Arjun Rampal: 53 ఏళ్ల వయసులో గర్ల్‌ఫ్రెండ్‌ను రెండో పెళ్లి చేసుకున్న ధురంధర్ విలన్.. 8 ఏళ్ల రిలేషన్షిప్, ఇద్దరు పిల్లలు
Arjun Rampal: ధురంధర్, భగవంత్ కేసరి సినిమాల్లో విలన్ గా నటించిన అర్జున్ రాంపాల్ 53 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్లుగా తనతో కలిసి ఉంటున్న గర్ల్‌ఫ్రెండ్ ను గోవాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం విశేషం.
Arjun Rampal: 8 ఏళ్లుగా సహజీవనంలో ఉంటూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో, ధురంధర్ మూవీ విలన్ అర్జున్ రాంపాల్, తన లాంగ్‌టైమ్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ చివరకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఉత్తర గోవాలోని మపుసా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో వీరు శుక్రవారం (ఆగస్ట్ 21) సాయంత్రం చాలా సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

గోవా యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రకారం పెళ్లి
53 ఏళ్ల అర్జున్ రాంపాల్, సౌత్ ఆఫ్రికన్ మోడల్ కమ్ డిజైనర్ గాబ్రియెల్లా (37) కొన్నాళ్లుగా పనజీ సమీపంలోని సుకోరో గ్రామంలో నివాసముంటున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చాలా సాధారణ దుస్తుల్లో, అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వీరు మపుసా రిజిస్ట్రార్ ఆఫీస్‌కు చేరుకున్నారు.
గోవా రాష్ట్రంలో అమలులో ఉన్న యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) చట్టం నిబంధనల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నట్లు సబ్ రిజిస్ట్రార్ సూరజ్ వెర్నేకర్ అధికారికంగా తెలిపారు. సాధారణంగా మొదటి సంతకం, రెండో సంతకం మధ్య 15 రోజుల సమయం ఉండాలి. కానీ వీరు లోకల్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ప్రత్యేక మినహాయింపు అనుమతి తీసుకుని మొత్తం ప్రక్రియ ఒకేసారి పూర్తి చేశారు. రాబోయే 15 రోజుల్లో వీరికి అఫీషియల్ మ్యారేజ్ సర్టిఫికేట్ అందనుంది.
8 ఏళ్ల డేటింగ్.. ఇద్దరు పిల్లలు
2018 నుంచి అర్జున్ రాంపాల్, గాబ్రియెల్లా లవ్‌లో ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల టైమ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరు.. ఆ తర్వాత సహజీవనం ప్రారంభించారు.
2019లో వీరికి మొదటి కొడుకు అరిక్ (Arik) జన్మించగా, 2023 జులైలో రెండో కుమారుడు రణ్‌వీర్ (Ranvir) జన్మించాడు. పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కనడంపై గతంలో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పటికీ.. "మా మనసులు కలిశాయి.. కాగితం మీద సంతకం ఉంటేనే పెళ్లి అయినట్లు కాదు" అని ఆ టైమ్‌లో ఈ జంట క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు చివరకు చట్టబద్ధంగా దంపతులుగా మారి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.
అర్జున్ రాంపాల్ పర్సనల్ లైఫ్, కెరీర్
అర్జున్ రాంపాల్‌కు ఇది రెండో పెళ్లి. 1998లో మాజీ మిస్ ఇండియా మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్న అర్జున్.. 2019లో ఆమెతో లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. మెహర్, అర్జున్ దంపతులకు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విడాకుల తర్వాత కూడా కూతుళ్ల బాధ్యతలను అర్జున్ సమర్థవంతంగా చూసుకుంటున్నారు.
బాలీవుడ్‌లో 'ఓం శాంతి ఓం', 'డాన్', 'రాక్‌ఆన్', 'రాజనీతి' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాపులారిటీ తెచ్చుకున్న అర్జున్ రాంపాల్, టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' సినిమాలో మెయిన్ విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రీసెంట్‌గా విద్యుత్ జమ్వాల్‌తో కలిసి 'క్రాక్' అనే హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌లో కనిపించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


