Aamir Khan: ప్రేమతో ఇచ్చే బహుమతి విలువైనదా కాదా అనేది ముఖ్యం కాదు. దాని వెనుక ఉన్న భావం ముఖ్యం. కానీ బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ విషయంలో ఇది రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. తన అభిమానులు ఎంతో సమయం వెచ్చించి, ప్రాణం పెట్టి గీసిన పెయింటింగ్ లను ఆమిర్ ఖాన్ ఆఫీసు చిత్తు అమ్ముకునే దుకాణానికి అమ్మేసిందనే వార్త ఇప్పుడు దుమారం రేపుతోంది.
స్క్రాప్ యార్డ్‌లో ఆమిర్ పెయింటింగ్స్

సత్య స్వాగత్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ముంబైలోని బెహ్రామ్ బాగ్ మార్కెట్‌లో తిరుగుతుండగా.. ఒక పాత సామాన్ల షాపులో వరుసగా ఉన్న ఆమిర్ ఖాన్ పెయింటింగ్‌లు చూసి షాక్‌కు గురయ్యారు. ఆ షాపు యజమానిని అడగగా.. "ఇవన్నీ ఆమిర్ ఖాన్ ఆఫీస్ నుంచి వచ్చిన తుక్కు" అని సమాధానం ఇచ్చాడు.
దీనికి సంబంధించిన వీడియోను సత్య స్వాగత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. "ఇది చూసి నా మనసు వికలమైంది. ఎంతో మంది కళాకారులు తమ ఫేవరెట్ స్టార్ కోసం ఎంతో కష్టపడి ఈ పెయింటింగ్‌లు గీసి ఉంటారు. వాటిని ఇలా గౌరవం లేకుండా చెత్తకుప్పలో పడేయడం సమంజసం కాదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
నెటిజెన్ల మధ్య భిన్నాభిప్రాయాలు
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు హీరోకి మద్దతుగా కామెంట్స్ చేశారు. "ఒక స్టార్ హీరోకు రోజుకు వేల సంఖ్యలో బహుమతులు వస్తుంటాయి. వాటన్నింటినీ భద్రపరచడానికి ఆఫీసుల్లో లేదా ఇంట్లో స్థలం సరిపోదు కదా? అంతమాత్రాన వారిని తప్పుబట్టడం సరికాదు" అని వాదిస్తున్నారు.
మరోవైపు విమర్శించే వాళ్లూ ఉన్నారు. "స్థలం లేకపోతే ఫ్రేములను తీసివేసి కేవలం పేపర్లను భద్రపరచవచ్చు. కానీ ఇలా బహిరంగంగా తుక్కు కొట్టుకు అమ్మేయడం కళాకారులను అవమానించడమే. అందుకే సెలబ్రిటీలను దేవుళ్లలా ఆరాధించడం మానేయాలి" అని మరికొందరు మండిపడుతున్నారు.
షాపు యజమాని ఏమన్నాడంటే?
ఆ వీడియోలో సత్య స్వాగత్ మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. తాను ఒక పెయింటింగ్‌ను కొందామని వెళ్తే.. ఆ షాపు యజమాని.. "బాబు.. ఈ ఫ్రేమ్ కొత్తగా ఉంది. లోపల ఉన్న ఫోటో పడేసి నీ ఫోటో పెట్టుకో, తక్కువ ధరకే ఇస్తా" అని అన్నారట. ఒక కళాకారుడికి ఇది ఎంత పెద్ద అవమానమో ఆలోచించాలని సత్య కోరారు.
{{/usCountry}}ఆ వీడియోలో సత్య స్వాగత్ మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. తాను ఒక పెయింటింగ్‌ను కొందామని వెళ్తే.. ఆ షాపు యజమాని.. "బాబు.. ఈ ఫ్రేమ్ కొత్తగా ఉంది. లోపల ఉన్న ఫోటో పడేసి నీ ఫోటో పెట్టుకో, తక్కువ ధరకే ఇస్తా" అని అన్నారట. ఒక కళాకారుడికి ఇది ఎంత పెద్ద అవమానమో ఆలోచించాలని సత్య కోరారు.
{{/usCountry}}అయితే ఈ పెయింటింగ్‌లు నిజంగా ఆమిర్ ఖాన్ కార్యాలయం నుంచే వచ్చాయా? అనే దానిపై ఆమిర్ ఖాన్ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.