Kirrak Seetha: సినిమా ఛాన్స్.. ఫామ్ హౌస్ కు రమ్మన్నారు.. రూ.25 లక్షలు ఇస్తామన్నారు: బిగ్ బాస్ కిర్రాక్ సీత కామెంట్లు
Kirrak Seetha: యూట్యూబ్ వీడియోలతో స్టార్ట్ చేసి, ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న కిర్రాక్ సీత సంచలన విషయాన్ని బయటపెట్టింది. బిగ్ బాస్ తో మరింత పాపులర్ అయిన ఈ బ్యూటీ.. తనను ఫామ్ హౌస్ కు రమ్మన్నారని, రూ.25 లక్షలు ఇస్తామన్నారని చెప్పుకొచ్చింది.
Kirrak Seetha: బేబీ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న కిర్రాక్ సీత చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తన కెరీర్ స్టార్టింగ్ లో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆమె వెల్లడించింది. ఈ క్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫామ్ హౌస్ కు రమ్మన్నారని, రూ.25 లక్షలు ఇస్తామన్నారని సీత చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

కిర్రాక్ సీత కామెంట్లు
తాాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో కిర్రాక్ సీత పాల్గొంది. ఈ సందర్భంగా గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని ఈ బిగ్ బాస్ బ్యూటీ పంచుకుంది. ‘‘7 ఆర్ట్స్ కోసం షూటింగ్ చేస్తున్నా. అప్పుడే నాకు ఓ కాల్ వచ్చింది. సినిమాలో ఆఫర్ ఉందని చెప్పారు. హ్యాపీగా ఫీల్ అయ్యా. అప్పుడు నాకు 21 లేదా 22 ఏళ్లు. మూవీలో యాక్టింగ్ చేస్తానని చెప్పా. కానీ నన్ను ఫామ్ హౌస్ కు రావాలని చెప్పారు’’ అని సీత వెల్లడించింది.
రూ.25 లక్షలు
‘‘ఫామ్ హౌస్ కు రావాలన్నారు. ‘ఎందుకు మీ మూవీ ఆఫీస్ ఉంటుంది కదా’ అని అడిగా. మూవీ టీమ్ అందిరినీ పిలుస్తున్నారని చెప్పారు. నేను ఓకే అన్నా. కానీ వెళ్లలేదు. సాయంత్రం వరకూ వాళ్లు కాల్ చేశారు. నేను పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రెజర్ చేయలేదు. అయితే రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ కాల్ చేశారు. ఫామ్ హౌస్ కు ఎందుకు రాలేదని అడిగారు. వస్తే రూ.25 లక్షలు ఇస్తారని చెప్పాడు’’ అని సీత సంచలన విషయాలు బయటపెట్టింది.
నో చెప్పేశా
‘‘మనీ ఆఫర్ చేయగానే నేను నో చెప్పేశా. ఇలా చాలా మంది కాల్స్, మెసేజ్ లు చేస్తుంటారు. ఇక మన నంబర్ ఎవరికైనా దొరికిితే ఇలాగే చేస్తారు. సిరీస్ తీస్తున్నామని అంటారు. ఒకవేళ ఓకే అని చెప్పాననుకో, ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కదా అంటారు. నేను కావాలనే ఎలా ఉంటాయని అడుగుతా. వాళ్లు చెప్పే సరికి అసలు సిగ్గుందా అని కట్ చేస్తా’’ అని సీత తెలిపింది.
యూట్యూబ్ తో
యూట్యూబ్ లో వచ్చే 7 ఆర్ట్స్ లో బోల్డ్ వీడియోలతో కిర్రాక్ సీత ఫేమస్ అయింది. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. బిగ్ బాస్ లోనూ పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయింది. ముఖ్యంగా బేబీ సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్ తో కిర్రాక్ సీత యాక్టింగ్ లో అదరగొట్టింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


