Yellamma First Look: చేతిలో కిరీటం.. ఎల్లమ్మలో పర్శిగా దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్.. ప్రతి ఒక్కరి గుండెను తాకేలా!

Yellamma First Look Devi Sri Prasad As Parshi: దశాబ్దాలుగా తన మ్యూజిక్‌తో అలరించిన దేవిశ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ' సినిమాతో హీరోగా అవతారమెత్తారు. 'బలగం' వేణు దర్శకత్వంలో వస్తున్న ఎల్లమ్మ సినిమా నుంచి డీఎస్పీ బర్త్‌డే సందర్భంగా విడుదలైన 'పర్శి' ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Published on: Aug 2, 2026, 21:00:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Yellamma First Look Devi Sri Prasad As Parshi: తనదైన మాస్, మెలోడీ పాటలతో కొన్ని దశాబ్దాలుగా దక్షిణాది సంగీత ప్రియులను ఊపేసిన రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించనున్నారు.

చేతిలో కిరీటం.. ఎల్లమ్మలో పర్శిగా దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్.. ప్రతి ఒక్కరి గుండెను తాకేలా!
చేతిలో కిరీటం.. ఎల్లమ్మలో పర్శిగా దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్.. ప్రతి ఒక్కరి గుండెను తాకేలా!

రెండేళ్ల పాటు చెక్కిన డ్రీమ్ ప్రాజెక్ట్

'బలగం' చిత్రంతో తొలి ప్రయత్నంలోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు యెల్దండి, దాదాపు రెండేళ్ల పాటు చెక్కిన డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఎల్లమ్మ' ద్వారా దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎల్లమ్మ సినిమా నుంచి ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

'పర్శి'గా దేవిశ్రీ రగ్గడ్ అవతారం.. ఊహించని మేకోవర్!

ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ 'పర్శి' అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదల చేసిన ఎల్లమ్మ పర్శి ఫస్ట్ లుక్ పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ చాలా సాధారణమైన దుస్తుల్లో, చేతిలో ఒక కిరీటం పట్టుకుని నిలబడి ఉన్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

అభిమానులకు సర్‌ప్రైజ్

ఎలాంటి అనవసర ఆర్భాటాలు, బిల్డప్‌లు లేకుండా చాలా సహజంగా ఉన్న ఈ లుక్, ఆయన అభిమానులకు అద్భుతమైన సర్‌ప్రైజ్ అని చెప్పాలి. దేవిశ్రీ కళ్లలోని అమాయకత్వం, ఆయన మేకప్, స్టైలింగ్ చూస్తుంటే ఒక సాధారణ వ్యక్తి వెనుక ఉన్న అసాధారణమైన కథను ఈ చిత్రం చెప్పబోతోందని స్పష్టమవుతోంది.

చాలా కాన్ఫిడెంట్‌గా దేవిశ్రీ

సినిమా రంగానికి నటుడిగా ఇది తొలి అడుగే అయినప్పటికీ, కెమెరా ముందు డీఎస్‌పీ ఎంతో ఈజ్‌తో, కాన్ఫిడెంట్‌గా కనిపించడం విశేషం. దర్శకుడు వేణు యెల్దండి తన కథపై, దేవిశ్రీ నటనపై ఉంచిన నమ్మకం ఈ పోస్టర్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

తెలంగాణ మట్టి వాసనతో కూడిన పవర్‌ఫుల్ డ్రామా

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ కథకు దేవిశ్రీ ప్రసాద్ నుంచి అత్యుత్తమమైన, లోతైన నటన అవసరం. ఆయన పోషిస్తున్న 'పర్శి' పాత్ర సినిమాలో అత్యంత కీలకమైనదని, పలు రకాల భావోద్వేగాలను పండించాల్సి ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది.

ప్రతి సన్నివేశంలోనూ అంకితభఆవం

"నటుడిగా దేవిశ్రీకి ఇది మొదటి చిత్రమే అయినప్పటికీ, ఆయన పడ్డ కష్టం, చూపించిన అంకితభావం ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తాయి. తెరపై ఆయన నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది" అని చిత్ర యూనిట్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ప్రతి ఒక్కరి గుండెను తాకేలా

తెలంగాణ నేటివిటీని తెరపై ఆవిష్కరించడంలో వేణు యెల్దండికి ప్రత్యేక ముద్ర ఉంది. 'బలగం' చూపించిన బాటలోనే, ఈ 'ఎల్లమ్మ' కూడా ప్రతి ఒక్కరి గుండెను తాకేలా ఉండే పవర్‌ఫుల్ విలేజ్ డ్రామాగా రాబోతోంది.

దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో..

ఈ వినూత్న చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సంగీత దర్శకుడిగా వందలాది హిట్లకు కారణమైన దేవిశ్రీ ప్రసాద్, ఇప్పుడు నటుడిగా ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలని ఆయన అభిమానులు, టాలీవుడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More