King 100 DSP: కింగ్ 100 క్రేజీ అప్‌డేట్.. నాగార్జున మైల్‌స్టోన్ మూవీకి రాక్‌స్టార్ మ్యూజిక్.. డీఎస్పీనే ఎందుకు?
King 100 DSP: అక్కినేని నాగార్జున 100వ సినిమా నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ ప్రతిష్ఠాత్మక సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. గతంలో 'మన్మథుడు', 'మాస్', 'కింగ్' వంటి చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించిన ఈ కాంబో మళ్లీ కలవడంతో అంచనాలు పీక్స్‌కు చేరాయి.
King 100 DSP: కింగ్ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన 100వ చిత్రం KING100 (వర్కింగ్ టైటిల్) నుంచి టాలీవుడ్ ప్రేక్షకులకు, అక్కినేని అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ లభించింది. దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎంతో నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కి సంబంధించి క్రేజీ మ్యూజిక్ అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్
కింగ్ 100 సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందించనున్నారు. డీఎస్‌పీ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు.
మ్యాజికల్ కాంబినేషన్
నాగార్జున - దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులకు చిరునామా. వీరిద్దరి కలయికలో వచ్చిన ప్రతి ఆల్బమ్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
- మన్మథుడు: నాగార్జున రోమాంటిక్ ఇమేజ్‌ను, డీఎస్‌పీ మెలోడీ అండ్ యూత్‌ఫుల్ మ్యూజిక్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన క్లాసిక్ ఆల్బమ్.
- మాస్: నాగార్జున మాస్ యాక్షన్ అవతార్‌కి డీఎస్‌పీ అందించిన బీట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను ఊపేశాయి.
- కింగ్: హై-ఎనర్జీ టైటిల్ ట్రాక్, మాస్ అండ్ క్లాస్ పాటలతో చార్ట్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
సుదీర్ఘ విరామం తర్వాత ఈ సూపర్‌హిట్ కాంబో నాగార్జున 100వ సినిమా కోసం మళ్లీ చేతులు కలపడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ స్పెషాలిటీలు
కేవలం దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రమే కాకుండా, నాగార్జున 100వ ప్రాజెక్ట్ చుట్టూ అనేక ఆసక్తికర అంశాలు ఉన్నాయి. 'నిన్నే పెళ్లాడుతా', 'ఆవిడా మా ఆవిడే' వంటి ఐకానిక్ చిత్రాల తర్వాత నాగార్జున సరసన సీనియర్ నటి టబు ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండటం ఈ సినిమాకు మరొక ప్రధాన ఆకర్షణగా మారింది.
తమిళంలో ఫీల్ గుడ్ డ్రామాతో మెప్పించిన రా కార్తిక్ ఈ ప్రాజెక్ట్‌తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నాడు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, నాగార్జున వింటేజ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
డీఎస్‌పీ ఎందుకు పర్ఫెక్ట్ చాయిస్?
ఒక నటుడి 100వ చిత్రం అనగానే కేవలం స్క్రిప్ట్ మాత్రమే కాదు, ఆడియో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతే స్థాయిలో రికార్డులు సృష్టించాల్సి ఉంటుంది. ఇక నాగార్జున 100వ సినిమా (#KING100) అనగానే అక్కినేని అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇటీవల 'కూలీ' లో పవర్ ఫుల్ రోల్, 'కుబేర' సినిమాలో డిఫరెంట్ పాత్రలో నాగార్జున అదరగొట్టాడు.
నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్మిస్తున్న ఈ 100వ మైలురాయి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ను ఎంచుకోవడం వ్యూహాత్మక అడుగు. 'మన్మథుడు', 'మాస్' చిత్రాల నాటి వింటేజ్ నాగార్జున మ్యాజిక్‌ను, రాక్‌స్టార్ డీఎస్‌పీ మాస్ అండ్ ఎనర్జెటిక్ మ్యూజిక్ మళ్లీ వెండితెరపై పునరావృతం చేసే అవకాశం ఉంది. సీనియర్ నటి టబు కలయిక కూడా తోడవ్వడంతో ఈ సినిమా ఆడియన్స్ క్యూరియాసిటీని మరింత పెంచింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


