Nagarjuna: సగం రెమ్యునరేషన్ కూడా ఇవ్వరు.. 100 రోజుల్లో మూవీ తీయొచ్చు.. పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి: నాగార్జున
Nagarjuna: అక్కినేని నాగార్జున తన 100వ సినిమా, హీరోల రెమ్యునరేషన్లపై వచ్చే వార్తలు, అన్నపూర్ణ స్టూడియోస్ ఇతర ప్రొడక్షన్ హౌస్ లతో కలిసి చేస్తున్న సినిమాలపై మాట్లాడారు. వెరైటీ ఇండియా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Nagarjuna: హీరోలకు రూ. 100 కోట్లు, రూ. 150 కోట్లు పారితోషికం ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ ఒట్టి పుకార్లేనని కింగ్ అక్కినేని నాగార్జున తెగేసి చెప్పారు. మీడియాలో ప్రచారమయ్యే భారీ పారితోషికాల సంఖ్యల్లో కనీసం 50 శాతం కూడా హీరోలకు దక్కదని, ఇండస్ట్రీలో ఇదంతా కేవలం ఓవర్ హైప్ క్రియేషన్ మాత్రమేనని బాంబ్ పేల్చారు.

తన ల్యాండ్‌మార్క్ 100వ సినిమా 'కింగ్ 100' షూటింగ్ అప్‌డేట్‌తో పాటు అక్కినేని హీరోల క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టులపై నాగ్ సంచలన విషయాలు పంచుకున్నారు. వెరైటీ ఇండియా ఇంటర్వ్యూలో నాగార్జున ఏమన్నారో చూడండి.
హీరోల రెమ్యునరేషన్‌పై నాగార్జున సంచలన వ్యాఖ్యలు
హీరోలు రెండేళ్లకు ఒక సినిమా చేయడం వల్ల సినిమా బిజినెస్ తీవ్రంగా దెబ్బతింటోందని నాగార్జున స్పష్టం చేశారు. అందుకే పెద్ద హీరోలు ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాలని కోరారు. సరైన ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ ఉంటే ఏ పెద్ద సినిమానైనా 100 రోజుల్లో పూర్తి చేయడం చాలా ఈజీ అని చెప్పారు.
సోషల్ మీడియాలో చూపించే హీరోల మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ అమౌంట్లు చూసి జనం నిజమని నమ్మేస్తున్నారని నాగ్ అన్నారు. కానీ వాస్తవానికి నిర్మాత అక్కడ ఇచ్చేది అందులో సగం కూడా ఉండదని సీక్రెట్ బయటపెట్టారు. టాప్ స్టార్స్ ఎక్కువ సినిమాలు చేస్తేనే ఇండస్ట్రీకి మనుగడ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
'కింగ్ 100' షూటింగ్ అప్‌డేట్.. 32 ఏళ్ల ఏజ్ ట్రాన్స్‌ఫార్మేషన్
తన సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచే 100వ సినిమా 'King 100' వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోంది. ఒక సాధారణ వ్యక్తి అత్యంత పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగే ఫ్యామిలీ డ్రామా కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ 32 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి ఏజ్ వరకు వివిధ దశల్లో కనిపిస్తుంది. ఇప్పటికే 65 శాతం షూటింగ్ పూర్తయిన ఈ ప్రాజెక్ట్‌ను ఏడాది చివర్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
"సినిమా అవుట్‌పుట్ పూర్తిగా చూసిన తర్వాతే 'కింగ్ 100' ఒరిజినల్ టైటిల్‌ను కన్ఫర్మ్ చేస్తాం. ఒక క్లాసిక్ స్టోరీతో చిరకాలం గుర్తుండిపోయే కథ కావాలనే ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను" అని ఈ సందర్భంగా నాగార్జున వెల్లడించారు.
ముగ్గురు అక్కినేని హీరోలతో ‘బంగార్రాజు 3’
అక్కినేని అభిమానులకు నాగార్జున ఒక ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' సినిమాల సక్సెస్ ఫ్రాంచైజీలో 'బంగార్రాజు 3' రాబోతోందని అధికారికంగా ప్రకటించారు.
ఈ మూడో భాగంలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ అక్కినేని ముగ్గురూ కలిసి ఒకే స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీగా రూపుదిద్దుకోనున్న ఈ బిగ్ మల్టీస్టారర్ షూటింగ్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.
స్టూడియో కొలాబరేషన్స్.. అఖిల్ 'లెనిన్' సక్సెస్
ఒక్క ప్రొడక్షన్ హౌస్ మాత్రమే సొంతంగా సినిమాలు తీసే రోజులు పోయాయని, కొలాబరేషన్స్ మాత్రమే భవిష్యత్తు బిజినెస్ మోడల్ అని నాగ్ తేల్చిచెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం 6 సినిమాలను వేర్వేరు పెద్ద బ్యానర్లతో కలిసి నిర్మిస్తోంది.
ఇటీవలే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి తీసిన అఖిల్ 'లెనిన్' మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగచైతన్య నెక్స్ట్ ప్రాజెక్ట్, నాగార్జున 100వ సినిమా కూడా అగ్ర నిర్మాణ సంస్థలతో సంయుక్తంగానే రూపుదిద్దుకుంటున్నాయి.
రూట్స్ మర్చిపోని సౌత్ సినిమా.. రాజమౌళి సీక్రెట్
సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో దుమ్మురేపడానికి ప్రధాన కారణం మన డైరెక్టర్లు తమ మూలాలు, నేటివిటీని మరచిపోకపోవడమే అని నాగార్జున తెలిపారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మన సంస్కృతికి కట్టుబడి సినిమాలు తీస్తారు కాబట్టే అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధిస్తున్నారు.
తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (ANR) నేర్పిన క్రమశిక్షణ, పని పట్ల గౌరవం తనను 40 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా నిలబెట్టాయని నాగ్ గుర్తుచేసుకున్నారు. 1986లో తొలి సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగార్జున ఈ ఏడాదితో 40 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


