...
...
Next Story

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత.. 90వ పుట్టిన రోజుకు కొన్ని రోజు ముందే..

బాలీవుడ్ వెటరన్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశాడు. 89 ఏళ్ల వయసులో సోమవారం (నవంబర్ 24) ఉదయం అతడు తుది శ్వాస విడిచాడు. కొన్ని రోజుల కిందటే అతడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

Published on: Nov 24, 2025, 14:13:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బాలీవుడ్ వెటరన్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశాడు. తన 90వ పుట్టిన రోజుకు కొన్ని రోజుల ముందే అతడు తీవ్ర అనారోగ్యంతో మరణించాడు. దీంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ గా అతడు పేరుగాంచాడు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో అతడు చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత.. 90వ పుట్టిన రోజుకు కొన్ని రోజు ముందే..
బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత.. 90వ పుట్టిన రోజుకు కొన్ని రోజు ముందే..

అంతేకాదు ఈ నెల ప్రారంభంలో అతడు చనిపోయాడంటూ తప్పుడు వార్తలు కూడా వచ్చాయి. బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత అతడు కోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే సోమవారం (నవంబర్ 24) ఉదయం మళ్లీ ధర్మేంద్ర జుహూ నివాసానికి భారీ భద్రతతో పాటు అంబులెన్స్ చేరుకోవడం కలకలం సృష్టించింది. ఆ తరువాత ధర్మేంద్ర కన్నుమూసినట్లు నివేదికలు వచ్చాయి.

అంబులెన్స్ రాక, భద్రత పెంపు

ధర్మేంద్ర నివాసం నుంచి అంబులెన్స్ బయలుదేరిన వెంటనే ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటిక వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ధర్మేంద్ర భార్య హేమా మాలిని, కూతురు ఈషా డియోల్ అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు చేరుకున్నారు.

బాలీవుడ్ ప్రముఖులైన నటుడు ఆమిర్ ఖాన్ తెల్లటి దుస్తుల్లో కారులో రావడం కనిపించాడు. అతని వెంట ధర్మేంద్ర 'షోలే' సహనటుడు అమితాబ్ బచ్చన్ అలాగే అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా చేరుకున్నాడు.

నెల ప్రారంభంలో వచ్చిన తప్పుడు వార్తలు

ఈ నెల మొదట్లో ధర్మేంద్ర చనిపోయారంటూ తప్పుడు నివేదికలు వచ్చినప్పుడు అతని కూతురు ఈషా డియోల్ సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించింది. "మీడియా తప్పుడు వార్తలను అతిగా ప్రచారం చేస్తోంది. నా తండ్రి ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. మా కుటుంబానికి ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుతున్నాం. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించినందుకు ధన్యవాదాలు" అని చెప్పింది.

ధర్మేంద్ర డిసెంబర్ 8, 1935లో పంజాబ్ లో జన్మించాడు. 1960లో వచ్చిన దిల్ భీ తేరా హమ్ భీ తేరే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 65 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 300కుపైగా సినిమాల్లో నటించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రకు 2012లో పద్మభూషణ్ అవార్డ్ వచ్చింది. అలాగే 1997 సంవత్సరంలో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది.

ధర్మేంద్ర రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదట ప్రకాష్ కౌర్, ఆ తర్వాత నటి హేమ మాలినిని పెళ్లి చేసుకోవడం విశేషం. బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన సన్నీ డియోల్, బాబీ డియోల్ ధర్మేంద్ర మొదటి భార్య సంతానం. రెండో భార్య హేమ మాలిని బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరని తెలిసిందే.

ధర్మేంద్ర బ్లాక్ బస్టర్ హిట్ మూవీ షోలోలే వీరూ పాత్రలో నటించారు. ఇదే కాకుండా ధర్మేంద్ర అలీబాబా ఔర్ 40 చోర్, దోస్త్, డ్రీమ్ గర్ల్, సన్నీ, ఘాయల్, లోఫర్ వంటి తదితర సినిమాల్లో నటించి మెప్పించారు.

ధర్మేంద్ర చివరి సారిగా 2024 సంవత్సరంలో షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి 'తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా' సినిమాలో వెండితెరపై కనిపించాడు. అయితే శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో అగస్త్య నందాతో కలిసి 'ఇక్కిస్' మూవీలో ధర్మేంద్ర నటించాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe