Arjun Ambati Comments In Evare Song Launch Event: అనిశ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట కల్యాణ్ మండవిల్లి సమర్పణలో శిరీష మండవిల్లి నిర్మాణంలో ‘ఎవరే’ ప్రైవేట్ ఆల్బమ్‌ని ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఆల్బమ్‌కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతల్ని ఆనంద్ నిర్వర్తించారు.
క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో

ఎస్ఎస్ వర్దన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బమ్‌లో వెచలపు కృష్ణ, రిద్ది అనామిక చరణ్ నటించారు. ఎవరే సాంగ్‌ను మే 1న క్రేజీ ఎన్ క్యాచీ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో బుధవారం (ఏప్రిల్ 22) ఎవరే పాటకు సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిగ్ బాస్ అర్జున్ అంబటి, సింగర్ సాకేత్, రాంబాబు గోసాల ముఖ్య అతిథిగా విచ్చేశారు.
పవన్ కల్యాణ్ సింగర్‌గా
అర్జున్ అంబటి మాట్లాడుతూ .. "‘ఎవరే’ టీంకు ఆల్ ది బెస్ట్. నిర్మాత బాగుంటేనే మళ్లీ ఇంకో పాటను గానీ, సినిమాను గానీ తీస్తారు. పవన్ కల్యాణ్ పాట పాడుతూ ఉంటే నేను పర్ఫామ్ చేశాను. పవన్ కల్యాణ్ సింగర్‌గా ఇంకా మంచి స్టేజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. వర్దన్ మ్యూజిక్ బాగుంది. కృష్ణ, రిద్ధి జంట బాగుంది. పక్కింటి అబ్బాయిలా కృష్ణ కనిపిస్తున్నారు. ‘ఎవరే’ పాట మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
తమన్ రేంజ్‌లో
సింగర్ సాకేత్ మాట్లాడుతూ .. "‘ఎవరే’ టీంకు ఆల్ ది బెస్ట్. ఎస్ఎస్ వర్దన్ పేరు బాగుంది. తమన్ అన్న రేంజ్‌లో ఎదగాలని కోరుకుంటున్నాను. పవన్ కల్యాణ్, అనన్య చక్కగా పాడారు. పాటలో ఎనర్జీ, మెలోడీ రెండూ చక్కగా కుదిరాయి. కృష్ణ, రిద్ధి అనామిక జంట బాగుంది. ఈ పాట మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని కోరారు.
ఎవరో సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని
రాంబాబు గోసాల మాట్లాడుతూ .. "‘ఎవరే’ ప్రోమో చూశాను. నాకు చాలా నచ్చింది. లిరిక్స్ కూడా బాగున్నాయి. హీరో కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు. ఎస్ఎస్ వర్దన్ మా ఎస్ఎస్ తమన్ రేంజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘ఎవరే’ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.
ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాం
{{/usCountry}}రాంబాబు గోసాల మాట్లాడుతూ .. "‘ఎవరే’ ప్రోమో చూశాను. నాకు చాలా నచ్చింది. లిరిక్స్ కూడా బాగున్నాయి. హీరో కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు. ఎస్ఎస్ వర్దన్ మా ఎస్ఎస్ తమన్ రేంజ్‌కి వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘ఎవరే’ సాంగ్ పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను" అని అన్నారు.
ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాం
{{/usCountry}}మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వర్ధన్ మాట్లాడుతూ .. "‘ఎవరే’ పాట కోసం మేం ఏడాది నుంచి వర్క్ చేస్తున్నాం. నా విజన్‌కి సపోర్ట్ చేసిన ఆనంద్, కృష్ణకి థాంక్స్. ఏడాది పాటుగా మేము శ్రమించి ఈ పాటను తెరకెక్కించాం. పవన్ కళ్యాణ్, అనన్య మా పాటను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లారు" అని చెప్పారు.
కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు
"వల్లభ అన్నతో నేను నాలుగేళ్లుగా పని చేస్తున్నాను. ఆయన నాకెంతో సపోర్ట్ చేశారు. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా టీమ్, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్ తరంగ్‌కి థాంక్స్. కృష్ణ, రిద్ధి చక్కగా నటించారు. ఈ పాట మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. మే 1న మా పాట రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి" అని సంగీత దర్శకుడు ఎస్ఎస్ వర్ధన్ తెలిపారు.