Biggest Flop Movie: బడ్జెట్ రూ.1400 కోట్లు.. వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఇది..
Biggest Flop Movie: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ ఏదో తెలుసా? ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.1400 కోట్లు కాగా.. వచ్చింది మాత్రం కేవలం రూ.6 కోట్లే. పెట్టిన బడ్జెట్ లో 99.6 శాతం నష్టపోయిన మూవీగా అపవాదు మూటగట్టుకున్న ఆ సినిమా పేరు డెజర్ట్ వారియర్.
Biggest Flop Movie: ప్రపంచవ్యాప్తంగా సినిమా సరిహద్దులు చెరిగిపోతున్న తరుణంలో, భారీ నిర్మాణ విలువలతో గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని సౌదీ అరేబియా చేసిన ప్రయత్నం ఊహించని రీతిలో విఫలమైంది. 'డెజర్ట్ వారియర్' (Desert Warrior) చిత్రం బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యంత భారీ నష్టాలను మూటగట్టుకున్న సినిమాగా రికార్డు సృష్టించింది.

డెజర్ట్ వారియర్ మూవీ విశేషాలు
ఇటీవల భారతీయ సినిమా రంగం 'వారణాసి', 'రామాయణ' వంటి భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంది. అటు చైనా 'నీ జా 2'తో బిలియన్ డాలర్ల మార్క్ అందుకుంది. ఈ పోటీలో నిలవాలని, తన సొంత చిత్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని సౌదీ అరేబియా MBC గ్రూప్ ద్వారా 'డెజర్ట్ వారియర్' అనే చారిత్రక వార్ మూవీని నిర్మించింది.
7వ శతాబ్దపు అరేబియా నేపథ్యంలో సాగే ఈ కథ.. చక్రవర్తి కిస్రాకు వ్యతిరేకంగా యువరాణి హింద్ సాగించిన పోరాటం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాకు దర్శకుడు రూపెర్ట్ వ్యాట్ (రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఫేమ్). ఇక మార్వెల్ కొత్త కెప్టెన్ అమెరికా ఆంథోనీ మాకీ, ఆస్కార్ విజేత బెన్ కింగ్స్లీ, ఐషా హార్ట్, షార్ల్టో కోప్లీ లాంటి స్టార్లు నటించారు.
భారీ బడ్జెట్.. బాక్సాఫీస్ నిల్
కొవిడ్ కారణంగా ఆలస్యం, భారీ సెట్లు, అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల జీతాలతో బడ్జెట్ ఏకంగా 150 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.1400 కోట్లు) చేరుకుంది. ఏప్రిల్ 2026లో అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా.. కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది.
ఈ చిత్రం తన మొత్తం బడ్జెట్‌లో కేవలం 0.4% మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే ఏకంగా 99.6% పెట్టుబడి నష్టపోయింది. సినిమా చరిత్రలో ఏ ఫీచర్ ఫిల్మ్‌కు కూడా ఇంతటి భారీ నష్ట శాతం లేదు.
సినిమా ఎందుకు బోల్తా పడిందంటే?
'డెజర్ట్ వారియర్' ఇంత దారుణంగా విఫలం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమా గురించి కనీస ప్రచారం లేదు. ప్రధాన నటుడు ఆంథోనీ మాకీ కూడా ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.
ఇక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత దాదాపు రెండున్నరేళ్లు పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉండటంతో, మొదట్లో ఉన్న బజ్ పూర్తిగా తగ్గిపోయింది.
విడుదల తర్వాత కూడా విమర్శకుల నుంచి సానుకూల స్పందన రాలేదు. రోటెన్ టొమాటోస్‌లో కేవలం 28% అప్రూవల్ రేటింగ్ మాత్రమే లభించింది.
సొంత దేశమైన సౌదీ అరేబియాలో కూడా ఈ సినిమా మొదటి వీకెండ్ లో 8వ స్థానానికి పరిమితమైందంటే ప్రేక్షకులు దీనిని ఎంతగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు.
భారీ బడ్జెట్, హాలీవుడ్ స్టార్స్ ఉన్నంత మాత్రాన సినిమా విజయం సాధించదని 'డెజర్ట్ వారియర్' మరోసారి నిరూపించింది. సరైన ప్లానింగ్, ప్రమోషన్ లేకపోతే రూ.1400 కోట్లు కూడా బూడిదలో పోసిన పన్నీరేనని ఈ చిత్రం ఒక గుణపాఠంగా మిగిలిపోయింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


