Ameesha Patel: డబ్బులిచ్చి నంబర్ 1 ట్యాగ్ కొంటున్నారు.. సూపర్ స్టార్ ఎలా అయ్యారు.. మా వల్ల వాళ్ల కడుపు నిండుతోంది: అమీషా
Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ అక్కడ కుర్ర హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. డబ్బులిచ్చి నంబర్ 1, నంబర్ 2 అని చెప్పుకుంటున్నారని విమర్శించింది. ఇక కొందరు యూట్యూబర్లపైనా తీవ్రంగా మండిపడింది.
Ameesha Patel: బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేటి తరం హీరోయిన్లు, సినిమా పరిశ్రమలో పెరిగిపోతున్న 'ఫేక్ పీఆర్' (PR) సంస్కృతిపై ఆమె విరుచుకుపడ్డారు. బాక్సాఫీస్ వద్ద కనీస ప్రభావం చూపకపోయినా, తమను తాము సూపర్ స్టార్లమని ప్రచారం చేసుకోవడంపై అమీషా ఘాటుగా స్పందించారు.

పీఆర్ మెషినరీపై అమీషా ధ్వజం
శుక్రవారం (మే 8) రాత్రి ఎక్స్ వేదికగా అమీషా వరుస పోస్ట్‌లు చేశారు. కేవలం ఒకటి రెండు యావరేజ్ సినిమాల్లో నటించి, షూటింగ్ సెట్లలో ఉన్నంత మాత్రాన ఎవరూ స్టార్ అయిపోరని ఆమె తేల్చి చెప్పారు.
"మీ పీఆర్ టీమ్స్‌కు డబ్బులు ఇచ్చి నెంబర్ 1, నెంబర్ 2 అని పిలిపించుకుంటే సూపర్ స్టార్లు అయిపోరు. ఇది 2026.. ఈ రోజుల్లో 100 కోట్లు అనేది పెద్ద లెక్కే కాదు. కనీసం 200 కోట్ల వసూళ్లు సాధించిన ఒక్క సినిమా కూడా కెరీర్‌లో లేని నటీమణులు తమను తాము స్టార్లమని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది" అని ఆమె ఎద్దేవా చేశారు.
గదర్-3పై క్రేజీ అనౌన్స్‌మెంట్
తన కెరీర్ హిట్స్ గురించి ప్రస్తావిస్తూ.. 'కహో నా ప్యార్ హై', 'గదర్', 'గదర్ 2' వంటి భారీ బ్లాక్‌బస్టర్లు తన ఖాతాలో ఉన్నాయని గుర్తు చేశారు. తనతో నటించిన హీరోల కెరీర్‌లోనే ఇవి అతిపెద్ద విజయాలని, కానీ తాను ఫేక్ పీఆర్ పనులకు ఎప్పుడూ దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో 'గదర్ 3' గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. "గదర్ 3 ఖచ్చితంగా వస్తుంది. అది విడుదలైనప్పుడు థియేటర్లలో హంగామా మామూలుగా ఉండదు. దేవుడి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమాభిమానాలతో 'గదర్' లాంటి బ్రాండ్‌కు రూ.500 కోట్లు అనేది కేవలం కనీస వసూళ్లు మాత్రమే. ఈసారి స్క్రిప్ట్ అంతకు మించి పవర్‌ఫుల్‌గా ఉంటుంది" అని అమీషా ధీమా వ్యక్తం చేశారు.
యూట్యూబర్లపై వ్యంగ్యాస్త్రాలు
కొంతమంది నెగటివ్ యూట్యూబర్లు స్టార్లను విమర్శించడమే పనిగా పెట్టుకుంటారని, వారి విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అమీషా అన్నారు. మనల్ని విమర్శించడం వల్లే వాళ్ల కడుపులు నిండుతున్నాయని, వారిని చూసి జాలిపడాలి తప్ప బాధపడకూడదని హితవు పలికారు.
అమీషా రాబోయే ప్రాజెక్టులు
అమీషా పటేల్ చివరగా 'గదర్ 2'తో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమె అక్షయ్ ఖన్నా, బాబీ డియోల్‌లతో కలిసి నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'హమ్ రాజ్' (2002) సీక్వెల్‌లో నటించే అవకాశం ఉంది. సరైన స్క్రిప్ట్ కుదిరితే 'హమ్ రాజ్ 2' రూపొందిస్తామని నిర్మాత రతన్ జైన్ ఇటీవలే వెల్లడించారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. అమీషా పటేల్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు?
అమీషా నేరుగా ఎవరి పేరును ప్రస్తావించనప్పటికీ, హిట్ సినిమాలు లేకపోయినా పీఆర్ ఏజెన్సీల ద్వారా తమను తాము సూపర్ స్టార్లుగా ప్రచారం చేసుకుంటున్న నేటి తరం హీరోయిన్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
2. 'గదర్ 3' రాబోతుందా?
అవును, అమీషా పటేల్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. భారీ బడ్జెట్, పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో గదర్ 3 ఉంటుందని, ఇది బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
3. అమీషా పటేల్ తదుపరి సినిమాలు ఏవి?
ప్రస్తుతం 'హమ్ రాజ్ 2' సీక్వెల్ చర్చల దశలో ఉంది. అలాగే గదర్ 3 ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


