Premalu 2: ఇంత పని చేశారేంటి? అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన మలయాళం స్టార్ హీరో.. సీక్వెల్ లేనట్లే

Premalu 2: మలయాళం బ్లాక్‌బస్టర్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమలు సీక్వెల్ ఇక లేనట్లే. ఈ విషయాన్ని ఈ మూవీలో లీడ్ రోల్ పోషించిన నస్లేనే వెల్లడించాడు. దీనికి స్క్రిప్టే కారణమని అతడు చెప్పాడు. ఆ విశేషాలేంటో చూడండి.

Published on: May 30, 2026, 10:46:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Premalu 2: మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చి సౌత్ ఇండియాలోనే కాకుండా, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న యూత్‌ఫుల్ రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ ప్రేమలు. నస్లేన్, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో దర్శకుడు గిరీష్ ఏ.డీ. తెరకెక్కించిన ఈ సినిమా.. తెలుగు రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది.

Premalu 2: ఇంత పని చేశారేంటి? అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన మలయాళం స్టార్ హీరో.. సీక్వెల్ లేనట్లే
Premalu 2: ఇంత పని చేశారేంటి? అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పిన మలయాళం స్టార్ హీరో.. సీక్వెల్ లేనట్లే

ఈ బ్లాక్‌బస్టర్ విజయంతో మేకర్స్ ప్రేమలు సీక్వెల్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే గత కొన్ని నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతోందంటూ వస్తున్న వార్తలపై తాజాగా హీరో నస్లేన్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. అభిమానులకు షాక్ ఇస్తూ ఈ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు స్పష్టం చేశాడు.

స్క్రిప్ట్ కుదరకపోవడమే అసలు కారణం

గతంలో ప్రేమలు 2 సినిమా ఆలస్యం అవ్వడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయని నిర్మాతలలో ఒకరైన దిలీష్ పోతన్ పేర్కొన్నారు. కానీ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నస్లేన్ అసలు కారణాన్ని బయటపెట్టారు.

ప్రేమలు 2 స్క్రిప్టింగ్ స్టేజ్‌లో (కథా చర్చల సమయంలో) కొన్ని కీలక సమస్యలు తలెత్తాయని నస్లేన్ వెల్లడించారు. కథ అనుకున్న విధంగా, మొదటి భాగం స్థాయిని అందుకునేలా రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడితోనే ఆపేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

మలయాళంతో పాటు తెలుగులోనూ సచిన్, రీనూల లవ్ స్టోరీకి కనెక్ట్ అయిన ఫ్యాన్స్.. సీక్వెల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజా అప్‌డేట్‌తో వారంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

మొదటి భాగం తెచ్చిన క్రేజ్‌ను కాపాడుకోవడానికి, బలహీనమైన స్క్రిప్ట్‌తో సీక్వెల్ తీసి చెడగొట్టడం కంటే.. సినిమాను గౌరవప్రదంగా ఆపేయడమే దర్శకుడు, నిర్మాతలు తీసుకున్న చాలా తెలివైన నిర్ణయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ప్రేమలు మూవీ విశేషాలు

ప్రేమలు మూవీ మలయాళంలో రిలీజై సంచలన విజయం సాధించడంతో తర్వాత ఇతర భాషల్లోకి కూడా డబ్బింగ్ చేశారు. గిరీస్ ఏడీ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నస్లేన్, మమితా బైజు లీడ్ రోల్స్ లో నటించారు. ఈ మూవీ రూ.135 కోట్లకుపైగా వసూలు చేయడం విశేషం. దీంతో సినిమాకు సీక్వెల్ తీసుకొస్తే బాగుంటుందని మేకర్స్ భావించారు. కానీ తాజాగా దీనిని పక్కన పెట్టేసినట్లు లీడ్ రోల్ పోషించిన నటుడే చెప్పడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'ప్రేమలు 2' సినిమాను ఎందుకు రద్దు చేశారు?

స్క్రిప్టింగ్ దశలో కథ అనుకున్న విధంగా రాకపోవడం, కొన్ని కీలకమైన రైటింగ్ సమస్యలు తలెత్తడం వల్ల ఈ సీక్వెల్ ప్రాజెక్ట్‌ను ఆపేసినట్లు హీరో నస్లేన్ స్పష్టం చేశారు.

2. ప్రేమలు సీక్వెల్ క్యాన్సిల్ అయినట్లు ఎవరు అధికారికంగా ప్రకటించారు?

ప్రేమలు మూవీలో హీరోగా నటించిన నస్లేన్ ఒక తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, 'ప్రేమలు 2' ప్రస్తుతానికి పూర్తిగా డ్రాప్ అయిందని కన్ఫర్మ్ చేశారు.

3. ‘ప్రేమలు’ మొదటి భాగానికి దర్శకత్వం వహించింది ఎవరు?

ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని డైరెక్టర్ గిరీష్ ఏ.డీ. అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగులో కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More