
{{/usCountry}}గౌరవ్ గుప్తా, డీమాన్ పవన్ ఓట్ల శాతంలోనూ పెద్దగా డిఫరెన్స్ లేదు. వీళ్లిద్దరూ 6.25 శాతం ఓట్లతో ఇప్పుడు లాస్ట్ రెండు ప్లేస్ ల్లో ఉన్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే వీళ్లలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. హౌస్ నుంచి వెళ్లే ప్రమాదం డీమాన్ పవన్ కే ఎక్కువగా పొంచి ఉందని తెలుస్తోంది.
{{/usCountry}}