ప్రొటీన్ వేఫర్లు అమ్మి ఏడాదిలోనే రూ.100 కోట్లు వెనకేసుకున్న బాలీవుడ్ హీరో.. నెక్ట్స్ టార్గెట్ రూ.500 కోట్లు
బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ వేఫర్ బ్రాండ్ ఏడాదిలోనే రూ.100 కోట్ల ఆదాయం సమకూర్చుకోవడం విశేషం. ప్రొటీన్ వేఫర్లతోపాటు మొత్తంగా నాలుగు ప్రోడక్ట్స్ తోనే ఈ కంపెనీ ఇంత వేగంగా ఆ మైలురాయిని అందుకుంది.
బాలీవుడ్ స్టార్ నటుడు రణవీర్ సింగ్ ఈ సంవత్సరం సినీ రంగంలోకి తిరిగి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు నటించిన 'ధురంధర్' మూవీ వచ్చే నెలలో విడుదల కాబోతుండగా.. ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. సినిమా కెరీర్‌లో పునరుత్తేజం పొందుతున్న రణవీర్ సింగ్.. తన వ్యాపారంలో కూడా భారీ లాభాలను చవిచూస్తున్నాడు. రణవీర్ సింగ్ సహ-యజమానిగా ఉన్న వేఫర్ బ్రాండ్ 'SuperYou' కేవలం ఏడాదిలోనే రూ.100 కోట్ల ఆదాయాన్ని దాటినట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

రణవీర్ సింగ్ బ్రాండ్‌కు రూ.100 కోట్ల ఆదాయం
రణవీర్ సింగ్, నికుంజ్ బియానీతో కలిసి స్థాపించిన స్నాకింగ్ బ్రాండ్ ‘SuperYou’. ఈ కంపెనీ ప్రకటన ప్రకారం రూ.100 కోట్ల ఆదాయాన్ని దాటేసింది. తాజాగా కొత్త మల్టీగ్రెయిన్ ప్రోటీన్ చిప్స్‌ను కూడా మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ బ్రాండ్.. రాబోయే ఐదేళ్లలో రూ.500 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఈ విజయంపై రణవీర్ సింగ్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. "మేము స్నాకింగ్‌లోని అపరాధ భావాన్ని తొలగిస్తున్నాము. ప్రోటీన్ అధికంగా ఉండే స్నాక్స్‌ను మరింత ఆనందదాయకంగా, మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావడంలో ఇది ఒక ముందడుగు" అని పేర్కొన్నాడు.
నవంబర్ 2024లోనే ప్రారంభమైన ఈ బ్రాండ్.. కేవలం గత నెల వరకు నాలుగు ఉత్పత్తులను మాత్రమే కలిగి ఉండగా.. ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో ఆదాయం పెరగడం ఒక అద్భుతమైన విజయం.
SuperYou వేగవంతమైన వృద్ధికి కారణాలు
SuperYou ప్రోటీన్ వేఫర్ బార్‌లు నవంబర్ 2024లో విడుదలైన 90 రోజుల్లోనే 1.6 మిలియన్ యూనిట్లను విక్రయించాయి. ఇది బ్రాండ్‌కు బలమైన పురోగతిని ఇచ్చింది. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం క్లీన్-లేబుల్, ఫంక్షనల్ స్నాక్స్‌కు ఉన్న డిమాండ్‌తో సూపర్‌యు నెలవారీగా 25–30% వృద్ధిని నమోదు చేసింది.
ఈ అద్భుతమైన వృద్ధి కారణంగా డిసెంబర్ 2024లో జెరోధాకు చెందిన రైన్‌మ్యాటర్ క్యాపిటల్ నుంచి సంస్థకు నిధులు సమకూరాయి. ఈ పెట్టుబడితో ఉత్పత్తిని విస్తరించి, ఉత్పత్తుల శ్రేణిని పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
రణవీర్ సింగ్ రాబోయే మూవీ
సిల్వర్ స్క్రీన్‌పై రణవీర్ సింగ్ తదుపరి సినిమా 'ధురంధర్' డిసెంబర్ 5న విడుదల కానుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, గూఢచర్యం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు సమాచారం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


