Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10.. శాలినిదే తప్పన్న రోహిత్.. బుర్ర లేదు.. ముగ్గురికి దిమ్మతిరిగే షాకిచ్చిన నాగార్జున!

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్ లో లవ్ బర్డ్స్ అని ఆడియన్స్ పిలిచుకుంటున్న శాలిని, రోహిత్ తో పాటు అమన్ కు బిగ్ షాక్ తగిలింది. హోస్ట్ నాగార్జున ఈ ముగ్గురికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. అలాగే శాలిని తప్పు చేసిందని రోహిత్ ఒప్పుకోవడం గమనార్హం. 

Published on: Oct 17, 2026, 20:40:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 ఆడియన్స్ పొద్దున నుంచి వెయిట్ చేస్తున్న వీకెండ్ ప్రోమో ఎట్టకేలకు వచ్చింది. ఈ ప్రోమోనే ఫుల్ కిక్ ఇచ్చింది. హౌస్ లో కంటెస్టెంట్లపై హోస్ట్ నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా అమన్, శాలిని, రోహిత్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు.

బిగ్ బాస్ 10.. శాలినిదే తప్పన్న రోహిత్.. బుర్ర లేదు.. ముగ్గురికి దిమ్మతిరిగే షాకిచ్చిన నాగార్జున! (youtube/starmaa)
బిగ్ బాస్ 10.. శాలినిదే తప్పన్న రోహిత్.. బుర్ర లేదు.. ముగ్గురికి దిమ్మతిరిగే షాకిచ్చిన నాగార్జున! (youtube/starmaa)

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో

బిగ్ బాస్ తెలుగు 10 ఆరో వారం వీకెండ్ ప్రోమో మంట పుట్టిస్తోంది. హౌస్ లో ఉన్నవాళ్లపై నాగార్జున ఫుల్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా వద్దని వార్నింగ్ ఇచ్చినా కూడా నామినేషన్ల గురించి డిస్కషన్ చేసిన అమన్, శాలిని, రోహిత్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

రోహిత్, అమన్, శాలిని హౌస్ లో నామినేషన్ల గురించి డిస్కస్ చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నాగార్జున ఈ ముగ్గురికి పనిష్మెంట్ ఇచ్చారు. వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్ కోసం పోటీపడకుండా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

ఆ మాటలేంటీ శాలిని

వీక్ అంతా తప్పులు చేయడం వీకెండ్ రాగానే నాగార్జునకు సారీ చెప్పడం శాలినికి అలవాటుగా మారింది. ఈ వీకెండ్ కూడా అలాగే ఉండనుంది. నాగ్ ప్రశ్నించగానే శాలిని ఏడుపు ముఖం పెట్టి సారీ సార్ అని చెప్తుంది. కానీ నాగ్ మాత్రం ఈ సారి ఫుల్ ఫైర్ అయ్యారు. శాలినికి గట్టిగా ఇచ్చి పడేశారు.

హౌస్ లో శాలిని బూతులు మాట్లాడటంపై నాగ్ సీరియస్ అయ్యారు. మధ్యలో రోహిత్ మాట్లాడాలని చూస్తే.. ఇది నామినేషన్స్ కాదు మధ్యలో జోక్యం చేసుకోవడానికి అని రోహిత్ కు నాగార్జున కౌంటర్ వేశారు.

బుర్ర లేదని

ఇక గత వారం ఆటలో నీతుతో శాలిని ప్రవర్తించిన తీరును నాగార్జున ప్రశ్నించారు. బుర్ర లేదని చేతితో గెస్చర్ చేయడం ఏంటీ అని గట్టిగా అడిగారు. నీతూకు కాదు నీకు బుర్ర లేదని ఆడియన్స్ అనుకుంటారని నాగార్జున గట్టిగానే చెప్పారు. ఈ విషయంలో శాలినిదే తప్పని రోహిత్ కూడా చెప్పడం గమనార్హం.

శాలిని ఔట్

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి శాలిని ఎలిమినేట్ అయినట్లు సమాచారం. హౌస్ లో అరవడం, గొడవలు పెట్టుకోవడం, రోహిత్ చుట్టూ తిరగడం తప్పా శాలిని చేసిందేమీ లేదని నెటిజన్లు ఫీల్ అవుతున్నారు. అందుకే జనాలు పెద్దగా ఓట్లు వేయలేదని తెలిసింది. మరి శాలిని వెళ్లిన తర్వాత రోహిత్ ఏం చేస్తాడు? అతని గేమ్ ప్లాన్ ఎలా మారుతుంది? అనేది ఉత్కంఠ కలిగిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More