Bigg Boss Pallavi Prashanth: పేరుకే రూ.50 లక్షలు.. చేతికి వచ్చిందేమీ లేదు..: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కోతలపై పల్లవి ప్రశాంత్

Bigg Boss Pallavi Prashanth: బిగ్ బాస్ ప్రైజ్ మనీలో విజేతకు చివరికి దక్కేది ఎంత అన్న ప్రశ్నకు పల్లవి ప్రశాంత్ తాజాగా సమాధానం చెప్పారు. బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విజేత అయిన ఈ రైతు బిడ్డ కోతలన్నీ పోయిన తర్వాత తనకు మిగిలిందేమీ లేదని చెప్పడం గమనార్హం.

Published on: Aug 24, 2026, 11:19:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bigg Boss Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత 'రైతు బిడ్డ' పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ, గిఫ్ట్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షో నిర్వాహకులు ప్రకటించిన మొత్తం నగదు, బహుమతులు తనకు పూర్తిగా అందలేదని, పెద్ద మొత్తంలో కోతలు విధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించడంతో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

Bigg Boss Pallavi Prashanth: పేరుకే రూ.50 లక్షలు.. చేతికి వచ్చిందేమీ లేదు..: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కోతలపై పల్లవి ప్రశాంత్
Bigg Boss Pallavi Prashanth: పేరుకే రూ.50 లక్షలు.. చేతికి వచ్చిందేమీ లేదు..: బిగ్‌బాస్ ప్రైజ్‌మనీ కోతలపై పల్లవి ప్రశాంత్

ప్రకటించిన బహుమతులు ఏంటి? చేతికి వచ్చింది ఎంత?

బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజున హోస్ట్ అక్కినేని నాగార్జున విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించారు. ఆ సమయంలో విజేతకు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్, మారుతి సుజుకి బ్రెజా కార్ తో పాటు రూ. 15 లక్షల విలువైన జోయాలుక్కాస్ జ్యువెలరీ వోచర్ ఇస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

అయితే టాక్స్, టీడీఎస్ డిడక్షన్స్ పేరుతో ప్రైజ్‌మనీ రూ.35 లక్షల్లో దాదాపు 40 శాతం కోత విధించినట్లు ప్రశాంత్ తెలిపారు. ప్రైజ్ మనీలో టీడీఎస్ కట్ అవ్వడం సాధారణమే అయినప్పటికీ, స్పాన్సర్లు ఇచ్చిన వోచర్లు, ఇతర బహుమతుల విషయంలో కూడా రకరకాల కండిషన్లు పెట్టి పూర్తి ప్రయోజనం అందకుండా చేశారని ప్రశాంత్ సంచలన ఆరోపణలు చేశారు.

కార్ గిఫ్ట్, జ్యువెలరీ వోచర్‌పై క్లారిటీ

ఫినాలే స్టేజ్ మీద చూపించిన బ్రెజా కార్ కూడా వెంటనే హ్యాండోవర్ చేయలేదని, దానికి సంబంధించిన ప్రాసెస్ పూర్తయ్యేసరికి చాలా సమయం పట్టిందని ప్రశాంత్ వెల్లడించారు. ఆ కారేదో తాను కొన్నట్లుగా రూ.8.5 లక్షలు కట్టించుకున్నారని చెప్పడం గమనార్హం. ప్రైజ్ మనీ రూ.35 లక్షల్లో 40 శాతానికి పైగా పోయిందని, అలాగే నెక్లెస్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పారు. జ్యువెలరీ వోచర్ విషయంలో కూడా కొన్ని నిబంధనల వల్ల పూర్తి స్థాయి బెనిఫిట్ దక్కలేదని చెప్పారు.

తనలాంటి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇదొక పెద్ద దెబ్బ అని, బయటకు కనిపించే ఆర్భాటానికి, చేతికి వచ్చే అసలు మొత్తానికి చాలా తేడా ఉంటుందని పల్లవి ప్రశాంత్ స్పష్టం చేశారు. భారీగా ప్రైజ్ మనీ వచ్చిందని తాను స్టేజ్ మీదే అది చేస్తా, ఇది చేస్తానని చెప్పానని.. తీరా చూస్తే తన జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ప్రశాంత్ వెల్లడించారు. ఇప్పటికీ తాను సంపాదించిన దాంట్లో 50 శాతం సేవ కోసమే వినియోగిస్తానని స్పష్టం చేశారు.

రైతు బిడ్డ ప్రయాణం.. వివాదాలు, కంబ్యాక్

కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన పల్లవి ప్రశాంత్.. 'రైతు బిడ్డ' అనే టాగ్ తో బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. హౌస్‌లోని ఇతర కంటెస్టెంట్లతో పోటీపడి భారీగా ఓట్లు సాధించి అమర్‌దీప్ చౌదరిని ఓడించి విన్నర్‌గా నిలిచారు.

అయితే ఫినాలే ముగిసిన వెంటనే అన్నపూర్ణ స్టూడియోస్ బయట జరిగిన గొడవలు, ఆర్టీసీ బస్సు ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ డిజిటల్ కంటెంట్ క్రియేషన్‌పై దృష్టి పెట్టారు. ఇప్పుడు ప్రైజ్ మనీ కోతలపై ఆయన చేసిన కామెంట్స్ బుల్లితెర వర్గాల్లో వేడి రాజేస్తున్నాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More