Peddi: పెద్దికి బిగ్ షాక్.. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచం.. రేవంత్ రెడ్డికి లెటర్.. ఎగ్జిబ్యూటర్ల సంఘం సంచలన నిర్ణయం
Peddi: రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమాకు బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ ఎగ్జిబిటర్లు టికెట్ల ధరల పెంపును వ్యతిరేకిస్తూ, పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల సినిమా ప్రదర్శనపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'కి బిగ్ షాక్ తగిలింది. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా, టాలీవుడ్‌లో సరికొత్త థియేట్రికల్ వివాదం రాజుకుంది. తెలంగాణ ఫిలిం ఛాంబర్ సబ్ కమిటీ నుంచి ఈ సినిమాకు ఎదురైన అడ్డంకులు తొలిగిపోయాయని భావిస్తున్న తరుణంలో, తాజాగా థియేటర్ల యజమానులు (ఎగ్జిబిటర్లు) తీసుకున్న నిర్ణయం చిత్ర యూనిట్‌కు పెద్ద షాక్‌గా మారింది.

టికెట్ ధరల పెంపు లేదు
పెద్ది సినిమా విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉండటంతో మెగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. తెలంగాణ ఎగ్జిబిటర్లు శనివారం (మే 23) అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. 'పెద్ది' సినిమాకు ఎలాంటి టికెట్ ధరల పెంపును అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు టికెట్ల ధరల పెంపును పూర్తిగా వ్యతిరేకిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ఒక అధికారిక లేఖ కూడా రాశారు.
ప్రేక్షకులను చంపకండని
పెద్ద సినిమాకు విపరీతంగా టికెట్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేస్తున్నారని, దీనివల్ల ఫుట్‌ఫాల్స్ (ప్రేక్షకుల సంఖ్య) దారుణంగా పడిపోతోందని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ల రేట్లు పెంచకండి, ప్రేక్షకులను చంపకండని వాళ్లు చెప్పారు. దీంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'పెద్ది' లాంటి సినిమాకు టికెట్ ధరల పెంపు లేకపోవడం ఖచ్చితంగా కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పెద్ది మూవీ జూన్ 4న రిలీజ్ కానుంది.
పర్సంటేజ్ వివాదం
కేవలం టికెట్ ధరల పెంపు నిరాకరణ మాత్రమే కాకుండా, నిర్మాతల ముందు ఎగ్జిబ్యూటర్లు ఓ డిమాండ్ పెట్టారు. ఇకపై టాలీవుడ్‌లో సినిమాలను కేవలం 'పర్సంటేజ్ షేరింగ్' (శాతాల వారీగా లాభాల పంపిణీ) పద్ధతిలోనే ప్రదర్శిస్తామని, ఈ నిబంధన రాబోయే 'పెద్ది' సినిమాకు కూడా వర్తిస్తుందని అల్టిమేటం జారీ చేశారు.
ఈ పర్సంటేజ్ విధానంపై గత కొంతకాలంగా టాలీవుడ్ నిర్మాతలకు, థియేటర్ల యజమానులకు మధ్య తీవ్రస్థాయిలో చర్చలు నడుస్తున్నాయి. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే, నిర్మాతల వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం రాకపోవడంతో ఎగ్జిబిటర్లు అసంతృప్తితో ఉన్నారు.
తేల్చకపోతే సినిమా ప్రదర్శించం!
"తెలంగాణ ఎగ్జిబిటర్లందరి తరపున ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీగా నేను మాట్లాడుతున్నాను. పర్సంటేజ్ సిస్టమ్‌పై నిర్మాతల నుంచి మాకు ఎలాంటి క్లారిటీ రాలేదు. వారు మరికొంత సమయం అడుగుతున్నారు. కానీ 'పెద్ది' సినిమాకు పర్సంటేజ్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలి, దీనిని చర్చల ద్వారా వెంటనే ఖరారు చేయాలి. ఇదే మా తెలంగాణ ఎగ్జిబిటర్ల అందరి ఉమ్మడి నిర్ణయం" అని ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ స్పష్టం చేశారు.
పర్సంటేజ్ విధానంపై నిర్మాతలు గనుక స్పష్టత ఇవ్వకపోతే, 'పెద్ది' సినిమాను థియేటర్లలో ప్రదర్శించే ప్రసక్తే లేదని వారు తెగేసి చెప్పారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి థియేటర్ల యజమానుల నుంచి ఎదురైన ఈ సవాల్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ వివాదాన్ని పరిష్కరించడానికి టాలీవుడ్ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: తెలంగాణ ఎగ్జిబిటర్లు 'పెద్ది' సినిమాకు టికెట్ ధరల పెంపును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
జవాబు: టికెట్ల ధరలు విపరీతంగా పెంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారని, దీనివల్ల థియేటర్ల మనుగడ కష్టమవుతోందని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు.
ప్రశ్న: ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న 'పర్సంటేజ్ సిస్టమ్' అంటే ఏమిటి?
జవాబు: థియేటర్ల నుంచి వచ్చే టికెట్ కలెక్షన్లలో ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం శాతాల వారీగా లాభాలు పంచుకునే విధానాన్ని పర్సంటేజ్ సిస్టమ్ అంటారు. ఫిక్స్డ్ హైర్ లేదా మినిమమ్ గ్యారెంటీ పద్ధతుల వల్ల వచ్చే నష్టాలను తగ్గించుకోవడానికి ఎగ్జిబిటర్లు ఈ డిమాండ్ చేస్తున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


