Ameesha: నేను పుట్టినప్పుడు చూసేందుకు వచ్చిన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీ, ఆమె ఖాళీ టైమ్ పెళ్లి ముహుర్తం: అమీషా పటేల్

Ameesha Patel Family Connection With Indira Gandhi: బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ తన కుటుంబానికి, గాంధీ కుటుంబానికి మధ్య ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని బయటపెట్టారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తమ ఇంట్లో ఒక మనిషిలా ఉండేవారని, తన తల్లిదండ్రుల పెళ్లి ముహూర్తాన్ని కూడా ఆమే నిర్ణయించారని అమీషా చెప్పారు.

Published on: Apr 28, 2026, 13:18:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ameesha Patel Family Connection With Indira Gandhi: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ కేవలం ఒక నటిగానే కాకుండా, రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తాతగారు రజనీ పటేల్ ముంబైలో పేరుమోసిన బారిస్టర్ మాత్రమే కాదు, రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన నేత.

నేను పుట్టినప్పుడు చూసేందుకు వచ్చిన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీ, ఆమె ఖాళీ టైమ్ పెళ్లి ముహుర్తం: అమీషా పటేల్ (Pic credit: Wikipedia)
నేను పుట్టినప్పుడు చూసేందుకు వచ్చిన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీ, ఆమె ఖాళీ టైమ్ పెళ్లి ముహుర్తం: అమీషా పటేల్ (Pic credit: Wikipedia)

రాజకీయ సలహాదారుగా

నెహ్రూ-గాంధీ కుటుంబానికి ఆయన అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు చేపట్టిన ఆయన, ఇందిరా గాంధీకి రాజకీయ సలహాదారుగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యం వల్లే గాంధీ కుటుంబంతో అమీషా పటేల్ ఫ్యామిలీకి విడదీయలేని బంధం ఏర్పడింది.

జాతకాలు వద్దు.. ఇందిరా గాంధీ ఖాళీగా ఉంటే చాలు!

సాధారణంగా మన దేశంలో పెళ్లి అంటే జాతకాలు చూసి ముహూర్తం పెడతారు. కానీ, అమీషా పటేల్ తల్లిదండ్రుల పెళ్లి విషయంలో మాత్రం ఇందిరా గాంధీ మాటే ముహూర్తమైంది. "మా నాన్న పెళ్లి కోసం జాతకాలు చూడలేదు. నా తాతగారు నేరుగా ఇందిరా గాంధీ దగ్గరకు వెళ్లి.. ఇందిరా, నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు? అని అడిగారు. జూలై 4న నేను ఫ్రీగా ఉన్నాను అని ఆమె చెప్పడంతో.. అదే రోజున ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్‌లో పెళ్లి జరిపించారు" అని మహేశ్ బాబు నాని మూవీ హీరోయిన్ అమీషా పటేల్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

పుట్టగానే చూడటానికి వచ్చిన ప్రధాని

తన పుట్టుక గురించి చెబుతూ అమీషా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "నేను బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో పుట్టినప్పుడు, నన్ను చూడటానికి వచ్చిన మొదటి వ్యక్తి ఇందిరా గాంధీ గారే. దేశ ప్రధాని హోదాలో ఉండి కూడా ఆమె మా కుటుంబం కోసం సమయం కేటాయించేవారు" అని అమీషా పటేల్ గర్వంగా చెప్పుకొచ్చారు. ముంబైలోని ప్రసిద్ధ నెహ్రూ ప్లానిటోరియం కూడా తన తాతగారే నెహ్రూ జ్ఞాపకార్థం నిర్మించారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఇంట్లో ప్రముఖుల సందడి

అమీషా చిన్నతనం నుంచే దేశంలోని అగ్రనేతలు, మేధావుల మధ్య పెరిగారు. ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్. హుస్సేన్‌తో పాటు ప్రఫుల్ పటేల్, రాజీవ్ శుక్లా వంటి రాజకీయ నేతలు తరచూ తమ ఇంటికి వచ్చేవారని ఆమె తెలిపారు.

ప్రస్తుతం అమీషా పటేల్ 'గదర్ 2' విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. గతంలో సల్మాన్ ఖాన్ సరసన 'తేరే నామ్' సినిమాలో నటించే అవకాశం వచ్చినా కాదనడం తన కెరీర్‌లో ఒక పెద్ద పొరపాటని ఆమె ఈ మధ్యే ఒప్పుకోవడం విశేషం.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More